Bad cholesterol ను తగ్గించాలంటే.. ఈ ఆయుర్వేద చిట్కాలు ఫాలో అవ్వండి చాలు..

Bad cholesterol ను తగ్గించుకోవడానికి వ్యాయామం చేయడం ఒక పద్ధతి అయితే ఫుడ్‌ ద్వారా కూడా తగ్గించుకోవచ్చు. ఈ ఆయుర్వేద ఔష‌ధాల‌ను వాడితే బాడీలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది.

Bad cholesterol ను తగ్గించాలంటే.. ఈ ఆయుర్వేద చిట్కాలు ఫాలో అవ్వండి చాలు..
Ayurvedic tips to reduce bad cholesterol


మన శరీరంలో bad cholesterol ఎక్కువైతే చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా Heart attack రావడానికి కారణం.. bad cholesterol ఎక్కువ అవడమే.. ఇది రాకుండా ఉండటానికి మనం జంక్‌ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. అది ఎలాగూ మనతోని అయ్యేపని కాదు.. మరి వచ్చినదాన్ని వదిలించుకోవడం అయినా చేయాలి కదా..! లేకుంటే అధిక బరువు కూడా వచ్చేస్తుంది.. మరి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి వ్యాయామం చేయడం ఒక పద్ధతి అయితే ఫుడ్‌ ద్వారా కూడా తగ్గించుకోవచ్చు. ఈ ఆయుర్వేద ఔష‌ధాల‌ను వాడితే బాడీలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది.
శ‌రీరంలోని ఎల్‌డీఎల్‌ ( చెడు కొలెస్ట్రాల్‌) త‌గ్గించ‌డంలో గుగ్గులు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇవి మ‌న‌కు ఆయుర్వేద మందుల షాపుల్లో ల‌భిస్తాయి. డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు లేదా ప్యాక్‌పై సూచించిన విధంగా వీటిని వాడ‌వ‌చ్చు. దీంతో ఎల్‌డీఎల్ స్థాయిల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.
 

ఎల్‌డీఎల్‌ను త‌గ్గించి హెచ్‌డీఎల్‌ను పెంచేందుకు అర్జున ట్యాబ్లెట్లు కూడా బాగా ప‌నిచేస్తాయి. ఈ మూలిక‌కు చెందిన ట్యాబ్లెట్ల‌ను కూడా ఆయుర్వేద మందుల షాపుల్లో కొన‌వ‌చ్చు. ప్యాక్‌పై సూచించిన విధంగా వాడ‌వ‌చ్చు. ఈ మూలిక ఎల్‌డీఎల్‌ను త‌గ్గించి హెచ్‌డీఎల్ స్థాయిల‌ను పెంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఆయుర్వేదంలో శిలాజిత్‌కు ఎంతో ప్రాధాన్య‌త ఉంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఆయుర్వేద మందుల షాపుల్లో శిలాజిత్ ట్యాబ్లెట్లు ల‌భిస్తాయి. వీటిని కూడా వాడుకోవ‌చ్చు.
వృక్ష‌మాల అనే మూలిక కూడా చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తుంది. అధిక బ‌రువును త‌గ్గించ‌డంతోపాటు బ‌రువును నియంత్ర‌ణ‌లో ఉంచుతుంది. అందువ‌ల్ల దీన్ని కూడా వాడ‌వ‌చ్చు.
ఇక ఇవే కాకుండా రోజూ ఉద‌యం రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను ప‌ర‌గడుపునే ప‌చ్చిగా అలాగే తినండి. డైరెక్టుగా తినలేని వాళ్లు వీటిని రోస్ట్‌ చేసుకుని తినొచ్చు. దీనివల్ల నోరు చెడిపోదు. అలాగే రోజుకు రెండు సార్లు భోజ‌నానికి ముందు 30 ఎంఎల్ ఉసిరికాయ జ్యూస్‌ను తాగాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ త‌గ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వ‌ల్ల గుండె ప‌దిలంగా ఉంటుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.