మీరు నగ్నంగా ఉన్నట్లు కల వస్తే దాని అర్థం ఏంటో తెలుసా..? బయటకు చెప్పాల్సింది చాలా ఉంది..!!

మనకు వచ్చే కలలు కొన్నిసార్లు ఘోరంగా భయపెడతాయి. వామ్మో ఇదంతా కల అయితే బాగుండు అని కలలోనే అనుకుంటారు. పబ్లిక్‌ ప్లేస్‌లో బట్టలు లేకుండా ఉన్నట్లు మీకు ఎప్పుడైనా కల వచ్చిందా. చాలామందికి

మీరు నగ్నంగా ఉన్నట్లు కల వస్తే దాని అర్థం ఏంటో తెలుసా..? బయటకు చెప్పాల్సింది చాలా ఉంది..!!


మనకు వచ్చే కలలు కొన్నిసార్లు ఘోరంగా భయపెడతాయి. వామ్మో ఇదంతా కల అయితే బాగుండు అని కలలోనే అనుకుంటారు. పబ్లిక్‌ ప్లేస్‌లో బట్టలు లేకుండా ఉన్నట్లు మీకు ఎప్పుడైనా కల వచ్చిందా. చాలామందికి ఇలాంటి కలలో వాళ్ల జీవితంలో తరచూ వస్తుంటాయట. స్వప్న శాస్త్రం ఈ కలకు మీనింగ్‌ ఏంటో చెప్తుంది. మీరు కూడా తెలుసుకోండి.  
Vitamin B6 found to aid dream recall, and potentially enable lucid dreaming
ఒక వ్యక్తి తనను తాను బట్టలు లేకుండా నగ్నంగా ఉన్నట్లుగా కలలో వస్తే ఆ వ్యక్తి ఏదో అభద్రతాభావంతో బాధపడటం ఒక కారణంగా భావించాలి. అలాగే లోలోపల సిగ్గుపడుతూ, ఎవరి ముందూ బయటపెట్టకూడదనుకుంటారు. లేదా బయటకు తెలిసిపోతుందేమోననే భయమే ఇలాంటి కలలకు కారణం అవుతాయని శాస్త్రం చెబుతోంది.

ఇలాంటి ప్రదేశాల్లో మీరు నగ్నంగా ఉన్నట్లు కల వస్తే..

ఎవరైనా మిమ్మల్ని ఒంటరిగా లేదా ఖాళీ ప్రదేశంలో నగ్నంగా చూస్తే ఇతరులతో పోలిస్తే మీరు మీతో ఎక్కువ సమయం గడపడం చాలా సౌకర్యంగా ఉంటుందని అర్థం. ఇతరుల ముందు వెళ్లడానికి లేదా సమయం గడపడానికి చాలా ఉత్సాహం కనబర్చరు 
కలలో మీరు మీ ఆఫీసులో బట్టలు విప్పినట్లు కనిపిస్తే, ఆ ఆఫీసుతో మీకు మానసిక దూరం వచ్చిందని అర్థం. అక్కడ మీ పనితో మీరు సంతోషంగా లేరు. ఈ 'జీరో సంతృప్తి' మీ మెదడుపై ప్రభావం చూపుతోంది. బహుశా ఏదో ఒక విధంగా మీరు గౌరవం కోల్పోవడం గురించి భయపడుతున్నారు.
ఏదైనా ఫంక్షన్‌లో లేదా బంధువుల సమక్షంలో మీరు నగ్నంగా కనిపిస్తే మీరు మీ అభిప్రాయాలు, ఆలోచనలు, భావాలను ఇతరులతో ముందు షేర్ చేసుకోలేకపోతున్నారని అర్ధం. అలాంటి వాటిని కంట్రోల్ చేసుకోవడం వల్లే మనసుపై తీవ్ర ఒత్తిడిని పెంచి కలలు రావడానికి దోహదపడతాయి. 
మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్‌ ముందు బట్టలు లేకుండా ఉన్నట్లు కల వస్తే.. కుటుంబ సభ్యులందరికి వారితో ఎలాంటి బెరుకు లేకుండా ఉండగలరని అర్ధం.
ఒక కలలో మీరు మీ ప్రేమికుడితో లేదా మీరు ఇప్పుడే ఇష్టపడటం ప్రారంభించిన వారితో నగ్నంగా కనిపిస్తే మీ భావాలను అతని ముందు వ్యక్తీకరించడానికి సరైన సమయం అని అర్థం. 
మార్కెట్, సినిమా హాలు లేదా వీధి వంటి బహిరంగ ప్రదేశంలో మిమ్మల్ని మీరు నగ్నంగా చూడటం అంటే మీరు అతిగా ఆత్మవిశ్వాసంతో ఉన్నారని అర్థం. అలాగే మీరు నిజాయితీపరులని..ఏం దాచుకోరని అర్ధం.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.