Weight lose : బరువు తగ్గాలంటే.. బాడీ మెటబాలిజంను పెంచుకోండి చాలు..!

మనం తిన్న ఆహారం నుంచి లభించే శక్తిని శరీరం ఖర్చు చేసే రేటునే Metabolism అంటారు. Metabolism అంటే క్యాలరీలను ఖర్చు చేసే మిషన్‌ లాంటిదే. సో బాడీలో మెటబాలిజం బాగుంటే. ఆటోమెటిగ్గా క్యాలరీలు ఖర్చుఅయిపోతాయి. తద్వారా మనిషి బరువు పెరగడు.

Weight lose : బరువు తగ్గాలంటే.. బాడీ మెటబాలిజంను పెంచుకోండి చాలు..!
Increase body Metabolism to lose Weight


Weight loss : చాలామందికి Metabolism గురించి పెద్దగా తెలియదు.. బాడీలో ఇది ఎంత కరెక్టుగా ఉంటుందో.. ఆ వ్యక్తి అంత ఆరోగ్యంగా ఉంటాడు.. మనం తిన్న ఆహారం నుంచి లభించే శక్తిని శరీరం ఖర్చు చేసే రేటునే Metabolism అంటారు. క్యాలరీలు బాగా ఖర్చుచేసే వ్యక్తికి మెటబాలిజం ఎక్కువగా ఉంటుంది. మెటబాలిజం ఎక్కువగా ఉంది అంటే ఆ వ్యక్తి హెల్తీగా ఉన్నట్లు.. క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అయ్యాయి అంటే.. వాళ్లు సన్నగా ఉన్నట్లు.. సో.. మెటబాలిజంకు, బరువుకు దగ్గరి సంబంధం ఉంది. ఈ విషయం చాలామందికి తెలియదు. సింపుల్గా చెప్పాలంటే.. మెటబాలిజం అంటే.. క్యాలరీలను ఖర్చు చేసే మిషన్‌ లాంటిదే.. సో.. బాడీలో మెటబాలిజం బాగుంటే.. ఆటోమెటిగ్గా క్యాలరీలు ఖర్చుఅయిపోతాయి.. తద్వారా మనిషి బరువు పెరగడు.. మరి మెటబాలిజం బాగుండాలంటే ఏం చేయాలి..? మెటబాలిజం పెంచే ఆహారాలు తినాలి.? అవేంటంటే..

అవిసె గింజ‌ల్లో ప్రోటీన్లు, విట‌మిన్లు, ఇత‌ర ముఖ్య‌మైన పోష‌కాలు ఉంటాయి. ఇవ‌న్నీ మెట‌బాలిజంను పెంచుతాయి. రోజూ గుప్పెడు అవిసె గింజ‌ల‌ను తింటే మేలు జ‌రుగుతుంది.
ప‌ప్పు దినుసులను రోజూ తీసుకుంటున్నా మెట‌బాలిజం పెరుగుతుంది. వాటిల్లో ఉండే ప్రోటీన్లు మెట‌బాలిజంను పెంచుతాయి.
మిర‌ప‌కాయ‌లు కారంగా ఉంటాయ‌ని చాలా మంది వీటిని ఎక్కువగా వాడరు.. కానీ రోజూ కారంను కూడా తినాలి. మిర‌ప‌కాయ‌ల్లో కాప్సెయిసిన్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది మెట‌బాలిజంను మెరుగు ప‌రుస్తుంది. అధిక బ‌రువు త‌గ్గేందుకు దోహ‌ద‌ప‌డుతుంది.రోజూ ఆహారంలో సరిపడా కారం ఉండేలా చూసుకోవాలి.
రోజూ ఆహారంలో అల్లంను చేర్చుకోవ‌డం వ‌ల్ల కూడా మెట‌బాలిజంను పెంచుకోవ‌చ్చు. ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే అల్లం ర‌సం తాగండి.. లేదా భోజ‌నం చేసే ముందు కూడా దాన్ని తీసుకోవ‌చ్చు. దీంతో మెట‌బాలిజం మెరుగు ప‌డుతుంది.
కోడిగుడ్ల‌లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల గుడ్ల‌ను తింటే శ‌రీర మెట‌బాలిజంను పెంచుకోవ‌చ్చు. దీంతో క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేయ‌వ‌చ్చు. కాబట్టి.. రోజూ ఆహారంలో కోడిగుడ్ల‌ను తీసుకోవాలి. రోజుకు ఒక ఉడ‌క‌బెట్టిన గుడ్డును తింటే శ‌రీర మెటబాలిజం పెరుగుతుంది. అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డానికి ఇది సహాయపడుతుంది.
రోజూ రెండు క‌ప్పుల గ్రీన్ టీని తాగితే శ‌రీర మెటబాలిజం 20 శాతం మేర మెరుగుప‌డుతుంది. ఈ విష‌యాన్ని సైంటిస్టులే త‌మ అధ్య‌య‌నాల్లో వెల్ల‌డించారు. కాబ‌ట్టి గ్రీన్‌టీని తాగ‌డం వ‌ల్ల మెట‌బాలిజంను పెంచుకుని అధిక బ‌రువును ఈజీగా త‌గ్గించుకోవ‌చ్చు.
రోజూ కాఫీ తాగ‌డం వ‌ల్ల కూడా మెట‌బాలిజం పెరుగుతుంది. కానీ అందులో చ‌క్కెర లేకుండా తాగాలి..
పాల‌కూర‌, క్యాబేజీ వంటి ఆకుప‌చ్చ‌ని ఆకుకూర‌లు, కూర‌గాయ‌ల‌ను రోజూ తీసుకుంటే మెట‌బాలిజం మెరుగు ప‌డుతుంది. అవి బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డ‌తాయి.
కాబట్టి.. ఈ ఆహారాలను తినండి. మెటబాలిజంను పెంచుకోండి.. తద్వారా బరువును తగ్గించుకోండి.. లాజిక్‌ అదిరింది కదా..!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.