కొంపముంచుతున్న గ్రీన్‌ టీ.. మితిమీరితే రక్తహీనతే 

ఆరోగ్యంగా ఉండాలని చాలా మంది హెర్బల్‌ టీలను ఎంచుకుంటారు. అలాంటివాటిల్లో గ్రీన్‌ టీ మొదటిది. ఇది డైలీ తాగడం వల్ల బాడీ లోపలి నుంచి క్లీన్‌ అవుతుంది. బరువు అదుపులో ఉంటుంది. కానీ కాయిన్‌కు మరో సైడ్‌ మ్యాటర్‌ వేరేలా ఉంది తెలుసా.

కొంపముంచుతున్న గ్రీన్‌ టీ.. మితిమీరితే రక్తహీనతే 


ఆరోగ్యంగా ఉండాలని చాలా మంది హెర్బల్‌ టీలను ఎంచుకుంటారు. అలాంటివాటిల్లో గ్రీన్‌ టీ మొదటిది. ఇది డైలీ తాగడం వల్ల బాడీ లోపలి నుంచి క్లీన్‌ అవుతుంది. బరువు అదుపులో ఉంటుంది. కానీ కాయిన్‌కు మరో సైడ్‌ మ్యాటర్‌ వేరేలా ఉంది తెలుసా..? గ్రీన్‌ టీ తాగడం వల్ల కూడా కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయి. అవేంటంటే..
గ్రీన్ టీ మోతాదుకు మించి కప్పులకు కప్పులు తాగితే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే కొంతమందికి కడుపులో మంట రావడంతో పాటు అది అసిడిటి సమస్యకు దారి తీస్తుంది.   
10 Health Benefits of Green Tea: Know all about how it helps in weight  management, reduces risk of Type 2 Diabetes and more
గ్రీన్ టీలో ఉండే కంటెంట్స్ శరీరంలో ఐరన్, క్యాల్షియం వంటి ఇతర పోషకాలను గ్రహించడంలో అడ్డుపడతాయి. ఫలితంగా ఎముకలు బలహీనపడే ప్రమాదం లేకపోలేదు. గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల అది శరీరంలో ఐరన్ సంగ్రహించే ప్రక్రియను అడ్డుకుంటుంది. ఇది క్రమక్రమంగా ఐరన్ లోపానికి దారి తీస్తుంది. 
గ్రీన్ టీలోనూ కెఫైన్ ఉంటుంది. రోజులో ఎక్కువసార్లు గ్రీన్ టీ సేవించడం వల్ల శరీరంలో కెఫైన్ కంటెంట్ ఎక్కువై అది తలనొప్పికి దారితీస్తుంది.
గ్రీన్ టీని అధిక మోతాదులో తాగితే నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. 
గ్రీన్ టీని అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల శరీరంలో అధిక మొత్తంలో చేరే కెఫైన్ మీ మెదడుకు రక్తం సరఫరా కాకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా మోషన్ సిక్‌నెస్ అనే అనారోగ్య సమస్య తలెత్తుతుంది.
గ్రీన్ టీలో టానిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఎక్కువ మొత్తంలో తీసుకుంటే.. కళ్లు తిరగడం లేదా వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. గ్రీన్ టీని ఎక్కువగా సేవిస్తే అది మీ కాలేయంపై దుష్ప్రభావం చూపిస్తుంది. గ్రీన్ టీ అధికంగా సేవించే వారిలో లివర్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
చాలా మంది మహిళలకు రక్తహీనత సమస్య ఉంటుంది. వీటికోసం ట్యాబ్లెట్స్ వాడుతుంటారు, మంచి డైట్‌ ఫాలో అవుతారు. అయిన ఫలితం ఉండదు. ఇంత మంచి లైఫ్‌స్టైల్‌ మెయింటేన్‌ చేస్తున్నా ఎందుకు ఈ సమస్య వచ్చిందని తెగ. ఫీల్‌ అవుతారు. కారణం మీరు రోజు గ్రీన్‌ టీ తాగడం కూడా అయి ఉండొచ్చు. అందరికీ ఇదే కారణం కాకపోవచ్చు.. కానీ రక్తహీనత ఉన్న వాళ్లు ఎవరైతే డైలీ గ్రీన్‌ టీ తాగుతారో కొన్నిరోజులు దాన్ని ఆపేసి చూడండి. మీకే తేడా తెలుస్తుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.