కొలెస్ట్రాల్‌లో LDL, HDL, ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏంటి..? ఏది మంచిది..?

లావుగా ఉన్న వాళ్లందరికి మాత్ర‌మే ఫ్యాట్‌ ఉందని కాదు. సన్నగా ఉన్నవారికి కూడా ఫ్యాట్‌ ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్‌ అంటే పూర్తిగా మంచిది కాదని కాదు.. HDL , LDL, triglycerides

కొలెస్ట్రాల్‌లో LDL, HDL, ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏంటి..? ఏది మంచిది..?


కొలెస్ట్రాల్‌.. ఈ పేరు చెప్పగానే.. వామ్మో అనుకుంటాం.. తినే ఆహారంలో కొలెస్ట్రాల్‌ ఉందంటే.. అది ఎంత ఇష్టమైన ఫుడ్‌ అయినా తగ్గించేస్తాం. లావుగా ఉన్నారంటే వాడికి కొవ్వు ఎక్కువగా ఉంది అనుకుంటారు. లావుగా ఉన్న వాళ్లందరికి మాత్ర‌మే ఫ్యాట్‌ ఉందని కాదు. సన్నగా ఉన్నవారికి కూడా ఫ్యాట్‌ ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్‌ అంటే పూర్తిగా మంచిది కాదని కాదు. బాడీకి ఫ్యాట్‌ అవసరం. అదే గుడ్‌ కొలెస్ట్రాల్‌. ఈ గుడ్ బ్యాడ్‌ అని వైద్యులు, న్యూట్రీషన్స్‌ ఎప్పుడూ చెప్తుంటారు.. అసలు ఏంటిది..? 

LDL (చెడు) కొలెస్ట్రాల్

LDL కొలెస్ట్రాల్‌ను "చెడు" కొలెస్ట్రాల్‌గా పరిగణిస్తారు, ఎందుకంటే ఇది ధమనులలో (అథెరోస్క్లెరోసిస్) కొవ్వు పేరుకుపోవడానికి దోహదం చేస్తుంది. ఇది ధమనులను తగ్గిస్తుంది. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే దమనులలో ఇది పేరుకు పోతే.. పంపింగ్‌ సరిగ్గా జరగక, బ్లడ్‌ సర్కూలేషన్‌లో ప్రాబ్లమ్‌ వచ్చి గుండెపోటు, స్ట్రోక్ , పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి (PAD) ప్రమాదాన్ని పెంచుతుంది. ఈరోజుల్లో 90 శాతం మందికి హార్ట్‌ సమస్యలు రావడానికి కారణం ఈ బ్యాడ్‌ కొలెస్ట్రాలే.

HDL (మంచి) కొలెస్ట్రాల్

HDL కొలెస్ట్రాల్‌ను "మంచి" కొలెస్ట్రాల్‌గా భావించవచ్చు ఎందుకంటే ఆరోగ్యకరమైన స్థాయి గుండెపోటు స్ట్రోక్ నుండి రక్షించవచ్చు. బాడీలో ఈ కొలెస్ట్రాల్‌ ఎక్కువ ఉంటే.. బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తన్ని తరిమేస్తుంది. దాంతో బాడీ క్లీన్‌ అవుతుందనమాట..!

ట్రైగ్లిజరైడ్స్


చెడు కొవ్వుతో పాటు ట్రైగ్లిజరైడ్‌ కూడా హానికారక కొవ్వే. ఇది రక్తంలో ఎక్కువగా ఉండటం ప్రమాదకరమే. రక్తంలో అధికంగా ఇవి ఉండటంతో గుండెకు ఇబ్బందులు వస్తాయి.. గుండె జబ్బులున్న వారిలో కొలెస్ట్రాల్‌ సాధారణంగా ఉన్నా.. ట్రైగ్లిజరైడ్‌ అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి జీవక్రియల వేగాన్ని మందగించేలా చేస్తాయి. వీటితో రక్త నాళాల గోడలు దెబ్బతింటాయి. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ ముద్దలుగా పేరుకొని పొతుంది. గుండె జబ్బులకు కారణమవుతుంది.

ఆరోగ్యకరమైన వ్యక్తికి కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి.. 

మొత్తం కొలెస్ట్రాల్: 200 కంటే తక్కువ – 239 mg/dL

HDL: 60 mg/dL కంటే ఎక్కువ

LDL: 100 mg/dL కంటే తక్కువ

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.