బరువు తగ్గాలంటే రోజు కప్పు స్ట్రాబెర్రీస్‌ తింటే చాలు..! 

బరువు తగ్గాలంటే తిండి తగ్గించాలి, బాగా మానేయాలి అనుకుంటారు అవేం చేయక్కర్లేదు.. తినే తిండి మారిస్తే చాలు. సుఖంగా బరువు తగ్గొచ్చు. సన్నగా ఉన్నవాళ్లకు బరువు పెరగడం ఎంత కష్టమైన పనో, లావుగా ఉన్న వారికి తగ్గడం కూడా అంతే కష్టం. మీరు ఒకే రోజులో

బరువు తగ్గాలంటే రోజు కప్పు స్ట్రాబెర్రీస్‌ తింటే చాలు..! 


బరువు తగ్గాలంటే తిండి తగ్గించాలి, బాగా మానేయాలి అనుకుంటారు అవేం చేయక్కర్లేదు.. తినే తిండి మారిస్తే చాలు. సుఖంగా బరువు తగ్గొచ్చు. సన్నగా ఉన్నవాళ్లకు బరువు పెరగడం ఎంత కష్టమైన పనో, లావుగా ఉన్న వారికి తగ్గడం కూడా అంతే కష్టం. మీరు ఒకే రోజులో బరువు పెరగలేదు కదా.. అలానే ఒకే రోజులు కూడా సన్నగా అయిపోరు. టైమ్‌ పడుతుంది. ఓపిగ్గా మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండాలి. మీ వెయిట్‌ లాస్‌ జర్నీలు స్ట్రాబెర్రీస్‌ కూడా యాడ్‌ చేసుకోండి. ఎందుకంటే ఇవి బరువు తగ్గేందుకు చాలా బాగా ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు.  

స్ట్రాబెర్రీస్‌ తింటే వెంటనే బరువు తగ్గిపోరు కానీ మెల్లమెల్లగా బాడీలో అధిక కొవ్వు కరిగిపోతుంది. ఎందుకంటే పండ్లలో ఉండే పోషకాలు మన శరీరంలో మెటబాలిజంను సెట్ చేస్తాయి. అంటే బరువు తక్కువగా ఉంటే పెంచుతాయి, ఎక్కువగా ఉంటే తగ్గిస్తాయి. అలా చేసే ప్రత్యేకత ఈ పండ్లకు ఉంది. కారణం వీటిలో ఉండే ఫైబరే. 100 గ్రాముల స్ట్రాబెర్రీస్‌లో 91 శాతం నీరే ఉంటుంది. మిగతా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, షుగర్, ఫైబర్, ఫ్యాట్ ఉంటాయి.
 
స్ట్రాబెర్రీస్‌లో ఉండే ఫైబర్ పొట్టలో ఉండే కొవ్వును కరిగించేస్తుంది. రోజూ ఓ గిన్నెడు స్ట్రాబెర్రీస్‌ని తింటే అందులో ఉండే ఫైబర్ పొట్ట నిండిపోయిన ఫీల్ కలిగిస్తుంది. అందువల్ల ఇతర ఆహార పదార్థాలేవీ తినబుద్ధి కాదు. స్ట్రాబెర్రీస్‌లో ఎలాగూ 91 శాతం నీరే ఉంటుంది కాబట్టి బరువు తగ్గేందుకు వీలవుతుంది. ఈ రోజుల్లో చాలా మంది ఫ్యాట్ ఎక్కువగా ఉండే పుడ్, స్నాక్స్ తింటున్నారు. వాటికి దూరంగా ఉండాలంటే స్ట్రాబెర్రీస్ తినేయాలి. ఫలితంగా ఫాస్ట్ ఫుడ్ తినబుద్ధి కాదు. 
 
స్ట్రాబెర్రీస్ అడిపొనెక్టిన్, లెప్టిన్ అనే హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి. ఇవి బాడీలో కొవ్వును కరిగిస్తాయని నిపుణులు అంటున్నారు. అలాగే మెటబాలిజంను పెంచుతాయి. 100 గ్రాముల స్ట్రాబెర్రీస్‌లో 33 కేలరీలే ఉంటాయి. అందువల్ల స్ట్రాబెర్రీస్ వల్ల బరువు పెరిగే అవకాశాలుండవు. వర్కవుట్స్ చేసిన తర్వాత స్ట్రాబెర్రీస్ తింటే బాడీలో వేడి వెంటనే తగ్గుతుంది.
సలాడ్లు, ఇతరత్రా తీపి పదార్థాల్లో షుగర్ బదులు స్ట్రాబెర్రీస్ వేసుకుంటే బెటర్. వాటిలో ఉండే సహజ సిద్ధ స్వీట్ చక్కెర వేసుకోవాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. ఆరోగ్యానికి మేలు కూడా. చక్కెర ఎంత తక్కువ తింటే బాడీకి అంత మంచిది. అయితే సాధారణ పండ్లలా వాటిని నార్మల్‌ వాటర్‌తో కడిగేసి తినేయకూడదు. వీటిని తినే ముందు ఒక అరగంట పాటు గోరువెచ్చని నీటిలో లైట్‌గా సాల్ట్‌ వేసి నానపెట్టండి. ఆ తర్వాత మళ్లీ క్లీన్‌ చేసి తినండి. స్ట్రాబెర్రీస్‌లో కంటికి కనిపించని పురుగులు బోలెడు ఉంటాయి.  
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.