Healthy food : ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి

Healthy food : చాలా మందికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియదు. దానివల్ల దీర్ఘకాల వ్యాధులు వస్తాయి. నాణ్యత లేని ఆహారం తినడం వల్ల ప్రపంచంలో ఎంతమంది చనిపోతున్నారో....ఎంత మంది వ్యాధుల బారిన పడుతున్నారో వాటిని గణించి డబ్ల్యూహెచ్ వో వార్షిక నివేదిక విడుదల చేస్తూ ఉంటుంది.

Healthy food : ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి
what to eat to be healthy


Food to be healthy : రోజులు మారే కొద్దీ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. సుఖవంతమైన జీవనం వచ్చేసరికి ఆరోగ్య సమస్యలు మరిన్ని పెరిగాయి. కొందరు ప్రతి రోజూ పిడకెడేసి మందులు మింగాల్సిందే. అది చేస్తే కునుకు పట్టదు. తిన్నది జీర్ణం కాదు. అలా మారిపోయాయి మన జీవన ప్రమాణాలు. కరోనా తర్వాత చాలా మంది జీవనశైలిలో మార్పులు వచ్చాయి. ఆహార పద్ధతుల్లోనూ మార్పులొచ్చాయి. ఇంకా కొందరు మాత్రం శరీరం గురించి గానీ, తినే తిండి గురించి గానీ పట్టించుకోరు.

ప్రతి వ్యక్తి జీవితంలోనూ సెల్ ఫోన్ అనేది భాగమైపోయింది. ఇంట్లో యజమాని నుంచి చిన్న పిల్లవాడి వరకు అందరూ సెల్ ఫోన్ లో మునిగిపోతున్నారు. అసలు వ్యాయామం జోలికే పోవట్లేదు. తిన్నదంతా శరీరంలోనే పేరుకుపోయి చెడు కొవ్వుగా మారుతోంది. దానికితోడు నాణ్యతలేని ఆహారం, జీవించే విధానంలో లోపాలు....వీటిన్నింటితో మనిషి ఎన్నో సమస్యలకు నిలయంగా మారుతున్నారు.

ధూమపానం, మధ్యపానం వల్ల పాతికేళ్లకే డయాబెటిస్‌, అధిక బరువు వంటి సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి స్థితిలో ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవడమే మంచిది. లేకపోతే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

చాలా మందికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియదు. దానివల్ల దీర్ఘకాల వ్యాధులు వస్తాయి. నాణ్యత లేని ఆహారం తినడం వల్ల ప్రపంచంలో ఎంతమంది చనిపోతున్నారో....ఎంత మంది వ్యాధుల బారిన పడుతున్నారో వాటిని గణించి డబ్ల్యూహెచ్ వో వార్షిక నివేదిక విడుదల చేస్తూ ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకోనైనా ప్రజల్లో మార్పు రావాలి.

ముఖ్యంగా మనం తినే ఆహారంలో ఉప్పు చాలా తగ్గించాలి. కారం, మసాలాలు వంటి వాటికి దూరంగా ఉండాలి. అలాంటప్పుడే డయాబెటిస్‌, గుండె సమస్యలు, క్యాన్సర్‌ వంటి ప్రమాదాలు తగ్గుతాయని ఆరోగ్య సంస్థలు పదే పదే చెబుతున్నాయి. రోజుకు 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలని, కొవ్వు తక్కువగా ఉన్న పాలు, డెయిరీ ఉత్పత్తులు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఆరోగ్యంగా ఉండాల్సిన నియమాలు

  • రోజూ తినే ఆహారంలో తృణధాన్యాలు, మిల్లెట్స్‌, బీన్స్, చిక్కుళ్లు, తాజా పండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు, గుడ్లు, పాలు వంటి ఆహార పదార్థాలు చేర్చుకుంటే మంచిది.
  • శీతలపానీయాలు, బయట దొరికే జ్యూస్ లకు దూరంగా ఉండాలి.
  • ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతోన్న ఫుడ్....ఒక నిమిషంలో తయారయ్యే బిర్యానీ, న్యూడిల్స్, వంటి వాటికి చాలా అంటే చాలా దూరంగా ఉండాలి.
  • రోజు నీళ్లు మాత్రం మర్చిపోకూడదు. నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఉండే మలినాలన్నీ త్వరగా బయటకొచ్చేస్తాయి.
  • శరీరానికి తగిన శ్రమ అవసరం, వాషింగ్ మిషన్ కాకుండా చేతితో ఉతకడం బెటర్.
  • తరచూ కొంచెం కొంచెం వ్యాయామాలు చేస్తూ ఉండాలి.
  • మెంతులు రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే అవి తిని ఆ నీళ్లు తాగేయాలి, దానివల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. మలబద్ధకాన్ని కూడా క్లియర్ చేస్తుంది. నెలసరి సమయంలో నొప్పిని తగ్గిస్తుంది
  • ఎండు ద్రాక్షను బాగా తినాలి. నానబెట్టి ఉదయం తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది
  • అవిసె గింజలు బరువు తగ్గడానికి సహాయపడుతాయి.
  • నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.