తినేప్పుడు ఒక గ్లాస్ వాటర్ తాగితేనే ఎంత నష్టం తెలుసా?? త్రాగ‌వ‌చ్చా?? త్రాగ‌కూడ‌దా??

రెండు ముద్దలు తినగానే ఎక్కిళ్లు వచ్చేస్తాయి. వెంటనే ఓ గ్లాస్ నీళ్లు తాగేస్తారు. కానీ తినేప్పుడు, తిన్న తర్వాత నీళ్లు తాగకూడదు. యాసిడ్ పలచగా అయిపోతుంది.  సైంటిఫిక్ స్టడీ ప్రకారం తినేప్పుడు నీళ్లు ఎందుకు తాగకూడదో Say no to water between meals

తినేప్పుడు ఒక గ్లాస్ వాటర్ తాగితేనే ఎంత నష్టం తెలుసా?? త్రాగ‌వ‌చ్చా?? త్రాగ‌కూడ‌దా??


మనందరికి చిన్నప్పుడు ఎలాంటి అలవాట్లు ఉంటాయో..పెద్దయిన తర్వాత కూడా అవే అలవాటుగా ఉండిపోతాయి. అదే అలవాటును మనం మన పిల్లలకు కూడా నేర్పించేస్తాం. అలా మీరు నేర్చుకున్న ఒక పెద్దతప్పు తినేప్పుడు మంచినీళ్లు తాగటం. అసలు భోజనం చేసేప్పుడు నీళ్లు లేకుండా ఎవరూ తినరు. కొందరికైతే రెండు ముద్దలు తినగానే ఎక్కిళ్లు వచ్చేస్తాయి. వెంటనే ఓ గ్లాస్ నీళ్లు తాగేస్తారు. కానీ తినేప్పుడు, తిన్న తర్వాత నీళ్లు తాగకూడదు. యాసిడ్ పలచగా అయిపోతుంది. 

మాములుగా మన పొట్టలో ఆహారాన్ని అరిగించడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రోజుకు 2-3 లీటర్లు అవసరాన్నిబట్టి, తినే ఆహారాన్ని బట్టి నాలుగు లీటర్లు కూడా ఉత్పత్తి అవుతుంది. ఈ యాసిడ్ ఎంత ఘాటైంది అంటే..మనం బాత్రూమ్ క్లీన్ చేయడానికి వాడే యాసిడ్ ఎంత ఘాటుగా ఉంటుందో ఇది కూడా అంతే ఘాటుగా ఉంటుందట. మన పొట్టలో ఉత్పత్తి అయిన హైడ్రోక్లీరిక్ యాసిడ్ ఘాటు PH 0.8-1 ఉంటుంది. పొట్ట అంచుల వెంబడి జిగురు ఉత్పత్తి అవుతుంది. ఆ జిగురుతో పాటు కొన్ని యంజైమ్స్ అనేవి కలుస్తాయి. అప్పుడు దీని ph0.8 నుంచి 1.2 వరకు మారుతుంది. అందుకని మన పొట్టలో 1.2 నుంచి 1.5 వరకు ఘాటు ఉంటేనే..మన ఆహార పదార్థాలు అన్నీ పిండిపిండి అయిపోతాయి, క్రిములన్నీ చంపబడతాయి, డైజేషన్ ప్రాసెస్ అనేది స్పీడ్ గా యాక్టీవ్ గా చేయబడుతుంది. పొట్టు 1Ph నుంచి 1.5 యాసిడ్ ను ఉంచుకుని క్రిములను చంపుతుంది. అంత ఘాటనై యాసిడ్ మన లోపల ఉత్పత్తి అవుతుంది..

కానీ మనం భోజనం చేసేప్పుడు నీళ్లు తాగడం వల్ల ఈ నీళ్లు వెళ్లి పొట్టలో యాసిడ్ కు కలుస్తాయి. యాసిడ్ కు నీళ్లు కలిస్తే పలుచగా అయిపోతుంది. ఎందులో అయినా వాటర్ కలిపితే దాని ఘాటు తగ్గుతుంది..పలుచుగా అవుతుంది కదా..అలానే ఆ యాసిడ్ ఘాటు కూడా తగ్గుతుంది. పొట్టలో యాసిడ్ 1.5 నుంచి 2.5 PH దాకా పెరిగిందనుకోండి యాసిడ్ ఘాటు తగ్గుతుంది. యాసిడ్ ఘాటు తగ్గేకొద్ది డైజెషన్ స్లో అవుతుంది. 2.5PH కంటే కూడా ఇంకా ఎక్కువ నీళ్లు తాగితే..డైల్యూట్ అయిపోయి..డైజెషన్ ఆగిపోతుంది. యాసిడ్ ఘాటు లేకపోతే..మెతుకులు, ముక్కలు పిండికావు. తినేప్పుడు, తిన్నతర్వాత పావులీటర్ తాగితేనే డైజెషన్ ప్రాసెస్ 20నిమిషాలు ఆగిపోతుందని సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు. 

అంటే మనం తినేప్పుడు తాగిన గ్లాస్ నీళ్లు వెళ్లి యాసిడ్ మీద పడుతున్నాయి. నిప్పులు మీద నీళ్లు చల్లినట్లు అయిపోతుంది. యాసిడ్ ఘాటు పెంచడానికి పొట్టమల్లా హైడ్రోక్లోరిక్ యాసిడ్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 20-25నిమిషాలు పడుతుందట. అది ఉత్పత్తి చేసి..ఈ పలుచన అయిన యాసిడ్ కు కలిపి అప్పుడు తిన్నది అరిగించాలి. సో మన ఒక గ్లాస్ వాటర్ తాగటం వల్ల లోపల అంత పని లేట్ అవుతుందనమాట. అందుకని తినేప్పుడు నీళ్లు తాగటం వల్ల డైజెష్ స్టాప్ అవుతుంది. 

అయితే ఏంటి..20 నిమిషాలు లేట్ అంతేకదా అనుకుంటున్నారేమో..యాసిడ్ ప్రొడెక్షన్ ఎక్కువయ్యేకొద్ది..మీకు పొట్టలో ఇరిటేషన్స్ ఎక్కువైపోతాయి. అల్సర్లు, యాసిడ్ రిఫక్స్ వస్తాయి. తిన్నతర్వాత అసౌకర్యంగా ఉంటుంది. ఈ పరిశోధనను ఇన్సస్ట్యూట్ ఫర్ క్వాలిటీ అండ్ ఎఫీషియన్సీ ఇన్ హల్త్ కేర్ (Institute For Quality And Efficiency In Health Care- Germany)వారు 2009లో చేశారు. 

అందుకని నీళ్లు ఎక్కువ తాగటం మంచిది కాదు. వెళ్లిన ఆహారం డైజెషన్ ప్రాసెస్ లో పడకపోతే..పులుస్తుంది. దానివల్ల గ్యాస్, తేన్పులు వస్తాయి. సాధ్యమైనంత వరుకు నీళ్లు తాగే అవసరం రాకూడదంటే..నమిలి తినండి. చిన్న చిన్న ముద్దలు పెట్టుకుని స్లోగా తింటే..గొంతుపట్టకుండా ఉంటుంది. తినడానికి అరగంట, గంటముందు గ్లాస్ వాటర్ తాగండి. తిన్న రెండు గంటల తర్వాత అప్పుడు వాటర్ తాగండి. ఇలా చేసినట్లైతే..మీకు అసలు గ్యాస్ సమస్యే ఉండదని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు అంటున్నారు.

-Triveni Buskarowthu

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.