Walking exercise నడక వ్యాయామమా.. ఇలా మొదలుపెట్టేయండి.. 

వ్యాయామాలన్నింటిలోకి Walking exercises ఉత్తమమైనది. ఏ వయసు మరేనా తేలికగా చేయగలిగే వ్యాయామం ఇది. అంతేకాకుండా దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. .

Walking exercise నడక వ్యాయామమా.. ఇలా మొదలుపెట్టేయండి.. 
walking exercises


Walking exercise చెయ్యాల‌ని అందరూ అనుకుంటారు ఎన్నోసార్లు ప్రణాళికలు కూడా వేసుకుంటారు కానీ చాలా వరకు వాటిని సక్రమంగా పాటించకుండా ఆపేస్తుంటారు అయితే అలా కాకుండా కచ్చితంగా వ్యాయామం చేయాలని రోజున మొదలు పెడితే ఆ రోజంతా ఎంత ఉత్సాహంగా ఉంటుంది అయితే ప్రతి ఒక్కరూ చేయగలిగే తేలికపాటి వ్యాయామంలో నడక ఒకటి.. అయితే నడిచేటప్పుడు ఎలా నడవాలి దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఒకసారి చూద్దాం.. 

వ్యాయామాలన్నింటిలోకి నడక వ్యాయామం ఉత్తమమైనది. ఏ వయసు మరేనా తేలికగా చేయగలిగే వ్యాయామం ఇది. అంతేకాకుండా దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. ఈ నడక వ్యాయామాన్ని మొదలు పెట్టేటప్పుడు రోజుకు అరగంట నుండి గంటసేపు నడవాలి. నడిచేటప్పుడు తప్పనిసరిగా షూ వేసుకోవాలి. నడక మొదలుపెట్టే ముందు కనీసం 10 నుండి 12 నిమిషాలు వార్మప్ చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరం తేలిక పడుతుంది.. ఆ తరువాత వేగంగా నడవాలి.

 అలాగే ఎత్తయిన ప్రాంతానికి ఎక్కుతూ 3 నిమిషాల తరువాత చదును ప్రాంతం మీద 2 నిమిషాలు మళ్ళీ ఎత్తయిన ప్రాంతం మీద ఇలా మార్చి మార్చి నడిస్తే మంచి ఫలితాలు కనబడతాయి. అయితే కొత్తగా వ్యాయామాన్ని ప్రారంభించిన వారు తేలికపాటి వ్యాయామం చేస్తూ కఠినమైన వ్యాయామాల వైపు వెళ్ళాలి.. అలాగే మొదట్లో తక్కువ దూరం వెళ్ళినా ఆ తరువాత వేగం, దూరం పెంచుకుంటూ వెళ్ళాలి. వాకింగ్ చేసేటప్పుడు పండ్లు, కొబ్బరినీళ్ళు త్రాగితే మంచిది. అధిక బరువు తగ్గుతారు. సాధారణంగా నడక వ్యాయామం చేసేవారు గంటకి ఆరు కిలోమీటర్ల వేగంతో నడిస్తే మంచిది.

అలా అని మొదటినుంచి పాటించక్కర్లేదు మొదట్లో గంటకు నాలుగు కిలోమీటర్లు చెప్పనా నడుస్తూ క్రమేపి వేగాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి.. అలాగే  నడిచేటప్పుడు దూరం, సమయం దృష్టిలో ఉంచుకోవటం ముఖ్యం. ఇలా నడక వ్యాయామం చేస్తే.. ఒత్తిడిగా ఉన్నప్పుడు కాస్త రిలాక్స్‌గా అనిపిస్తుంది. అంతేకాదు.. శరీరంలో పేరుకు పోయిన కొవ్వు కూడా తొలగిపోతుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.