కూల్‌డ్రింక్స్‌ తాగితే బట్టతలను భరించాల్సిందే.. అధ్యయనం చెబుతున్న వాస్తవం 

జుట్టు మీద మగవాళ్లకు శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. కాస్త జుట్టు రాలితే చాలు ఎక్కడలేని టెన్షన్‌.. వామ్మో ఇది ఎక్కడ బట్టతలకు దారితీస్తుందేమో అని.  

కూల్‌డ్రింక్స్‌ తాగితే బట్టతలను భరించాల్సిందే.. అధ్యయనం చెబుతున్న వాస్తవం 


జుట్టు మీద మగవాళ్లకు శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. కాస్త జుట్టు రాలితే చాలు ఎక్కడలేని టెన్షన్‌.. వామ్మో ఇది ఎక్కడ బట్టతలకు దారితీస్తుందేమో అని.  ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. దీనికి చాలా కారణాలున్నాయి. ఒత్తిడి, జన్యుపరమైన సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత లేదా డ్రగ్స్ దుర్వినియోగం వల్ల బట్టతల ఏర్పడవచ్చు. కానీ, రోజూ కూల్‌ డ్రింక్స్‌ తాగినా బట్టతల సమస్య వస్తుందని మీకు తెలుసా? ఒక పరిశోధనలో తేలిన వాస్తవం ఇది. 
Cold Drinks Wallpapers - Wallpaper Cave
బీజింగ్‌లోని సింఘువా యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనం ప్రకారం, కొన్ని రకాల పానీయాలు తాగే పురుషులకు జుట్టు రాలిపోయే అవకాశం ఉందని తేలింది. అంతేకాదు అతి త్వరలో బట్టతలను అనుభవించాల్సి వస్తుందట.  ఆ పానీయాలు ఏమిటో తెలుసుకుందాం.
ఎనర్జీ డ్రింక్స్,
ఎనర్జీ డ్రింక్స్ లేదా షుగర్ డ్రింక్స్, సోడా వంటివి తీసుకునే వారిలో జుట్టు రాలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చైనా పరిశోధకులు ఒక అధ్యయనంలో గుర్తించారు. ఎనర్జీ డ్రింక్స్ ప్రభావం పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా 13 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్కులు ఈ వ్యాధి బారిన పడతారని అధ్యయనంలో తేలింది.
 
అధ్యయనం ఎలా నిర్వహించబడింది?
1000 మంది పురుషులపై ఒక అధ్యయనం జరిగింది. మొదట వారానికి 3 లీటర్ల శక్తి పానీయాలు త్రాగారు. రోజుకు ఒకటి కంటే ఎక్కువ ఎనర్జీ డ్రింక్ తాగేవారిలో జుట్టు రాలిపోయే ప్రమాదం 42 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
అధ్యయనం ప్రకారం, ఫాస్ట్ఫుడ్ తినడం లేదా తక్కువ కూరగాయలు తినడం వల్ల జుట్టు రాలిపోవడమే కాకుండా, ఆందోళనకు కూడా గురవుతారు. ఫాస్ట్ ఫుడ్ లేదా జంక్ ఫుడ్ ఊబకాయానికి దారితీస్తుంది. అవి క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయి. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. 
జుట్టు బలంగా ఉండాలనుకుంటున్నారా? 
జుట్టు పెళుసుగా ఉంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి వారు వారానికి రెండు సార్లు మాత్రమే తలస్నానం చేయాలి. నిపుణుల సలహాతో పాటు ఆర్యువేద సలహాలు పాటించాలి. అలోవెరా జెల్ జుట్టు రాలడానికి లేదా బలహీనమైన జుట్టును బలోపేతం చేయడానికి ఉపయోగించవచ్చు. జుట్టు రాలడానికి ప్రధాన కారణం చుండ్రు. అందుకే నిమ్మరసం మరియు పెరుగును ఉపయోగించండి. సీజన్‌తో సంబంధం లేకుండా, తలస్నానానికి ముందు నిమ్మ-పెరుగు ముద్దను తలకు పట్టించాలి. జుట్టు ఒత్తుగా ఉంటే.. మెరిసే, జుట్టు పెరుగుదలకు ఎగ్ హెయిర్ మాస్క్ వేసుకోండి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.