యోగా, జిమ్ రెండిట్లో ఏది బెటర్..? ప్రయోజనాలు ఎందులో ఎక్కువ..?
ఆరోగ్యంగా ఉండాలంటే.. డైలీ ఎంతోకొంత శారీరక శ్రమ చేయాలి. అప్పుడే కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గాలని చాలా మంది యోగా, జిమ్ వంటివి చేస్తుంటారు. ఈ రెండింటి అంతిమ లక్ష్యం ఒకటే అయినా..

ఆరోగ్యంగా ఉండాలంటే.. డైలీ ఎంతోకొంత శారీరక శ్రమ చేయాలి. అప్పుడే కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గాలని చాలా మంది యోగా, జిమ్ వంటివి చేస్తుంటారు. ఈ రెండింటి అంతిమ లక్ష్యం ఒకటే అయినా.. రెండింటి మధ్య తేడాలు ఉన్నాయి. అయితే యోగా, జిమ్ వీటిలో ఏది చేయడం మంచిది..? దేని వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి.. అనే వివరాలను ఈరోజు తెలుసుకుందాం.!
యోగా వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. యోగా చేస్తున్నప్పుడు శరీరాన్ని కదిలించడమే కాక మరేదో నేర్చుకోవాల్సిన విషయం ఇంకా ఉందనిపిస్తుంది. ఆసనాల వల్ల బోలెడు లాభాలున్నాయి. ఇక జిమ్ వెళ్లడం, ఎక్సర్సైజ్ చేయడం వల్ల కండరాలు ఫిట్‌గా అవుతాయి. యోగా వల్ల శరీరం తేలికగా కదిలించగలుగుతారు. బలం పెరుగుతుంది. శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టాలో యోగా నేర్పుతుంది. ఇక ఎక్సర్సైజ్ విషయానికొస్తే బయట కనిపించే శరీరాకృతి మీదే కేంద్రీకృతమై ఉంటుంది. కానీ యోగాలో చేసే ఆసనాల వల్ల శరీరానికి మానసికంగా, శారీరకంగా సాంత్వన పొందిన భావన వస్తుంది.
యోగా చేయడానికి ఎలాంటి పరికరాలు వాడక్కర్లేదు. ఒక్క మ్యాట్ ఉంటే చాలు. ఎక్కడికైనా మ్యాట్ తీసుకుని వెళ్లి యోగా చేసేయొచ్చు. కొన్ని ఎక్సర్సైజులు చేయాలంటే పరికరాలు అక్కర్లేదు. కానీ సరైన శారీరక బలం, ఫ్లెక్సిబిలిటీ కోసం కావాలంటే మంచి పరికరాలు అవసరం అవుతాయి. జిమ్ వెళ్లి తప్పకుండా అక్కడే కసరత్తులు చేయాల్సి ఉంటుంది.
యోగా అనేది శరీరానికి మాత్రమే కాకుండా మనస్సుకు, మన భావోద్వేగాలకు కూడా ప్రయోజనాన్ని కల్పిస్తుంది. యోగా అనేక ఆసనాల గురించి చెబుతుంది. దాంతో పాటే ఆలోచనలను నియంత్రించడానికి ఉపయోగించే శ్వాస పద్ధతులను కూడా బోధిస్తుంది. ఈ విధంగా మీ ఇంద్రియాలు, భావోద్వేగాలపై నియంత్రణ సాధించడానికి యోగా సాయపడుతుంది. యోగా మనిషిని లోపల నుంచి బాగుచేస్తుంది.
యోగా 84 లక్షల భంగిమలు, 300 ప్రాణాయామ పద్ధతులు, అనేక ధ్యాన పద్ధతులతో సహా విస్తృతమైన సంపదను కలిగి ఉంది. యోగా 5,000 సంవత్సరాల నాటిది. ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యలు ఎక్సర్సైజ్ వల్ల తగినంతగా పరిష్కారం కాకపోవచ్చు. కానీ మానసిక శ్రేయస్సు కోసం, యోగా ఉత్తమమైంది. అలాగే యోగా వల్ల ఎలాంటి గాయాలయ్యే అవకాశం కూడా ఉండదు. ఎక్సర్సైజ్ చేసేటపుడు ఈ అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఫిట్నెస్ కోసం యోగా, ఎక్సర్సైజ్ రెండూ మంచి పద్ధతులే. దేనికదే ప్రత్యేకం. కండలు తిరిగిన శరీరం కావాలి అనుకంటే జిమ్ చేయొచ్చు.. మంచి లైఫ్‌స్టైల్, ఒక శారీరక శ్రమ, మనసుకు ప్రశాంతత కావాలంటే ఇంట్లోనే డైలీ యోగాసనాలు ప్రాక్టీస్ చేయొచ్చు.