బరువు తగ్గాలంటే ఈ ఒక్కటి తింటే చాలు.. కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది!

ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్యల్లో దాదాపుగా అధిక బరువు ఒకటి. అందుకే  ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎటువంటి ఆహార పదార్థాలను తినాలి? తినే ఆహారం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.  

ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజూ నానబెట్టిన బాదం పప్పును  భాగం చేసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని  నిపుణులు చెబుతున్నారు. బాదం పప్పు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తగ్గుతుండట. దీంతో పాటు అనేక వ్యాధులను తగ్గిస్తుందట.  
బాదం పప్పులు ఫ్రీరాడికల్స్ ను తొలగించడంలో సహాయపడతాయట. మధుమేహ వ్యాధిగ్రస్తులు బాదం పప్పును తినడంతో రోజును ప్రారంభిస్తే వారి షుగర్ లెవల్స్  కూడా కంట్రోల్లో ఉంటాయట. బరువు కూడా తగ్గుతారట. అందుకే నానబెట్టిన బాదం తో మీ రోజును ప్రారంభించాలని వైద్యులు చెబుతున్నారు. ఈ పప్పులు మొత్తం జీర్ణక్రియను సులభతరం చేసి  శరీరంలో జీర్ణక్రియ సక్రమంగా సాగేలా చేస్తాయట.
బాదంపప్పును రోజు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.. మెదడుకు టానిక్ లాగా పనిచేస్తాయి. కేంద్ర నాడీ వ్యవస్థ సరిగా పని చేసేలాగా బాదంపప్పు చేస్తుందట.  జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందట. గుండె ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయట. బాదం పప్పులు అధిక రక్తపోటును కూడా నియంత్రిస్తుంది . మలబద్ధకాన్ని నివారిస్తుంది. చర్మ సంరక్షణకు, రోగనిరోధక వ్యవస్థను బలపరచడానికి బాదంపప్పులు బాగా ఉపయోగపడతాయి. అధికంగా నీరసం కాళ్లు చేతులు లాగటం వంటి సమస్యలతో బాధపడేవారు రోజు ఏదో ఒక సమయంలో బాదంపప్పును తీసుకోవడం వల్ల నీరసం అదుపులో ఉంటుంది శరీరం నూతన ఉత్తేజాన్ని పుంజుకుంటుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.