Types of Headaches : త‌ల‌నొప్పి వేధిస్తుందా?? మిమ్మల్ని వేధిస్తున్న ర‌కం ఏది? తలనొప్పిలో రకాలు తెలుసా.. !

Types of Headaches : తలనొప్పి తరచుగా అందర్నీ వేధించే సమస్య అయితే నిజానికి అసలు కారణాలు ఎవరికీ పూర్తిగా తెలియదు ఎందుకంటే తలనొప్పిలో దాదాపు 200 రకాలు ఉన్నాయని చెబుతున్నారు..

Types of Headaches :  త‌ల‌నొప్పి వేధిస్తుందా??  మిమ్మల్ని వేధిస్తున్న ర‌కం ఏది? తలనొప్పిలో రకాలు తెలుసా.. !
Types of Headaches


Types of Headaches : తలనొప్పి తరచుగా అందర్నీ వేధించే సమస్య అయితే నిజానికి అసలు కారణాలు ఎవరికీ పూర్తిగా తెలియదు ఎందుకంటే తలనొప్పిలో దాదాపు 200 రకాలు ఉన్నాయని చెబుతున్నారు అయితే దీనిని తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలో ఒకసారి చూద్దాం.. 

తలనొప్పి ఎక్కువగా వేధిస్తుంటే సరిపడాన్ని నీలో రోజు మొత్తంగా తీసుకుంటున్నామా లేదో ముందుగా చూసుకోవాలి శరీరం డిహైడ్రేట్ కి గురైనప్పుడు తలనొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఒంటిలో నీరు తగ్గినప్పుడు శరీర భాగాలు సక్రమంగా పనిచేయక తలనొప్పి వస్తుంది.. 

అలాగే సమయానికి తినే అలవాటు ఉన్న వారిలో తలనొప్పి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని తెలుస్తోంది అందుకే తరచూ ఎవరికైతే తలనొప్పి వస్తుందో అలాంటివారు రోజు ఒకే సమయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.. 

అలాగే అదే పనిగా మెడ వంచటం.. కండరాలు పైన బరువు పడేటట్టు చేయడం.. వెన్నెముకపై భారం ఉంచటం వంటివి కూడా తలనొప్పికి కారణాలు అవుతాయి.. అందుకే రోజు మొత్తం ఎన్ని పనులు ఉన్నా ఆ సమయంలో సక్రమంగా కూర్చోవడం చేయాలి.. 

అలాగే శరీరంలో మెగ్నీషియం లోపం ఉంటే తరచు మైగ్రేన్ తలనొప్పి వస్తూ ఉంటుంది అందుకే పోషకాహారం అలవాటు చేసుకోవాలి. ఆహారంలో భాగంగా ఆకుకూరలు నట్స్ త్రోధాన్యాలు ఉండేటట్టు చూసుకోవాలి అలాగే బయట దొరికే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండటం వల్ల ఈ సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు..

ఇందులో ముఖ్యంగా మైగ్రేన్ తల నొప్పి, టెన్షన్ తల నొప్పి, సైనస్ తల నొప్పి, క్లస్టర్ తల నొప్పి, అలెర్జీ తల నొప్పి,  వాస్క్యులర్ తలనొప్పి, రీబౌండ్ తలనొప్పి వంటివి  ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి..

థండర్‌క్లాప్ తలనొప్పి, హైపర్‌టెన్షన్ తలనొప్పి, న్యూరోలాజికల్ తలనొప్పి, హార్మొనీ తలనొప్పి, పోస్ట్ ట్రాయమెట్రిక్ తలనొప్పి, ఎక్సర్షన్ తలనొప్పి, స్పైనల్ తలనొప్పి, ఐస్ పిక్ తలనొప్పి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.