స్త్రీలలో సంతాన లోపం సమస్యకు ఇవే కారణాలు..? ఏ ఒక్కటి ఉన్నా డేంజరే..

పెళ్లైన తర్వాత పిల్లలు పుట్టకపోతే.. ఆ జంట మానసికంగా చాలా కుంగిపోతారు. ముఖ్యంగా మహిళలు అయితే తప్పంతా. తమ వల్లే అని బాధపడతారు. ఇంట్లో వాళ్లు, చుట్టాలు బయటకు వెళ్తే ఒకటో గోల.. నేటి కాలంలో

స్త్రీలలో సంతాన లోపం సమస్యకు ఇవే కారణాలు..? ఏ ఒక్కటి ఉన్నా డేంజరే..


పెళ్లైన తర్వాత పిల్లలు పుట్టకపోతే.. ఆ జంట మానసికంగా చాలా కుంగిపోతారు. ముఖ్యంగా మహిళలు అయితే తప్పంతా. తమ వల్లే అని బాధపడతారు. ఇంట్లో వాళ్లు, చుట్టాలు బయటకు వెళ్తే ఒకటో గోల.. నేటి కాలంలో.. మారతున్న జీవనశైలి వల్ల సంతానం కలగడం పెద్ద సమస్యగా మారుతుంది. లోపం అమ్మాయిల్లోనే కాదు.. అబ్బాయిల్లోనూ ఉంటుంది. మగవారి వంధత్వ రేటు కూడా ఇండియాలో ఎక్కువగానే ఉంది. కొన్ని సమస్యల వల్ల ఆడవారిలో సంతానలోపం ఉంటుంది. అవి ఏంటంటే.. 

సిటీ, మెట్రో సిటీల్లోని స్త్రీలు అనేక ఆరోగ్య సమస్యలకి గురవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని అన్ని అవయవాలు ఒక్కోదానితో ఒకటి ముడిపడి ఉండడం వల్ల ఏదైనా వ్యాధి సోకితే ఆ ప్రభావం మిగతా అవయవాలకి కూడా సోకుతాయి. దీంతో.. షుగర్ వ్యాధి, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, ఓవర్ వెయిట్, ఎనీమియా, థైరాయిడ్ ఇలా ఒక్కటేంటి.. ఒకదాని తర్వాత ఒకటి మన శరీరాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఇవన్నీ కూడా ఆడవారిలో సంతాన సమస్యలకి దారితీస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.
షుగర్ వ్యాధి  

షుగర్ వ్యాధి నేడు పదింట ఆరుగురికి ఉంటుంది.. ఈ సమస్య కారణంగా స్త్రీలకి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. టైప్ 1 మధుమేహం ఉన్నవారికి రుతుచక్రం ఆలస్యంగా ప్రారంభం అవుతుంది. మధ్యలోనే ఆగిపోవడం సరిగ్గా రాకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇదే కాకండా.. దీని కారణంగా.. అండాశయ సమస్యలు ఎదురవుతాయి. రుతు క్రమ సమస్యలు వెంటాడుతాయి. ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీపై ఎఫెక్ట్ చూపిస్తాయి. దీంతో ఫెర్టిలిటీ సమస్యలు ఎదురవుతాయి.

ఇక టైప్ 2 డయాబెటీస్ వారికి ఇన్సులిన్ నిరోధకత ఎదురవుతుంది. ఇది అధిక రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కలిగిస్తుంది. టైప్ 1, 2 డయాబెటీస్ రెండూ కూడా పీరియడ్స్ ప్రాబ్లమ్స్‌ని ఎక్కువ చేస్తాయి. దీంతో గర్భం దాల్చడం కష్టంగా మారుతుంది.

పీసీఓఎస్‌తో గర్భ సమస్యలు

పీసీఓఎస్ కూడా 5 నుంచి 13 శాతం వరకూ స్త్రీలలో పునరుత్పత్తి వయసుపై ప్రభావం చూపిస్తుంది. పీసీఓఎస్ షుగర్ వ్యాధితో ముడిపడి ఉంది. ఇది ఇన్సులిన్ నిరోధకత, పెరిగిన టెస్టోస్టెరాన్ స్థాయిలతో సంబంధం కలిగి ఉంటుంది. చాలా సందర్భాలలో అండాశయం నుండి గుడ్డు విడుదల కాకపోవడంతో స్త్రీలకి గర్భ సమస్యలు ఎదురవుతాయి. దీంతో పాటు ఊబకాయం కూడా పునరుత్పత్తిపై ప్రభావంపై చూపుతుంది. అధిక బరువు ఉన్న మహిళల్లో రుతుక్రమ సమస్యలు సాధారణంగా ఉండేవే.. ఓవర్ వెయిట్, పిండం అభివృద్ధి, ఫాంప్లాంటేషన్, గర్భసమస్యలకి దారి తీస్తుంది. అధికంగా ఉన్న బరువు ప్రెగ్నెన్సీ రాకపోవడమే కాదు.. ఒక వేళ వచ్చినా అబార్షన్‌, గర్భాధారణ సమస్యల ప్రమాదాన్ని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మహిళలు ఎత్తుకు తగిన బరువు ఉండాలానే చూసుకోవాలి.

రక్తహీనత..

రక్తం తక్కువగా ఉండడం కూడా గర్భ సమస్యలకు దారి తీస్తుంది. శరీరంలో ఐరన్ తక్కువగా ఉండడం వల్ల హిమోగ్లోబిన్ తగిన స్థాయిలో ఉండదు. దీంతో.. అండాశయాల పునరుత్పత్తి అవయవాలకు ఆక్సిజన్ తక్కువ మొత్తంలో వెళ్తుంది. దీంతో.. తక్కువ నాణ్యత గుడ్ల తయారవుతాయి. ఇవన్నీ కూడా గర్భాశయం, ఎండోమెట్రియల్ రెసెప్టివిటీని ప్రభావితం చేస్తాయి. గర్భాధారణ సమయంలో స్త్రీకి రక్తహీనత ఉంటే నెలలు నిండకుండానే పిల్లలు పుడతారు. అందువల్ల పుట్టే పిల్లలు బలహీనంగా, తక్కువ బరువుతో పుడతారు.

థైరాయిడ్..

ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ప్రతి స్త్రీ థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు చెక్ చేసుకోవాలి. చాలామంది లావుగా ఉన్నవాళ్లకే థైరాయిడ్‌ ఉంటుంది అనుకుంటారు..కానీ సన్నగా ఉన్నవాళ్లు కూడా థైరాయిడ్‌ భారిన పడే ప్రమాదం ఉంది. గర్భసమస్యలు, హైపోథైరాయిడిజంకి లింక్ ఉంది. థైరాయిడ్ గ్రంధి బలహీనంగా ఉన్న స్త్రీలకు గర్భసమస్యలు ఉంటాయి. తక్కువ స్థాయి థైరాయిడ్ హార్మోన్ మీ అండాశయం నుంచి గుడ్డు విడుదలకి ఆటంకం కలిగిస్తాయి.

ముఖ్యంగా ఈ కారణాల వల్ల స్త్రీలకు పిల్లలు పుట్టడం లేదు..కాబట్టి.. మీకు పెళ్లికాకపోయినా సరే.. ముందు మీలో ఈ సమస్యలు లేకుండా చూసుకోండి.. అధికంగా బయటి ఫుడ్స్‌తినడం, అధికబరువు లేకుండా మీకు మీరు హెల్తీగా ఉండేలా చూసుకోండి. పైకి మాత్రమే అందంగా ఉంటే సరిపోదు.. ఇన్నర్‌ బ్యూటీ కూడా ముఖ్యమే అమ్మాయిలూ..!!

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.