కపాలభాతి ప్రాణాయామం గురించి విన్నారా..? చేశారంటే.. పొట్ట దగ్గరి కొవ్వు మాయం..!

యోగాలో ఎన్నో ఆసనాలు ఉన్నాయి.. ఒక్కో ఆసనంలో ఇంకెన్నో రకాలు ఉన్నాయి.. ప్రాణాయామం గురించి మీరు వినే ఉంటారు.. ఇందులో అనేక రకాలు ఉన్నాయి. వాటిల్లో కపాలభాతి ప్రాణాయామం ఒకటి. దీన్ని చేయడం సులభమే

కపాలభాతి ప్రాణాయామం గురించి విన్నారా..? చేశారంటే.. పొట్ట దగ్గరి కొవ్వు మాయం..!


యోగాలో ఎన్నో ఆసనాలు ఉన్నాయి.. ఒక్కో ఆసనంలో ఇంకెన్నో రకాలు ఉన్నాయి.. ప్రాణాయామం గురించి మీరు వినే ఉంటారు.. ఇందులో అనేక రకాలు ఉన్నాయి. వాటిల్లో కపాలభాతి ప్రాణాయామం ఒకటి. దీన్ని చేయడం సులభమే. శ్వాస మీద పూర్తిగా ధ్యాసను ఉంచాలి. ఈ ప్రాణాయామాన్ని రోజూ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కపాలభాతి ప్రాణాయామం ఎలా చేయాలి.. దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..!

What is Pranayama: Types & Benefits of Pranayama - Livayur under 300  characters

కపాలభాతి ఇలా చేయండి..

ధ్యానం చేసినట్లు పద్మాసనంలో కూర్చోండి.

కళ్లు మూసుకుని ప్రశాంతంగా మారండి.

రెండు నాసికా రంధ్రాలతో సుదీర్ఘమైన శ్వాస పీల్చండి.

ఛాతిని విస్తరించండి.

పొట్ట నుంచి బయటకు తీసినట్లుగా గాలిని బలవంతంగా రెండు నాసికా రంధ్రాల ద్వారా బయటకు వేగంగా పంపండి.

అలాగే వేగంగా గాలి పీలుస్తూ బలంగా వదులుతూ ఉండండి.

ఈ విధంగా 30 సార్లు చేయాలి.

చివరకు లోతుగా శ్వాస తీసుకుని నెమ్మదిగా వదలాలి. దీంతో ఒక రౌండ్‌ పూర్తవుతుంది. ఇలా ఇంకో రెండు సార్లు చేయాలి. అంటే మొత్తం 90 సార్లు గాలిని పీల్చి వదలాలన్నమాట. ఒక్కో రౌండ్‌ చివర్లో లోతుగా శ్వాస తీసుకుని నెమ్మదిగా వదలాలి. ఇలా కపాలభాతి చేయాలి. కపాలభాతి మొదట్లో చేసేవారికి 30 సార్లు గాలి పీల్చి వదలడం అంటే కష్టంగానే ఉంటుంది. మీరు మొదట ఒక్కో రౌండ్‌కు పదిసార్లు వేగంగా గాలి పీలుస్తూ వదులుతూ చేయండి.. రోజు రోజు సంఖ్యను పెంచుకోవచ్చు. అస్సలు చేయకపోవడం కంటే.. కొద్ది కొద్దిగా చేస్తూ ఉండటం మేలు కదా..!

కపాలభాతి ప్రయోజనాలు

కపాలభాతి చేయడం వల్ల పొట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. 
ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. 
షుగర్‌ లెవల్స్‌, కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఉదయం పరగడుపున కపాలభాతి చేయాలి. 

మీరు చేయకండి..!

ముక్కు నుంచి రక్తస్రావం అయ్యే సమస్య ఉన్నవారు, మైగ్రేన్‌, స్ట్రోక్‌, వికారం, హైబీపీ, తలతిరగడం, హెర్నియా, అల్సర్లు, ఎపిలెప్సీ ఉన్నవారు కపాలభాతి చేయరాదు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.