Drinking water : నీళ్లు తాగట్లేదా....? అయితే ఈ సమస్యలు తప్పవు

శరీరంలోని 60 శాతం కంటే ఎక్కువగా water ఉండాలి. water మానవ దేహాలకు చాలా అవసరం, శరీరంలో వ్యర్థ పదార్థాలను బయటికి పంపించడం, వేడిని కంట్రోల్ చేయడం, టాక్సిన్స్‌ను బయటకు పంపించడంలో నీరు చాలా ముఖ్యం. శరీరంలో నీరు లేకపోతే dehydration గురై కళ్లు తిరిగిపడిపోయే ప్రమాదం కూడా ఉంది.

Drinking water : నీళ్లు తాగట్లేదా....? అయితే ఈ సమస్యలు తప్పవు
side effects of not drinking enough water


Drinking water : ఈ రోజుల్లో చాలా మందికి నీరు తాగాలంటే వెగటుగా ఉంటుంది. water తాగడానికి అయిష్టంగా ఉంటారు. ఏదో తూ తూ మంత్రంగా కొంచెమే తాగుతారు. దానివల్ల అనేక రకాల సమస్యలకు గురవుతారు. మన జీవితాల్లో నీరనేది ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. కానీ పట్టించుకోరు. శరీరంలో నీరు లేకపోతే....దేహం పనితీరు మందగిస్తుంది.

శరీరంలోని 60 శాతం కంటే ఎక్కువగా నీళ్లు ఉండాలి. నీరు మానవ దేహాలకు చాలా అవసరం, శరీరంలో వ్యర్థ పదార్థాలను బయటికి పంపించడం, వేడిని కంట్రోల్ చేయడం, టాక్సిన్స్‌ను బయటకు పంపించడంలో నీరు చాలా ముఖ్యం. శరీరంలో నీరు లేకపోతే డీహైడ్రేషన్ గురై కళ్లు తిరిగిపడిపోయే ప్రమాదం కూడా ఉంది.

ఒక్కోసారి అలసట, ఆందోళనగా ఉంటే....శరీరానికి నీరు కావాలని అర్థం. నీళ్లు తాగకపోతే నోటి దుర్వాసన వచ్చే ప్రమాదం కూడా ఉంది. నీళ్లు తాగుతుంటేనే దంతాలపై ఉండే...పేరుకుపోయిన బ్యాక్టరీయా పోతుంది. లేకపోతే బ్యాక్టరీయా నిలిచి దుర్వాసన వస్తుంది. కొన్ని సార్లు దంత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దుర్వాసన వస్తే ఎక్కడికీ వెళ్లలేం. ఎవరితోనూ మాట్లడలేం.

శరీరంలో నీటి స్థాయిలు తగ్గినట్టు అయితే..... వీపరీతమైన తలనొప్పి వస్తుంది. అంతేకాకుండా తలకు ఆక్సిజన్ ప్రవాహం తగ్గుతుంది. అలాంటప్పుడు ఒక ట్యాబ్లెట్ కు బదులు నీళ్లు కొంచెం తాగడం మంచిది. మన మెదడులో నీరు తగ్గిపోతే.... మనం చేసే పనిలో ఏకాగ్రతగా ఉండలేం. జ్ఞాపకశక్తి కూడా మందగిస్తుంది.

రోజూ తగిన మోతాదులో నీళ్లు తాగడం వల్ల ప్రేగులను శుభ్రం చేస్తుంది. మలబద్ధకముంటే అది కూడా తగ్గుతుంది. మలమూత్రాలు రోజూ క్లియర్ అయితేనే....అనారోగ్య సమస్యలు దరిచేరవు. లేకపోతే భోజనం తినాలనిపించదు. ఆకలి వేసినా తినడానికి సహించదు. ఒక్కోసారి బాగా ఆకలి వేసినా దానర్థం శరీరానికి నీళ్లు కావాలని, అప్పుడు కాసిన్ని నీళ్లు తాగితే సెట్ అయిపోతాం.

ఇంకో విషయం నీళ్లు తాగకపోతే మూత్రం రంగులో మార్పు కచ్చితంగా ఉంటుంది. పసుపు రంగులో మూత్రం వస్తుంది. యోనిలో మంటగా అనిపిస్తుంది. మూత్రం రంగులో తేడా ఉంటే శరీరానికి నీళ్లు కావాలని సంకేతం. నీళ్లు తాగకపోతే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లవు. దానివల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. నడుం నొప్పి, వెన్ను నొప్పి వచ్చే ప్రమాదం ఉంది.

క్రమం తప్పకుండా నీరు తాగడం వల్ల గుండెపోటు రాకుండా కాపాడుకోగలం.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.