Ghee : రోజూ పరగడుపున ఒక స్పూన్‌ నెయ్యి తింటే ఏమవుతుందో తెలుసా..?

పురాతన కాలం నుంచి Ghee  ఎన్నో వంటల్లో వాడే అలవాటు భారతీయులకు ఉంది. ఇప్పటికీ అందరి ఇళ్లలో చిన్నGhee డ‌బ్బా ఉంటుంది. పప్పు, ఆవకాయతో నెయ్యి కాంబినేషన్‌ తెలుగు వాళ్లకు ఎప్పుడూ నెంబర్‌ వన్‌.

Ghee  : రోజూ పరగడుపున ఒక స్పూన్‌ నెయ్యి తింటే ఏమవుతుందో తెలుసా..?
Benefits of ghee


పురాతన కాలం నుంచి Ghee  ఎన్నో వంటల్లో వాడే అలవాటు భారతీయులకు ఉంది. ఇప్పటికీ అందరి ఇళ్లలో చిన్నGhee డ‌బ్బా ఉంటుంది. పప్పు, ఆవకాయతో నెయ్యి కాంబినేషన్‌ తెలుగు వాళ్లకు ఎప్పుడూ నెంబర్‌ వన్‌.. నెయ్యిని ఆహారంలో, స్వీట్‌ ఐటమ్స్‌లో విరివిగా వాడుతుంటారు. నెయ్యి తింటే బరువు పెరుగుతారు, పింపుల్స్‌ వస్తాయి అని చాలామంది దాని జోలికి వెళ్లరు..కానీ మీకు తెలుసా.. ఆయుర్వేద ప్ర‌కారం.. నెయ్యి మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. రోజూ పరగడుపునే ఒక స్పూన్‌ నెయ్యి తింటే.. ఏం జరుగుతుందో.. మీరు ఊహించలేరు.. చాలా లాభాలు ఉన్నాయండీ..!! 

నెయ్యిని తిన‌డం వల్ల మ‌న‌కు విట‌మిన్ డి ల‌భిస్తుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూస్తుంది. డ‌యాబెటిస్‌ను అదుపు చేస్తుంది. బ‌రువు త‌గ్గ‌డంలో స‌హాయ ప‌డుతుంది. కాబట్టి రోజూ ఉదయాన్నే నెయ్యిని తీసుకోవాలి.
నెయ్యిని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ శుభ్రంగా మారుతుంది. దీంతో తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. అజీర్ణం స‌మ‌స్య ఉండ‌దు. మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్ త‌గ్గుతాయి. మలబద్దకం సమస్య అంత చిన్నది ఏం కాదు.. దీని వల్ల పైల్స్‌ కూడా వస్తాయి..
చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు నెయ్యిని తిన‌డం వ‌ల్ల ఎంతో మేలు జ‌రుగుతుంది. దీంతో చ‌ర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. చ‌ర్మ స‌మస్య‌లు త‌గ్గుతాయి.
ఆక‌లిని అణ‌చుకోలేని వారు, అతిగా తినేవారు నెయ్యిని తింటే ఎంతో మేలు చేస్తుంది. కొంతమందికి ఎంత తిన్నా మళ్లీ వెంటనే ఆకలి వేస్తుంది.. దీంతో ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. అతిగా తిన‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండ‌వ‌చ్చు. ఇది అధిక బ‌రువును త‌గ్గించేందుకు స‌హాయ ప‌డుతుంది. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రుగుతుంది.
నెయ్యిని తిన‌డం వ‌ల్ల శ‌రీర శ‌క్తి సామ‌ర్థ్యాలు పెరుగుతాయి. రోజూ నీర‌సంగా, నిస్స‌త్తువ‌గా ఉండేవారు, శారీర‌క శ్ర‌మ‌, వ్యాయామం ఎక్కువ‌గా చేసేవారు.. నెయ్యిని తింటే చురుగ్గా మారుతారు. ఉత్సాహంగా ప‌నిచేస్తారు. ఎంత ప‌నిచేసినా అల‌సిపోరు.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి.. హ్యపీగా తినేయొచ్చు..అయితే రోజుకు ఒక స్పూన్‌ మాత్రమే తినాలి.. ఎక్కువ మోతాదులో తీసుకుంటే.. ఫ్యాట్‌ ఎక్కువవతుంది. దాని వల్ల మీరు అనుకునే సమస్యలు వస్తాయి.. అతిగా కాకుండా.. ఒక స్పూన్‌ మోతాదులో తీసుకుంటే పైన చెప్పిన ప్రయోజనాలు అన్నీ పొందవచ్చు. 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.