తెల్ల మిరియాలతో కళ్ల సమస్యలు మాయం.. ఆయుర్వేదం చెప్తున్న వాస్తవం..!

కళ్లు బాగుంటే మనం బాగుంటాం.. అదేంటో నోరు మంచిదైతే ఊరుమంచిది అవుతుందన్నట్లు ఉంది అనుకుంటున్నారా..? అంతే మరీ.. ఈరోజుల్లో చాలా మంది చిన్నవయసులోనే జోళ్లు వేసుకుంటున్నారు. కారణం స్క్రీన్‌ లైటింగ్‌కు బాగా అలవాటు పడటం, సరైన పోషకాహారం లేకపోవడం. కంటి చూపు మంద‌గించ‌డం, కంటి నుండి నీళ్లు కార‌డం, క‌ళ్ల నొప్పులు, క‌ళ్లు మ‌స‌క‌గా క‌న‌బ‌డ‌డం

తెల్ల మిరియాలతో కళ్ల సమస్యలు మాయం.. ఆయుర్వేదం చెప్తున్న వాస్తవం..!


కళ్లు బాగుంటే మనం బాగుంటాం.. అదేంటో నోరు మంచిదైతే ఊరుమంచిది అవుతుందన్నట్లు ఉంది అనుకుంటున్నారా..? అంతే మరీ.. ఈరోజుల్లో చాలా మంది చిన్నవయసులోనే జోళ్లు వేసుకుంటున్నారు. కారణం స్క్రీన్‌ లైటింగ్‌కు బాగా అలవాటు పడటం, సరైన పోషకాహారం లేకపోవడం. కంటి చూపు మంద‌గించ‌డం, కంటి నుండి నీళ్లు కార‌డం, క‌ళ్ల నొప్పులు, క‌ళ్లు మ‌స‌క‌గా క‌న‌బ‌డ‌డం వంటి కంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు రోజురోజుకు ఎక్కువవుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. పోష‌కాహార లోపం, టీవి, కంప్యూట‌ర్ వంటి వాటిని ఎక్కువ‌గా చూడ‌డం, కంటికి త‌గినంత విశ్రాంతి లేక‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ఈ స‌మ‌స్యలు త‌లెత్తుతాయి. ఇటువంటి కంటి స‌మ‌స్య‌ల‌న్నింటిని మ‌నం చ‌క్క‌టి చిట్కాతో త‌గ్గించుకోవ‌చ్చు. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. కంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. కంటి చూపును మెరుగుప‌రిచే ఆ చిట్కా ఏంటంటే..
White Pepper: క్యాన్సర్‏ను నయం చేసే తెల్ల మిరియాలు.. నల్ల మిరియాల కంటే  తెల్ల మిరియాలు ఆరోగ్యానికి ఎంత వరకు మేలు చేస్తాయంటే.. | White pepper  benefits and uses and ...
తెల్ల మిరియాల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. వీటిలో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. మ‌న కంటి ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఇవి ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. వాడాల్సిన ఇంకో పదార్థం..సోంపు గింజ‌లు. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, మెద‌డు శ‌క్తిని పెంచ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. సోంపు గింజ‌ల‌ను వాడ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. ర‌క్తం శుద్ది అవుతుంది. అలాగే మ‌నం ఉప‌యోగించాల్సిన మ‌రో ప‌దార్థం బాదంప‌ప్పు. మ‌న శ‌రీర ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా బాదంప‌ప్పు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. వీటిని ప్ర‌తిరోజూ నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ప్ర‌యోనాల‌ను పొంద‌వ‌చ్చు.మనకు కావాల్సిన మరో ఐటమ్ యాల‌కులు. కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో యాల‌కులు ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయి. మనం ఉప‌యోగించిన ఈ ప‌దార్థాల్లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఇవి మ‌న కంటి ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంతో పాటు మ‌న శ‌రీర ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇక ఫైనల్‌గా మనకు కావల్సింది.. ప‌టిక బెల్లం. దీనిలో మిన‌ర‌ల్స్, ఎమైనో యాసిడ్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి పొడికి చ‌క్క‌టి రుచిని ఇవ్వ‌డంతో పాటు మ‌న ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయి. 
ముందుగా ఒక జార్ లో 50 గ్రాముల సోంపు గింజ‌లు, 50 గ్రాముల బాదంప‌ప్పు, 10 గ్రాముల తెల్ల మిరియాలు, 10 గ్రాముల యాల‌కులు, 100 గ్రాముల ప‌టిక బెల్లం పొడి వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న పొడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న పొడిని ఒక గ్లాస్ పాల‌ల్లో ఒక టీ స్పూన్ మోతాదులో వేసి క‌ల‌పుకోని రాత్రి ప‌డుకోవ‌డానికి అర గంట ముందు తీసుకోవాలి. ఈ విధంగా ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా కంటి ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌చ్చు. కంటి స‌మ‌స్య‌ల‌న్నీ దూర‌మ‌వుతాయి. 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.