మగవారికి రొమ్ములు పెరగడం ఆ సమస్యను సంకేతం.. అస్సలు లైట్‌ తీసుకోవద్దు..!

మగవారికి రొమ్ములు పెరగడం మీరు చాలా మందిలో చూసే ఉంటారు.. అయితే ఇది ఆరోగ్యవంతమైన లక్షణం అస్సలు కానే కాదు.. అందరూ అనుకుంటారు.. లావుగా ఉన్నాం కదా.. అందుకే రొమ్ములు కూడా పెరుగుతున్నాయి అని..

మగవారికి రొమ్ములు పెరగడం ఆ సమస్యను సంకేతం.. అస్సలు లైట్‌ తీసుకోవద్దు..!


మగవారికి రొమ్ములు పెరగడం మీరు చాలా మందిలో చూసే ఉంటారు.. అయితే ఇది ఆరోగ్యవంతమైన లక్షణం అస్సలు కానే కాదు.. అందరూ అనుకుంటారు.. లావుగా ఉన్నాం కదా.. అందుకే రొమ్ములు కూడా పెరుగుతున్నాయి అని.. ఇలా అనుకునే వైద్యులను కూడా సంప్రదించరు.. కానీ మగవారికి రొమ్ములు పెరుగుతున్నాయంటే.. అతనికి కాలేయ సమస్య ఉన్నట్టు అర్థం. కొవ్వుల జీవక్రియ, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రించడానికి బాధ్యత వహించేది కాలేయం. ఇది శరీరంలోని అనేక ఇతర విధులను కూడా నిర్వర్తిస్తుంది. ఈ కీలకమైన అవయవం దెబ్బతింటే శరీరం కుదేలవడం ఖాయం. 

పురుషులలో రొమ్ము కణజాలం పెరగడం అనేదాన్ని వైద్య పరిభాషలో ‘గైనకోమాస్టియా’ అని పిలుస్తారు. ఇది ఫ్యాటీ లివర్ వ్యాధికి సంబంధించిన సమస్య. ఈస్ట్రోజన్ అనేది సెక్స్ హార్మోన్. ఇది స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థను నియంత్రిస్తుంది. ఆడవారిలో రొమ్ములు పెరగడానికి ఈ హార్మోన్‌ కారణం అవుతుంది. మగవారిలోనూ రొమ్ములు పెరగడానికి కూడా ఇదే కారణం. కొవ్వు కాలేయ వ్యాధి బారిన పడిన పురుషుల్లో అడ్రినల్ గ్రంధుల్లో హార్మోన్ల ఉత్పత్తి అధికమవుతుంది. ఇది ఈస్ట్రోజన్ హార్మోన్ పెరుగుదలను పెంచుతుంది. ఇది కూడా కాలేయ వ్యాధికి కారణం అవుతుంది.

రొమ్ముల పెరుగుదలలో కాలేయం పాత్ర ఉందని వైద్యులు అంటున్నారు.. అవసరంలేని అదనపు ఈస్ట్రోజన్‌ను విచ్ఛిన్నం చేసి శరీరం నుంచి బయటికి పంపడం కాలేయం పని.. కాలేయం సరిగా పనిచేయకపోతే ఎర్రబడి, కొవ్వును విచ్చిన్నం చేయడంలో విఫలమవుతుంది. దీనివల్ల బాడీలో ఈస్ట్రోజన్ పేరుకుపోతుంది.. కార్బోహైడ్రేట్లు, చక్కెర అధికంగా తినే పురుషుల రక్తంలో తక్కువ టెస్టోస్టోరాన్ స్థాయిలు ఉంటాయి. ఈస్ట్రోజన్ పేరుకుపోవడం, టెస్టోస్టెరాన్ తగ్గిపోవడం వల్ల రొమ్ములు పెరగడం స్టాట్‌ అవుతుంది..

ఆల్కాహాల్‌ తాగేవారిలో..

ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది కాలేయంలో కొవ్వులు పేరుకుపోవడాన్ని సూచిస్తుంది. ఇది ఆల్కహాల్ తాగే వారిలోనూ వస్తుంది. ఆల్కహాల్ తాగని వారిలోనూ వస్తుంది. ఆల్కహాల్ తాగే వారిలో వస్తే దీన్ని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. ఆల్కహాల్ తాగని వారిలో వస్తే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని పిలుస్తారు. 

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.