Kalonji seeds : బరువు తగ్గాలా కాలోంజి విత్తనాలను ట్రై చేయండి.. రిజల్ట్‌ పక్కా..!!

Kalonji seeds గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..?ఇందులో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. వీటిని Nigella seeds అని కూడా అంటారు. బరువు తగ్గించడంలో ఈ విత్తనాలు నెంబర్‌ వన్‌గా పనిచేస్తాయి.

Kalonji seeds : బరువు తగ్గాలా కాలోంజి విత్తనాలను ట్రై చేయండి.. రిజల్ట్‌ పక్కా..!!
Try Kalonji seeds to lose weight


Kalonji seeds గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? అసలు వాటిని చూశారా..? చాలామంది ఇళ్లలో వీటిని మసాల దినుసుగా వాడతారు. ఇది కేవలం మసాల దినుసు మాత్రమే కాదు.. ఇందులో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. వీటిని Nigella seeds అని కూడా అంటారు. బరువు తగ్గించడంలో ఈ విత్తనాలు నెంబర్‌ వన్‌గా పనిచేస్తాయి. ఈ కాలోంజి విత్తనాలను ఎలా వాడాలో చూద్దామా..!

కాలోంజి విత్త‌నాల‌ను తీసుకుని ఒక పాత్ర‌లో వేసి అందులో స‌గం నిమ్మ‌కాయ‌ను పూర్తిగా పిండాలి. ఆ పాత్ర‌ను ఎండ‌లో 1-2 రోజుల పాటు అలాగే ఉంచాలి. త‌రువాత ఆ మిశ్ర‌మాన్ని రోజుకు 2 సార్లు తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గుతారు.
చిటికెడు కాలోంజి విత్త‌నాల‌ను తీసుకుని వాటిని నేరుగా మింగేయాలి. వెంట‌నే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిని తాగండి. ఇలా రోజూ ఉద‌యం చేస్తే..అధిక బ‌రువు త‌గ్గుతారు.
చిటికెడు కాలోంజి విత్త‌నాల‌ను తీసుకుని పొడి చేయండి. . దాన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో వేసి బాగా క‌ల‌పండి.. అందులో ఒక టీస్పూన్ తేనె, కొద్దిగా నిమ్మ‌ర‌సం క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని గోరు వెచ్చ‌గా ఉండ‌గానే ప‌ర‌గ‌డుపునే తాగేయాలి. ఇలా రోజూ చేస్తే అధిక బ‌రువును త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌చ్చు.
రాత్రి పూట కొన్ని కాలోంజి విత్త‌నాల‌ను ఒక గ్లాస్ నీటిలో వేసి నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ఆ విత్త‌నాల‌ను తీసేసి ఆ నీటిని ప‌ర‌గ‌డుపునే తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు.
అయితే ఈ విత్తనాలను మోతాదుగు మించి వాడకూడదు. ఎక్కువగా వాడితే.. జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. త‌గిన మోతాదులోనే వాటిని వాడుకోవాలి. ఈరోజుల్లో అధిక బరువుతో చాలా మంది బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎన్నో కఠినమైనట డైట్స్‌ను కూడా పాటిస్తున్నారు. బరువు తగ్గాలంటే.. తిండి మానేయక్కర్లేదు. మార్చేస్తే చాలు.. బయటి ఫుడ్స్‌ను తగ్గించి మెటబాలిజం పెంచుకోవాలి. అంతే బరువు తగ్గడం పెద్ద సమస్యే కాదు.!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.