అధిక బరువు.. గుండె సమస్యలను.. ఈ పండ్లతో అడ్డుకోవచ్చు!

కొన్ని పండ్లలో ఔషధ గుణాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. వాటిలో ముఖ్యంగా సీజనల్ పండ్లలో ఈ గుణాలు అత్యధికంగా ఉంటాయి. మామిడి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, నేరేడు పండు కూడా అదే కోవకు చెందుతుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

అధిక బరువు.. గుండె సమస్యలను.. ఈ పండ్లతో అడ్డుకోవచ్చు!


కొన్ని పండ్లలో ఔషధ గుణాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. వాటిలో ముఖ్యంగా సీజనల్ పండ్లలో ఈ గుణాలు అత్యధికంగా ఉంటాయి. మామిడి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, నేరేడు పండు కూడా అదే కోవకు చెందుతుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

నేరేడు పండులో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉంటాయి. ఒక్క నేరేడు పండులో 1.41 మి.గ్రా ఐరన్, 15 మి.గ్రా కాల్షియం, 18 మి. గ్రా విటమిన్ - సి విటమిన్ బి  మెండుగా ఉంటాయి. వీటికి మధుమేహంతో పాటు అనేక అనారోగ్య సమస్యలతో పోరాడే శక్తి ఉంటుంది. డయాబెటిస్​ను సమర్థంగా అడ్డుకోగలదు.  ముఖ్యంగా వీటి గింజలు.. చెక్కరని శక్తిగా మారుస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇందులోని పీచు పదార్థం రక్తంలో చక్కర స్థాయిలు తొందరగా పెరగకుండా నియంత్రిస్తుంది. కానీ వీటిని మోతాదులో తీసుకోవడం మంచిది.
విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మ నారింజ ఉసిరి వంటి పండ్లు శరీరంలో ఉండే చెడు కొలతలను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈ పళ్లల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ గుండె ఆరోగ్యానికి మంచిది. అధిక దాహం, అధిక మూత్రం వంటి లక్షణాలను ఇవి తగ్గించగలవు.  జీర్ణక్రియ మెరుగవుతుంది. ఫలితంగా మల బద్ధకం సమస్య రాదు. 
ఈ కాలంలో ఎక్కువగా దొరికే మామిడి పండ్లను సైతం తరచు తీసుకోవడం వల్ల పలు సమస్యలు అదుపులో ఉంటాయి. ముఖ్యంగా మామిడి పండులో ఉండే ప్రత్యేక లక్షణాలు పొట్టపై భాగంలో ఎడమ వైపు ఉండే ప్లీహం అవయవం పెరిగినా, మూత్రం నిలిచిపోతున్నా..   ఇది విరుగుడుగా పనిచేస్తుంది. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. జలుబు, దగ్గు లాంటి చిన్న ఇన్ఫెక్షన్స్ నుంచి త్వరగా కోలుకోవచ్చు.
ఇవి నోటి ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. చిగుళ్ల నుంచి రక్తం కారటం, దుర్వాసనను నిలిపివేస్తాయి. 
దానిమ్మ పండ్లు కూడా సరస్సు తీసుకోవడం వల్ల శరీరంలో రక్తహీనత దరిచేరదు. ఈ పండ్లలో ఎక్కువుగా ఉండే విటమిన్ - C, A, ఐరన్​  వల్ల.. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. ఫలితంగా రక్తం శరీరంలోని అవయవాలకు మరింత ఆక్సిజన్ అందిస్తుంది. 
నారింజ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన సి విటమిన్ అందుతుంది. చర్మాన్ని తాజాగా, కంటిని ఆరోగ్యంగా ఉంచే  గుణాలు ఇందులో ఉంటాయి. కాలేయానికి ఏదైనా హాని జరిగినా.. తిరిగి కోలుకోవడానికి సహాయపడుతుంది. బయట జరిగిన గాయాలను మానపడంలో సైతం ఈ విటమిన్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.