Cinnamon and Honey : దాల్చిన చెక్క, తేనె కలిపి తీసుకుంటే గజ్జి, తామర, ఆర్థరైటిస్‌, అధిక కొలెస్ట్రాల్‌ అన్నింటికి చెక్‌..!

Cinnamon , Honey కలిపి తీసుకోవడం గురించి మీరు విన్నారా..? ఈ రెండింటి కాంబినేషన్.. అద్భుతంగా ఉంటుంది. వీటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, దగ్గు, జలుబు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. ఈ రెండింటి మిశ్రమాన్ని ఏ విధంగా తీసుకుంటే ఏయే అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చో ఓసారి చూద్దామా..!

Cinnamon and Honey : దాల్చిన చెక్క, తేనె కలిపి తీసుకుంటే గజ్జి, తామర, ఆర్థరైటిస్‌, అధిక కొలెస్ట్రాల్‌ అన్నింటికి చెక్‌..!
Cinnamon-and-Honey-controls-Scabies,-Eczema,-Arthritis,-High-cholesterol


Cinnamon వంటల్లోనే కాదు.. ఆయుర్వేదం పరంగానూ దీనికి మంచి ప్రాముఖ్యత ఉంది. ఎన్నో వ్యాధులకు దివ్య ఔషధంగా Cinnamon  పనిచేస్తుంది. Cinnamon వాటర్‌ తాగడం వల్ల అధికబరువు, Diabetes వంటి సమస్యలు తగ్గుతాయని అందిరికీ తెలిసిన విషయమే..! దాల్చిన చెక్క, Honey కలిపి తీసుకోవడం గురించి మీరు విన్నారా..? ఈ రెండింటి కాంబినేషన్.. అద్భుతంగా ఉంటుంది. వీటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, దగ్గు, జలుబు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. ఈ రెండింటి మిశ్రమాన్ని ఏ విధంగా తీసుకుంటే ఏయే అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చో ఓసారి చూద్దామా..!

తేనె, దాల్చినచెక్క కలిపి తీసుకోవడం వల్ల ఉపయోగాలు..

తేనె, దాల్చినచెక్క మిశ్రమం మొటిమలను తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఒక టీస్పూన్‌ దాల్చినచెక్క పొడి, మూడు టేబుల్‌ స్పూన్ల తేనెను తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని మొటిమలపై రాయండి..రాత్రంతా అలాగే వదిలేయాలి. దీంతో మొటిమలు తగ్గుతాయి. రోజూ ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. దీంతోపాటు ఇతర చర్మ సమస్యలకు కూడా ఈ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. ముఖ్యంగా గజ్జి, తామర, ఇతర చర్మ ఇన్‌ఫెక్షన్లు ఈ మిశ్రమంతో తగ్గుతాయి.
తేనె, దాల్చిన చెక్కల మిశ్రమాన్ని రోజూ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. శరీరంలోని బాక్టీరియా, వైరస్‌లు నశిస్తాయి. ఈ రెండింటిలోనూ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ మిశ్రమం యాంటీ బాక్టీరియల్‌ లక్షణాలను కలిగి ఉంటుంది. దీంతో జీర్ణవ్యవస్థ సరిగ్గా ఉంటుంది. అలాగే జీర్ణాశయ సమస్యలు తగ్గుతాయి. జీర్ణాశయ ఆరోగ్యం మెరుగు పడుతుంది.
ఆర్థరైటిస్‌ నొప్పులను తగ్గించడంలోనూ తేనె, దాల్చిన చెక్క మిశ్రమం బాగా పనిచేస్తుంది. ఒక టీస్పూన్‌ తేనె, అంతే మోతాదులో దాల్చిన చెక్క పొడిలను గోరు వెచ్చని నీటిలో వేసి బాగా కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. దాన్ని నొప్పి ఉన్న ప్రదేశంలో రాయాలి. అలాగే ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో రెండు టీస్పూన్ల తేనె, ఒక టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడిలను కలిపి రోజూలో ఒకసారి తాగాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆర్థరైటిస్‌ నొప్పులు తగ్గుతాయి.
అధిక కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడేవారు తేనె, దాల్చిన చెక్క మిశ్రమాన్ని రోజూ తీసుకుంటే కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి. కొలెస్ట్రాల్‌ అధికంగా ఉంటే రక్త నాళాల్లో పేరుకుపోయి.. గుండె జబ్బులు వస్తాయి. ముఖ్యంగా హార్ట్‌ ఎటాక్‌లు వస్తాయి. అందువల్ల అవి రాకుండా ఉండాలంటే కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలి. ఇందుకు గాను మూడు టీస్పూన్ల దాల్చిన చెక్క పొడి, రెండు టీస్పూన్ల తేనెను టీ డికాషన్‌లో కలిపి తాగాలి. రోజూ ఇలా చేస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి.
మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారికి కూడా తేనె, దాల్చినచెక్క పొడి మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. మూత్రాశయంలో ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. ఒక టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడి, అర టీస్పూన్‌ తేనెలను ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో కలిపి రోజుకు ఒక్కసారి తీసుకుంటే మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
అధిక బరువును తగ్గించుకోవాలంటే రోజూ తేనె, దాల్చిన చెక్క పొడి మిశ్రమాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.. ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా తేనె, దాల్చిన చెక్క పొడిలను కలిపి రోజుకు మూడు సార్లు తీసుకోవాలి. దీంతో బరువు త్వరగా తగ్గవచ్చు. ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది.
తేనె, దాల్చిన చెక్కలలో దృఢమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల చిగుళ్ల సమస్యలు, దంతాల ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. తేనె, దాల్చినచెక్క పొడి కలిపిన పేస్ట్‌ను దంతాలు, చిగుళ్లపై రాయాలి. రోజూ ఇలా చేస్తే నోరు శుభ్రంగా ఉంటుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
దగ్గు, జలుబును తగ్గించేందుకు కూడా తేనె, దాల్చిన చెక్క మిశ్రమం పనిచేస్తుంది. రెండింటిలోనూ యాంటీ బాక్టీరియల్‌, యాంటీ వైరల్‌, యాంటీ మైక్రోబియల్‌ లక్షణాలు ఉంటాయి.
ఈ రెండింటి కాంబినేషన్‌ ఏ ఇంగ్లీష్‌ మందును తీసిపోదు.. కాబట్టి పైన పేర్కొన్న సమస్యలు ఉన్నవారి వీటిని ట్రై చేయండి. అయితే ఏదైనా తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. అధికంగా తేనె తిన్నా ఏం కాదు కానీ.. దాల్చిన చెక్కను మాత్రం మోతాదుకు మించి తీసుకుంటే గుండెల్లో, కడుపులో మంటగా ఉంటుంది.!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.