గర్భదారణను నిరోధించడానికి చాలా మంది కండోమ్స్ వాడతారు. సేఫ్టీ సెక్స్‌లో భాగంగా ఇలా వాడుతుంటారు. పెళ్లి అయిన తర్వాత కండోమ్ ఫెయిల్ అయినా సరే ఏం కాదు.. కానీ ఈరోజుల్లో ప్రేమికులు పెళ్లికి ముందే సెక్స్ చేసుకుంటున్నారు. వీళ్లు కచ్చితంగా కండోమ్స్ యూస్ చేస్తారు. సేఫ్టీ కోసం ఒకేసారి రెండు కండోమ్స్ వాడతారు. ఎక్కడ ప్రెగ్నెన్సీ వస్తుందేమో అన్న భయంతో. ఇలా రెండు కండోమ్స్‌ను కలిపి ఒకేసారి వాడటం మంచిదేనా..?
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కండోమ్ వాడకం చాలా మంచిది. ఎందుకంటే ఇది అనేక అంటువ్యాధులు మరియు ఇతర లైంగిక సంక్రమణ వ్యాధుల నుండి ఒక వ్యక్తిని రక్షిస్తుంది. అవి అన్ని రకాల గర్భనిరోధకాల కంటే మెరుగైనవి. కండోమ్‌లను ఉపయోగించడం వల్ల లైంగికంగా సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని తగ్గించవచ్చు. అంతే కాదు, అవాంఛిత గర్భధారణ అవకాశాలను తగ్గించడంలో కూడా కండోమ్‌లు ఎంతగానో సహకరిస్తాయి.
ఒకేసారి రెండు కండోమ్‌లు వాడటం శాస్త్రీయంగా ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఒకేసారి రెండు కండోమ్‌లు వాడితే వాటి మధ్య చాలా ఒత్తిడి, రాపిడి ఉంటుంది. ఫలితంగా అది చిరిగిపోయి నిరుపయోగంగా మారుతుంది. ఎన్నో ఏళ్లుగా కండోమ్‌లు వాడుతున్న వారిలో చాలా మందికి దీనిపై సందేహాలు ఉన్నాయి. కండోమ్‌ల అధిక వినియోగం లైంగిక కోరికలు, లైంగిక అనుభూతులను తగ్గిస్తుందని చెబుతారు.
అయితే, ఇండియానా యూనివర్సిటీలో 2007లో నిర్వహించిన ఒక అధ్యయనంలో, కండోమ్‌లను ఉపయోగించడం వల్ల లైంగిక ఆనందం, భావాలు తగ్గవని తేలింది. అవాంఛిత గర్భం మరియు లైంగికంగా సంక్రమించే వ్యాధులను నివారించడానికి మాత్రమే కండోమ్‌లు ఉపయోగపడతాయని గమనించాలి. వారు ఈ ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగిస్తారు.
కండోమ్స్‌లో ఫ్లేవర్స్ ఉండేవి చాలా ఉంటాయి. కానీ వీటిలో వీలైనంత వరకూ రసాయనాలు లేనివి ఎంచుకోవడం చాలా మంచిది. దీనివల్ల యోని ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి.. మేలైనవి మాత్రమే ఎంచుకోవాలి.