పిల్లలకు పాలతో ఈ పదార్ధాలు కలిపి ఇస్తే ఎంత ప్రమాదమో తెలుసా.. !

చిన్నపిల్లలు ఏ ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు.. ముఖ్యంగా వారికి బలవర్ధకమైన ఆహారాన్ని ఇవ్వటానికి తల్లులు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఇందుకోసం కనీసం ఆహారం తీసుకోకపోతే పాలైన ఇద్దామని.. ఆ పాలతో కొన్ని ఆహార పదార్థాలు కలిపి Forbidden combination ఇస్తూ ఉంటారు.

పిల్లలకు పాలతో ఈ పదార్ధాలు కలిపి ఇస్తే ఎంత ప్రమాదమో తెలుసా.. !


చిన్నపిల్లలు ఏ ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు.. ముఖ్యంగా వారికి బలవర్ధకమైన ఆహారాన్ని ఇవ్వటానికి తల్లులు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఒక పూట అన్నం తినకపోతే వారి ఆరోగ్యం ఏమవుతుందో అని భయపడి ఎంతో హైరానా పడుతూ ఉంటారు.  ఇందుకోసం కనీసం ఆహారం తీసుకోకపోతే పాలైన ఇద్దామని.. ఆ పాలతో కొన్ని ఆహార పదార్థాలు కలిపి Forbidden combination ఇస్తూ ఉంటారు.అయితే దీని వలన కొన్నిసార్లు వారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని తెలుస్తోంది.. 

పిల్లలు రుచిగా ఉండనిదే ఎలాంటి ఆహారం ముట్టుకోరు. ముఖ్యంగా వారికి ఒంట్లో బాలేనప్పుడు ఆహారం తీసుకోవడానికి ఇష్టపడరు. ఈ సమయంలో తల్లులు కొన్ని రకాల పదార్థాలు కలిపి ఇస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల పదార్థాలు పాలతో కలిసినప్పుడు ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలాంటివి పిల్లలకు ఇవ్వడం వల్ల వారి ఆరోగ్యం మరింత చెడిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.. అలాగే అజీర్తి, గ్యాస్ ప్రాబ్లమ్స్, వాంతులు, వికారం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలుస్తోంది..  అయితే పాలతో పాటు కలపకూడని ఆహారాలు ఏంటంటే.. 

పాలతో ముఖ్యంగా సిట్రస్ జాతి పండ్లను కలపకూడదు. వీటిని పాలలో కలిపినప్పుడు పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే సిట్రస్ జాతికి చెందిన పండ్లను పిల్లలకు తినిపించిన వెంటనే పాలను తాగించకూడదు. అలాగే ఎలాంటి సిట్రస్ జాతి పండ్లను పాలతో కలిపి జ్యూస్ చేసి పిల్లలకు ఇవ్వకూడదు.. 

Mango Orange Smoothie - 2 Cookin' Mamas

అలాగే బరువు పెరగాలి అనుకునేవారు చిన్న పిల్లలకు సైతం అరటి పండ్లను పాలతో కలిపి ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా అరటి పండుతో చేసే మిల్క్ షేక్ పిల్లలకి సైతం ఎంతో నచ్చుతుంది. అయితే ఈ రెండిటిని కలపటం మంచిది కాదని.. ఇవి రెండూ కలిసినప్పుడు విషం గా మారుతుందని.. కడుపులో చెడు వాయువులను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.. అంతేకాకుండా ఇది నిద్రను సైతం ప్రభావితం చేస్తుందని.. అరిగించుకోలేని సమయాల్లో వాంతులు, వికారం ఏర్పడి జ్వరానికి సైతం దారితీస్తుందని తెలుస్తోంది.. 

అలాగే ద్రాక్ష పండ్లను సైతం పాలతో కలపడం వల్ల కొన్ని రకాల సమస్యలు వస్తాయని.. వీటిని నేరుగా తీసుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో కలిపి తీసుకోవడం వల్ల అన్ని చెడు ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అలాగే వీటి కలయిక వలన విరోచనాలు, వాంతులు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పిల్లలకు సైతం వీటిని కలిపి ఇవ్వకూడదు.. 

అలాగే పెరుగును సైతం పండ్లతో కలిపి తీసుకోకూడదని పిల్లలకు కూడా తినిపించకూడదని.. ఇలా చేయడం వల్ల కడుపులో విపరీతంగా గ్యాస్ ఫామ్ అవుతుందని.. బయట దొరికే ప్యాకేజీ పెరుగును ఉపయోగించడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతుందని తెలుస్తోంది. అందుకే పిల్లలకు ఇచ్చే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కేవలం పాలను మాత్రమే పిల్లలకి ఇవ్వటం మంచిదని తెలుస్తోంది. అలా కాని సమయంలో ఇంట్లోనే తయారు చేసే ఏదైనా పౌడర్ ను కలిపి ఇవ్వటం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.