ఆరోగ్యంగా ఉండాలంటే.. తినడానికి చాలా ఉన్నాయి.. కానీ ఇలాంటి గింజలను చాలా తక్కువ మంది తింటారు.. చికెన్, మటన్‌లో ఉండే పోషకాల కంటే.. ఎక్కువ ప్రోటీన్స్ ఈ గింజల్లో ఉంటాయి.. పొద్దుతిరుగుడ, పుచ్చగింజలు, అవిసె గింజలు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి.. అన్నిటి కంటే ముఖ్యమైనవి అవిసె గింజలు.. వీటి గురించి ఎంత చెప్పినా తక్కువే.. అటు అందానికి ఇటు ఆరోగ్యానికి రెండు విధాలుగా ఇవి మేలు చేస్తాయి..అవిసె గింజలను రోజూ గుప్పెడు మోతాదులో తింటే అనేక లాభాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపులను తగ్గించడంలో పనిచేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. హైబీపీ తగ్గుతుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా గుండె సురక్షితంగా ఉంటుంది.
అవిసె గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది సహజసిద్ధమైన లాక్సేటివ్‌గా పనిచేస్తుంది. దీని వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. మలబద్దకం నుంచి బయట పడవచ్చు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
అవిసె గింజల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా బి విటమిన్లు, మెగ్నిషియం, మాంగనీస్ అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ గింజలను రోజూ తింటే శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.
అవిసె గింజల్లో లిగ్నన్స్ అని పిలువబడే పోషకాలు ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. కనుక అవిసె గింజలను రోజూ తింటే షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. దీని వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
అధిక బరువు తగ్గాలనుకునే వారికి అవిసె గింజలు ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల శరీర మెటబాలిజం పెరిగి కొవ్వు కరుగుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. అందువల్ల బరువు తగ్గుతారు.
అవిసె గింజలు మహిళల ఆరోగ్యం కోసం కూడా ఎంతో పనిచేస్తాయి. వీటిని తినడం వల్ల మహిళల్లో సంతానం కలిగే అవకాశాలు మెరుగుపడతాయి. నెలసరి సరిగ్గా వస్తుంది.
చేపలను తినడం ఇష్టం లేనివాళ్లు అవిసె గింజలను తినవచ్చు. ఎందుకంటే చేపల్లో ఉండే పోషకాలన్నీ దాదాపుగా ఈ గింజల్లోనూ ఉంటాయి. పోషకాలన్నీ లభిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు.
అవిసె గింజలను గుప్పెడు మోతాదులో తీసుకుని పెనంపై వేయించి తినవచ్చు. సాయంత్రం సమయంలో జంక్ ఫుడ్‌కు బదులుగా వీటిని తింటే మేలు జరుగుతుంది. అలాగే అవిసె గింజలను పొడి చేసి కూడా తీసుకోవచ్చు. వీటితో లడ్డులూ చేసుకుని తినొచ్చు. అవిసె గింజలు ఒక గ్లాస్ నీళ్లలోవేసి మరిగిస్తే జల్‌వస్తుంది. ఆ జల్ ను తలకు రాస్తే.. జుట్టు చాలా దృఢంగా పెరుగుతుంది. అన్ని రకాల జుట్టు సమస్యలకు ఇది బాగా పనిచేస్తుంది.