ఈ కింది మధుమేహ లక్షణాలు మీకు తెలుసా????

చక్కెర వ్యాధి అంటే అందరికీ తెలుసు. దానివల్ల ఎన్ని అనర్థాలు వస్తాయో కూడా తెలుసు. కానీ నిర్లక్ష్యం చేసేస్తాం. అదే తప్పు. మనకు ఒక అనారోగ్యం వస్తే దాన్నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవాలి. వ్యాధి గురించి అవగాహన పెంచుకోవాలి.

ఈ కింది మధుమేహ లక్షణాలు మీకు తెలుసా????


చక్కెర వ్యాధి అంటే అందరికీ తెలుసు. దానివల్ల ఎన్ని అనర్థాలు వస్తాయో కూడా తెలుసు. కానీ నిర్లక్ష్యం చేసేస్తాం. అదే తప్పు. మనకు ఒక అనారోగ్యం వస్తే దాన్నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవాలి. వ్యాధి గురించి అవగాహన పెంచుకోవాలి.


చక్కెర వ్యాధినే మధుమేహం, డయాబెటిస్‌ అంటారు. ఇది ఒక దీర్ఘకాలిక సమస్య. శరీరం అనేది తగినంత ఇన్సులిన్‌ ఉత్పత్తి చేయకపోయినా....లేకపోతే ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ను సరైన రీతిలో శరీరం ఉపయోగించలేకపోయినప్పుడు ఈ డయాబెటిస్‌ అనేది వస్తుంది. ఈ మధుమేహం వల్ల దృష్టి లోపం వచ్చే ప్రమాదం ఉంది. గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధి వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయోచ్చు. వ్యాధికి సంబంధించి మందులను తీసుకుంటే....దాని ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

అతిగా దాహం వేస్తుండటం, అతిగా మూత్రవిసర్జన చేయడం వంటివి మధుమేహానికి సంకేతాలు. డయాబెటిస్‌కు ప్రారంభంలోనే కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటిని మరిచిపోకూడదు. ఈ వ్యాధి ఒకసారి వస్తే ఎప్పటికీ నయం కాదు. దీని నివారణకు....పూర్తి చికిత్స లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కానీ దాన్ని అదుపులో మాత్రం పెట్టుకోవచ్చు. శుభ్రమైన ఆహార నియమాలతో పాటు వైద్యుల సూచన మందులు తీసుకుంటే....వ్యాధి ముదరకుండా చూసుకోవచ్చు. కాబట్టి ఈ పరిస్థితి తెచ్చుకోవడం కంటే, మధుమేహం రాకుండా జాగ్రత్తగా ఉంటేనే బెటర్. చికిత్స చేయకుండా వదిలేస్తే మాత్రం అనారోగ్య సమస్యలు మాత్రం చుట్టేస్తాయి.

తరచుగా మూత్రవిసర్జన చేస్తుంటే అది మధుమేహానికి తొలి సంకేతం. రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, మూత్రపిండాలు మూత్రం ద్వారా అదనపు గ్లూకోజ్‌ను ఫిల్టర్ చేసి తొలగించడానికి ప్రయత్నిస్తాయి. దీనివల్ల వ్యక్తి సాధారణం కంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తాడు.


మధుమేహం....శరీరం రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. దానివల్ల అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా గాయం అయినపుడు కూడా మానేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అకాంథోసిస్ నైగ్రికన్స్ అనేది మెడ, గజ్జ, చంకల చుట్టూ కనిపించే ఒక పరిస్థితి. చర్మం మందపాటి ఆకృతిలో, అతుకుల వలె కనిపిస్తుంది. ఇది డయాబెటిస్‌కు సూచన కావచ్చు కాబట్టి వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

నోరు పొడిబారడం అనేది నోటిలో లాలాజల ఉత్పత్తి తగ్గడం వల్ల కలుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం కూడా ఇందుకు కారణం కావచ్చు. పొడిబారిన నోరు మధుమేహానికి హెచ్చరిక సంకేతం. అదనంగా నోటిలో లాలాజలం తక్కువైతే మీ దంతాలు, చిగుళ్లలో సమస్యలకు దారితీయవచ్చు.

మీరు శ్వాస తీసుకునేటపుడు ఏదైనా పండిన వాసన పీల్చుతున్న అనుభూతి కలిగి ఉంటే, అది మధుమేహానికి సంబంధించిన ఒక సైడ్ ఎఫెక్ట్. వైద్యపరంగా, దీనిని డయాబెటిక్ కీటోయాసిడోసిస్ అంటారు. శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించలేనప్పుడు.....శక్తి కోసం కొవ్వులను విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో కీటోన్‌లను విడుదల చేసినప్పుడు ఇది జరుగుతుంది. రక్తప్రసరణలో అదనపు కీటోన్ల ఉనికి కారణంగా, శ్వాస తీసుకుంటున్నపుడు ఒక రకమైన వాసన వస్తుంది.

వికారంగా అనిపించడం, తలతిరగడం కూడా మధుమేహానికి సూచిక. మధుమేహం వల్ల జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ప్రత్యేకించి, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఇది గ్యాస్ట్రోపరేసిస్‌కు దారితీస్తుంది. ఫలితంగా వికారం కలుగుతుంది.

అధిక రక్త చక్కెర స్థాయిలు నరాలను దెబ్బతియోచ్చు. దీనిని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. ఈ పరిస్థితి కలిగిన వ్యక్తుల్లో తరచుగా కాళ్లు, పాదాల ప్రాంతంలో నొప్పి, మంట లేదా తిమ్మిరిని అనుభవిస్తారు. మీరు ఈ లక్షణాలను అనుభవిస్తున్నట్లయితే, మీ చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయని సూచించవచ్చు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.