కఫంతో విపరీతమైన దగ్గు వేధిస్తుందా..? దీన్ని రెండు రోజులు తాగండి చాలు..!

దగ్గు, జ‌లుబు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంతో పాటు క‌ఫం మొత్తాన్ని బ‌య‌ట‌కు పంపేందుకు ల‌వంగాలు, అల్లం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఒక చిన్న అల్లం ముక్క‌, నాలుగు ల‌వంగాల‌ను తీసుకుని రెండింటినీ క‌లిపి దంచండి..

కఫంతో విపరీతమైన దగ్గు వేధిస్తుందా..? దీన్ని రెండు రోజులు తాగండి చాలు..!
Home remedies for cough


 శ్వాసకోస సంబంధ వ్యాధులు ఉన్నవారికి సీజన్‌తో పనిలేకుండా.. ఎప్పుడూ దగ్గు వేధిస్తూనే ఉంటుంది. నైట్‌ దగ్గు వల్ల నిద్రపట్టదు.. అలానే కుర్చుంటారు. కాస్త కునుకుతీసినా.. దగ్గు విపరీతంగా వచ్చి తెగ ఇబ్బంది పడుతుంటారు. ఊపిరితిత్తుల్లో కఫం ఎక్కువగా పేరుకుపోవడం వల్ల దగ్గు వస్తుంది. దీనివల్లే జలుబు, ముక్కు దిబ్బడ సమస్యలు కూడా వస్తాయి. అయితే ఈ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఇంగ్లీష్ మెడిసిన్‌ను వాడాల్సిన ప‌నిలేకుండా ఇంట్లో ఉండే ప‌దార్థాలతోనే వీటి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దీంతోపాటు ఛాతిలో ఉండే క‌ఫం మొత్తం దెబ్బ‌కు బ‌య‌ట‌కు పోతుంది.  
దగ్గు, జ‌లుబు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంతో పాటు క‌ఫం మొత్తాన్ని బ‌య‌ట‌కు పంపేందుకు ల‌వంగాలు, అల్లం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఒక చిన్న అల్లం ముక్క‌, నాలుగు ల‌వంగాల‌ను తీసుకుని రెండింటినీ క‌లిపి దంచండి.. ఆ మిశ్ర‌మాన్ని ఒక గ్లాస్ పాల‌లో వేసి బాగా మ‌రిగించాలి. పాలు మ‌రిగాక గోరు వెచ్చ‌గా ఉండ‌గానే అందులో తేనె క‌లిపి తాగేయండి..

ఈ విధంగా రోజూ రాత్రి పూట నిద్ర‌కు ముందు తాగాలి. రెండు రోజుల పాటు ఈ మిశ్ర‌మాన్ని తాగారంటే... దెబ్బ‌కు ఛాతిలో ఉండే క‌ఫం పోవ‌డంతో పాటు ద‌గ్గు, జ‌లుబు నుంచి విముక్తి ల‌భిస్తుంది. అయితే స‌మ‌స్య ఇంకా త‌గ్గ‌క‌పోతే ఇంకో రెండు రోజులు తాగ‌వ‌చ్చు.
ఈ మిశ్ర‌మాన్ని గోరు వెచ్చ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల ఛాతిలోని క‌ఫం మొత్తం బ‌య‌ట‌కు పోతుంది. ముక్కు రంధ్రాలు క్లియర్ అవుతాయి. శ్వాస స‌రిగ్గా ఆడుతుంది. ముక్కు దిబ్బ‌డ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. దీని వ‌ల్ల గొంతు నొప్పి, గొంతులో మంట‌, గొంతు స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి. అల్లం క‌ఫాన్ని బ‌య‌ట‌కు పంపించ‌డంలో స‌హాయ ప‌డుతుంది.
ఇక ల‌వంగాల్లో ఉండే యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్ గుణాలు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. సూక్ష్మ జీవుల‌ను నాశ‌నం చేస్తాయి. దీంతో ద‌గ్గు, జ‌లుబు నుంచి వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారు సైతం ఈ మిశ్ర‌మాన్ని తాగ‌వ‌చ్చు. దీంతో ఎంతో రిలీఫ్ ల‌భిస్తుంది. శ్వాస కోశ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఈ మిశ్ర‌మాన్ని తాగ‌డం వ‌ల్ల మెరుగైన ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.