Ayurvedic Tips : ఈ ఆయుర్వేద చిట్కాలతో పడకున్న ఐదు నిమిషాలకే గాఢ నిద్రలోకి వెళ్తారు..!

Ayurvedic Tips : పడుకోగానే నిద్రపోవడం అంటే ఈరోజుల్లో చాలా కష్టం.. అదేంటో ఇది కూడా కష్టం అయిపోయింది.. చిన్నప్పుడు స్కూల్‌ టైమ్‌ అవుతున్నా ఎంత నిద్రొచ్చేదో.. ఎప్పుడు ఆదివారం వస్తుందా..ఎక్కువ సేపు పడుకోవచ్చా అని చూసేవాళ్లం

Ayurvedic Tips : ఈ ఆయుర్వేద చిట్కాలతో పడకున్న ఐదు నిమిషాలకే గాఢ నిద్రలోకి వెళ్తారు..!


Ayurvedic Tips : పడుకోగానే నిద్రపోవడం అంటే ఈరోజుల్లో చాలా కష్టం.. అదేంటో ఇది కూడా కష్టం అయిపోయింది.. చిన్నప్పుడు స్కూల్‌ టైమ్‌ అవుతున్నా ఎంత నిద్రొచ్చేదో.. ఎప్పుడు ఆదివారం వస్తుందా..ఎక్కువ సేపు పడుకోవచ్చా అని చూసేవాళ్లం.. కానీ ఇప్పుడు పెద్దయ్యాక..జాబ్‌లు చేస్తున్నాం.. నిద్రపోయే టైమ్‌ ఉంటుంది కానీ.. నిద్రరాదు.. నిద్రపోవడానికి మాత్రలు వాడుతున్నాం.. ఏవేవో చిట్కాలు పాటించాల్సి వస్తుంది.. కారణం.. ఒత్తడి, ఆందోళన. నువ్వు అనుకున్నట్లే ఏదీ జరగడం లేదు అనే బాధ..దిండు మీద తల పెట్టిన 5 నిమిషాలకు గాఢ నిద్రలోకి జారుకునే కొన్ని చిట్కాలు ఉన్నాయి.

మనిషికి తగినంత నిద్రలేకపోతే..అలసిపోతాడు.. పనిపై దృష్టి పెట్టలేం. శరీరంలో హార్మోన్లు మారుతాయి. అందుకోసమే.. నిద్ర చాలా ముఖ్యం. రోజులో 8 గంటల నిద్రపోవాలి. మీరు రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే కింద చెప్పేవి మీకు బాగా నిద్రపోవడానికి సహాయపడుతాయి. నల్పమరది తైలం.. మీకు ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుతుంది. స్నానానికి ముందు ఈ నూనెను రాసుకుని గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఈ నూనె మాయిశ్చరైజర్ చర్మాన్ని రక్షిస్తుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. సన్‌ టాన్‌ని తొలగించగలదు.
నీలభృంగాది తైలం.. తలకు పట్టించి మర్దన చేస్తే తల చల్లబడుతుంది. ఈ నూనెను అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మాయిశ్చరైజర్ శిరోజాలను రక్షిస్తుంది. చుండ్రును నివారిస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. హెయిర్ రూట్‌ను బలోపేతం చేయడం వల్ల జుట్టు దట్టంగా పెరుగుతుంది. ఈ నూనెతో మసాజ్ చేస్తే మంచి నిద్ర కూడా వస్తుంది.
లావెండర్ ఆయిల్ నిద్రలేమి సమస్యను నివారిస్తుంది. కాటన్ బాల్‌పై రెండు చుక్కల లావెండర్ ఆయిల్ వేసి మీ దిండు దగ్గర ఉంచండి. దాని సువాసన మీకు వేగంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. చందనం నూనె.. ఇది మీకు మంచి నిద్రను కూడా ఇస్తుంది. మీ అరచేతి లేదా గుడ్డపై గంధపు నూనె చుక్క వేయండి. దాని వాసన మీ కళ్ళు త్వరగా నిద్రపోయేలా చేస్తుంది.
నిద్రలేమి చికిత్సలో యూకలిప్టస్ ఆయిల్ కూడా చాలా సహాయపడుతుంది. ఒక దూదిపై 2 చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి దిండు దగ్గర ఉంచితే మంచి నిద్ర వస్తుంది. వేసవిలో మీరు మీ తలకు అప్లై చేసే నూనెలో పటిక కలపండి. మీ తలను చల్లబరుస్తుంది. మీరు త్వరగా నిద్రపోవడానికి కూడా సహాయపడుతుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.