లంచ్‌ తర్వాత బెల్లం, నెయ్యి కలిపి తింటే ఎముకలు స్ట్రాంగ్‌.. ఇంకా ఎన్నో లాభాలు

ఆరోగ్యంగా ఉండాలంటే,హెల్తీగా కడుపుకు మేలు చేసేవి తింటే చాలు. వేలకు తినాలి.. వాటిని అరిగించుకోవాలి. మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన అనంత‌రం చిన్న jaggery ముక్క‌ను ghee తో తీసుకోవడం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

లంచ్‌ తర్వాత బెల్లం, నెయ్యి కలిపి తింటే ఎముకలు స్ట్రాంగ్‌.. ఇంకా ఎన్నో లాభాలు
Jaggery and Ghee


ఆరోగ్యంగా ఉండాలంటే..పెద్ద పెద్ద పనులేం చేయనక్కర్లేదు.. హెల్తీగా కడుపుకు మేలు చేసేవి తింటే చాలు. వేలకు తినాలి.. వాటిని అరిగించుకోవాలి. మన పూర్వీకులకు ఇప్పుడున్న రోగాలు ఏం తెలియవు.. ఒక్కొక్కరు అరడజన్‌ మందిని కని.. నూరేళ్లు బతికేశారు. వృధ్యాప్యంలో కూడా వారి పనులు వారే చేసుకోగలిగారు. ఒక్కప్పుడు ఉన్న ఆహార అలవాట్లకు ఇప్పుడున్న ఆహార అలవాట్లకు చాలా తేడా ఉంది. అప్పుడు వారం అంతా దంపుడు బియ్యం తినే..ఎప్పుడో పండగలకు మాత్రమే మిల్లు పట్టించిన బియ్యం తినే వాళ్లు.. ఇప్పుడు పండగలకు బాస్మతి రైస్‌ తింటున్నారు. సరే..మధ్యాహ్నం బోజనం తర్వాత చిన్న jaggery ముక్కను Gheeతో తీసుకుంటే.. అనేక ప్రయోజనాలు కలుగుతాయి తెలుసా..?

మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన అనంత‌రం చిన్న బెల్లం ముక్క‌ను నెయ్యి తీసుకోవడం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. బెల్లంలో ఐర‌న్‌, మెగ్నిషియం, పొటాషియం, విట‌మిన్లు బీ, సీ ఉంటాయి. అదేవిధంగా నెయ్యిలో విట‌మిన్లు ఏ, ఇ, డీ లు ఉంటాయి. అందువ‌ల్ల ఈ రెండింటినీ క‌లిపి తీసుకుంటే దాదాపుగా మ‌న‌కు అన్ని ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ అందుతాయి.
నెయ్యిలో ఉండే విట‌మిన్ కె ఎముక‌లు కాల్షియంను శోషించుకునేందుకు స‌హాయ ప‌డుతుంది. దీంతో ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. బెల్లం, నెయ్యిల‌ను క‌లిపి తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో హార్మోన్లు స‌మ‌తుల్యం అవుతాయి. హార్మోన్ల స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాలు బ‌య‌టకు పోతాయి. మూడ్ మారుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో కొద్దిగా బెల్లం పొడి క‌లిపి మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన వెంట‌నే తినాలి. దీంతో ఈ ప్ర‌యోజ‌నాలు అన్నీ క‌లుగుతాయి.
మన పెద్దోళ్లు అందుకే భోజనం చేసిన తర్వాత.. బెల్లం అందుకే తినేవాళ్లమే.. ఇప్పుడేమో.. అందరూ తిన్న తర్వాత స్వీట్‌ తింటున్నారు.. తీపి కామన్‌గా ఉన్నా.. కారణాలు మాత్రం వేరు. ఇంట్రస్ట్‌ ఉంటే.. మీరు కూడా ట్రే చేయండి.! టేస్ట్‌ కూడా బాగుంటుంది. ఒక్క స్పూనే కదా..!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.