కాఫీ పొడి తో అందం.. నిజమెంత?

కాఫీ.. కాఫీ ప్రియులకు ఈ పేరు వినగానే ఒక రకమైన రిలాక్స్డ్ ఫీలింగ్ వస్తుంది.. ఎంతటి ఒత్తిడి నైనా దూరం చేసి వెంటనే మూడ్ ను చేంజ్ చేయగలిగే శక్తి కాఫీలో ఉంటుంది..

కాఫీ పొడి తో అందం.. నిజమెంత?
Beauty tips for face


కాఫీ.. కాఫీ ప్రియులకు ఈ పేరు వినగానే ఒక రకమైన రిలాక్స్డ్ ఫీలింగ్ వస్తుంది.. ఎంతటి ఒత్తిడి నైనా దూరం చేసి వెంటనే మూడ్ ను చేంజ్ చేయగలిగే శక్తి కాఫీలో ఉంటుంది.. రోజుకొకసారైనా కాఫీ ని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చని కూడా తెలుస్తోంది అయితే ఈ కాఫీ ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా మేలు చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇందులో నిజం ఎంత ఒకసారి చూద్దాం.. 

కాఫీ పొడిని ఉపయోగించడం వల్ల అందం మెరుగుపడుతుందా..  దీనిపై ఇప్పటికే ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి..  అయితే ఇది నిజమే అంటున్నాయి కొన్ని అధ్యయనాలు.. కాఫీ పౌడర్ కచ్చితంగా శరీరానికి మేలు చేస్తుందని ఇందులో తేలింది.. కొందరికి కళ్ళు ఉబ్బినట్టు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్లు కాఫీ పౌడర్ ను కొంచెం నీటిలో కలిపి దూదితో కంటి పైన అప్లై చేయడం వల్ల ఈ సమస్య నుంచి గట్టెక్కొచ్చు అని తెలుస్తోంది..

అలాగే కొందరికి మొహం మీద మచ్చలు వచ్చి చర్మం నిర్జీవంగా అయినట్టు కనిపిస్తుంది ఇలాంటివారు కాఫీ పడిన తరచు మొహానికి అప్లై చేయడం వల్ల నిగారింపు కోల్పోయిన చర్మం మళ్లీ కాంతివంతంగా మారుతుంది.. అలాగే మొటిమలు మచ్చలు వంటి వాటిని దూరం చేయడంలో కూడా ఈ కాఫీ పొడి ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

అలాగే లాప్టాప్ ఫోన్ స్క్రీన్ వంటి వాటిని ఎక్కువగా చూడటం వల్ల కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి ఇలాంటివారు కాఫీ పొడిని తేనెలో కలిపి కళ్ళ చుట్టూ నెమ్మదిగా మర్దన చేయడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.. అయితే ఎంత మేలు చేసినా దీన్ని ఉపయోగించడంలో మాత్రం అతి పనికిరాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు అంతేకాకుండా ఉపయోగించే కాఫీ పోటీని మంచిది తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.