Kidney stones : కిడ్నీలో రాళ్లు ఉన్నాయని తెలిసిన వెంటనే తక్షణమే ఆపేయాల్సిన ఆహారం ఏంటంటే..

Kidney stones రావడానికి చాలా కారణాలు ఉంటాయి. భరించలేనంతగా పొత్తికడుపులో మొదలైన నొప్పి క్రమంగా ఎడమవైపుకు పాకుతుంది. క్షణాల్లో మనిషి కూర్చొని నిల్చోలేనంతగా బాధ పెరిగిపోతుంది. చిన్నగా మొదలైన ఈ సమస్య కొన్నిసార్లు ప్రమాదంగా మారుతుంది.

Kidney stones : కిడ్నీలో రాళ్లు ఉన్నాయని తెలిసిన వెంటనే తక్షణమే ఆపేయాల్సిన ఆహారం ఏంటంటే..
Stop eating this when you have kidney stones


Kidney stones రావడానికి చాలా కారణాలు ఉంటాయి. భరించలేనంతగా పొత్తికడుపులో మొదలైన నొప్పి క్రమంగా ఎడమవైపుకు పాకుతుంది. క్షణాల్లో మనిషి కూర్చొని నిల్చోలేనంతగా బాధ పెరిగిపోతుంది. చిన్నగా మొదలైన ఈ సమస్య కొన్నిసార్లు ప్రమాదంగా మారుతుంది. ఆపరేషన్ కు దారితీస్తుంది. కిడ్నీలో రాళ్ళను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను తేలికగా అదుపులో ఉంచుకోవచ్చని తెలుస్తోంది.

సాధారణంగా kidney stones  కిడ్నీలోనే కాకుండా గాల్బ్లాడర్ లోను సైతం తయారయ్యే అవకాశం ఉంది. అయితే కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి పలు రకాల కారణాలు ఉంటాయి. తీసుకునే ఆహారం, నీరు, శరీరాన్ని శుభ్రం చేసుకోకపోవడం వంటి ఎన్నో కారణాలు ఈ సమస్యకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమస్య ఆడవారిలో కన్నా మగవారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

రాళ్లు ఎలా తయారవుతాయి అంటే..

శరీరానికి తగిన మోతాదులో నీరు అందనప్పుడు ఖనిజాలు గట్టిపడి చిన్న చిన్న రేణువులుగా తయారవుతాయి. ఇవి కాస్త పెరిగి గులకలుగా మారి విత్తనాల సైజుకి కొన్నిసార్లు వెళ్లిపోతాయి. ముఖ్యంగా ఇవి చాలా గట్టిగా ఉంటాయి. కిడ్నీ శరీరంలో ఉన్న వ్యర్ధాలని వడపోసేటప్పుడు కిడ్నీ అంచులలో కానీ, మూత్రవాహికలో కానీ, ఈ అవశేషాలు మిగిలిపోతాయి. ఆ సమయంలోనే వాటి చుట్టూ రక్తం చేరి పొత్తు కడుపున వీపు భాగంలో కుడి ఎడమ ఎటువైపైన విపరీతంగా నొప్పి వస్తుంది. హఠాత్తుగా ప్రారంభమైన ఈ నొప్పి ప్రసవ వేదన కన్నా తీవ్రంగా మారుతుంది.

వ్యాధి లక్షణాలు ఏంటంటే

వాంతులు, వికారంతోపాటు మూత్రంలో రక్తపు చారికలు కనిపిస్తాయి. అలాగే రక్తంతో పాటు చీము కూడా మూత్రంలో వస్తూ ఉంటుంది. నులి పెడుతున్నట్టుగా నొక్కుతున్నట్టుగా కడుపులో మొదలైన నొప్పి వెనుక భాగానికి దారితీస్తుంది.

కారణాలు ఏంటంటే

మన శరీరంలో తెలియని ఘన పదార్థాలు పేరుకుపోవడం, నీటిని తక్కువగా తీసుకోవడం, ఆహారం సరిగ్గా తినకపోవడం, పుల్లటి పదార్థాలు ఎక్కువగా తినటం వంటివి ముఖ్యమైన కారణాలు.

ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే

కిడ్నీలో రాళ్లు ఉన్నాయని తెలిసిన వెంటనే తప్పనిసరిగా కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం మానేయాలి. అందులో ముఖ్యంగా క్యాబేజీ, కాలీఫ్లవర్, మునక్కాడ, టమోటా, పాలకూర వంటి కాల్షియం ఎక్కువగా ఉన్న పదార్థాలను మానేయాలి. పాలు కూడా ఎక్కువగా తాగకూడదు. ద్రవపదార్థాలను తీసుకోవాలి. నీళ్లు, పళ్ళరసాలు వంటి వాటిని తాగాలి. అలాగే ఊరగాయలు, పులుపు పదార్థాలు తీసుకోకూడదు. మద్యం నిషేధించాలి. పప్పును కూడా తగ్గించాలి. కొబ్బరి నీళ్లను తీసుకోవాలి. అలాగే పుచ్చకాయ, వెల్లుల్లి వంటివి తీసుకోవటం మంచిది. ముఖ్యంగా ఈ వ్యాధి ఉన్నవారు రాగి చెంబులో ఉంచిన నీటిని తాగటం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. బయట దొరికే అన్ని రకాల పదార్థాలను తీసుకోవడం ఆపేయాలి. పిజ్జా, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.