Weight loss : వెయిట్‌ లాస్‌ అవ్వాలా. అయితే సాల్ట్‌ను సైడ్‌ చేయండి.!

Weight తగ్గాలన్నా కూడా Salt ను మానేయాలి.. Salt కు Weight కు ఏంట్రా సంబంధం అనుకుంటున్నారా..? Salt కు శరీరంలో నీటిని, కొవ్వును నిల్వ చేసే గుణం ఉంటుంది.

Weight loss : వెయిట్‌ లాస్‌ అవ్వాలా. అయితే సాల్ట్‌ను సైడ్‌ చేయండి.!
Avoid salt for weight loss


Over weight తో బాధపడేవారు..Weight loss అవ్వాలని ఏవేవో తింటారు కానీ.. ఇంటి దొంగను మాత్రం పట్టుకోలేరు. ఇంటి దొంగ ఎవరా అనుకుంటున్నారా.. మీరు వాడే salt.. కూరల్లో, డ్రింక్స్‌లో, ఫ్రూట్స్‌లో ఇలా ఎక్కడపడితే అక్కడ salt ను వాడేస్తున్నారు. మీరు బరువు తగ్గించుకోవాలంటే.. ముందు ఉప్పును తగ్గించాలి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అధిక మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో హైబీపీ ఒక‌టి. ఉప్పును ఎక్కువ‌గా తిన‌డంతో పాటు ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా ఈ స‌మ‌స్య వ‌స్తుంటుంది. అందువ‌ల్ల రోజూ ఉప్పు వాడ‌కాన్ని త‌గ్గించాలి. వంట‌ల్లో ఉప్పు ఉండ‌డం అవ‌స‌ర‌మే. కానీ దాన్ని అతిగా తీసుకుంటే మాత్రం ప్ర‌మాదం. రోజూ ఉప్పును ఎక్కువ‌గా తీసుకుంటే అప్పుడు శ‌రీరంలో సోడియం స్థాయిలు పెరిగిపోతాయి.  

రోజూ ఉప్పును అధికంగా తీసుకుంటే శ‌రీరంలో సోడియం లెవ‌ల్స్ పెరిగిపోతాయి. దీంతో ఆ సోడియంను బ‌య‌ట‌కు పంపేందుకు కిడ్నీలు శ్ర‌మిస్తాయి. ఇందుకు నీళ్లు ఎక్కువ‌గా తాగాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో శ‌రీరం త‌న‌కు నీటిని కావాల‌ని దాహం రూపంలో తెలియ‌జేస్తుంది. దాహం ఎక్కువ‌గా అవుతుంటే అది షుగ‌ర్ వ‌ల్ల అయినా లేదా ఉప్పును ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల అయినా కారణం అవుతుంది. మీకు షుగ‌ర్ లేక‌పోతే.. దాహం ఎక్కువ‌గా అవుతుంటే అది ఉప్పును ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్లే వ‌చ్చింద‌నే అర్థం. దీంతో ఉప్పు వాడ‌కాన్ని త‌గ్గించాలి. ఈ క్ర‌మంలో స‌హ‌జంగానే దాహం స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది.
రోజూ ఉప్పును ఎక్కువ‌గా తీసుకుంటే శ‌రీరం వాపుల‌కు గుర‌వుతుంది. ఈ ల‌క్ష‌ణం క‌నిపిస్తే ఉప్పును అధికంగా తింటున్నారేమో చెక్ చేసుకోవాలి. అధికంగా తింటే ఉప్పు వాడ‌కాన్ని త‌గ్గించాలి.
ఉప్పును అధికంగా తిన‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి బాగా వ‌స్తుంది. అందువ‌ల్ల త‌ర‌చూ త‌ల‌నొప్పి వ‌స్తుంటే అది అధిక ఉప్పు వాడ‌కం వ‌ల్ల వ‌చ్చిందేమో చెక్ చేసుకోవాలి. అవ‌స‌రం అయితే ఉప్పును తీసుకోవ‌డం త‌గ్గించాలి. దీంతో త‌ల‌నొప్పి కూడా త‌గ్గుతుంది.
ఉప్పును ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో సోడియం స్థాయిలు పెరిగి ఎముక‌లు బ‌ల‌హీనంగా మారతాయి.. దీంతో ఎముక‌లు నొప్పిగా ఉంటాయి. ఇలా జ‌రిగితే ఉప్పు వాడ‌కాన్ని తగ్గించాల్సిందే.  
రోజుకు 2,300 మిల్లీగ్రాముల వ‌ర‌కు ఉప్పును మనం తిన‌వ‌చ్చు. అదే హైబీపీ ఉన్న‌వారు అయితే రోజుకు 1500 మిల్లీగ్రాముల మోతాదులో మాత్ర‌మే తీసుకోవాలి. లేదంటే స్ట్రోక్స్ వ‌చ్చి ప‌రిస్థితులు ప్రాణాంత‌కంగా మారుతాయి.
ఇక బరువు తగ్గాలన్నా కూడా ఉప్పును మానేయాలి.. ఉప్పుకు బరువు ఏంట్రా సంబంధం అనుకుంటున్నారా..? ఉప్పుకు శరీరంలో నీటిని, కొవ్వును నిల్వ చేసే గుణం ఉంటుంది. ఇలా నిల్వ చేయడం వల్ల శరీరంలో బరువు త్వరగా పెరుగుతారు. బాడీలో ఎంత ఉప్పు స్టోరై ఉంటుందో.. అంత కొవ్వు స్టాక్‌ ఉన్నట్లే.. ఉప్పును వీలైనంత వరకు తగ్గించండి.. అనారోగ్య సమస్యలను దూరంగా ఉంచండి.!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.