Ovarian Cysts : పొత్తికడుపులో నీటి బుడగలు ఎలా గుర్తించాలంటే..!

సాధారణంగా ప్రతి చిన్న విషయానికి చిరాకుగా అనిపించడం, హార్మోన్లు శరీరంలో గతి తప్పటానికి సంకేతం. అలాగే బరువు పెరుగుతున్న, చర్మం జిడ్డుగా అనిపిస్తున్న, పెళ్లయి కొన్ని సంవత్సరాలు అవుతున్న గర్భధారణ రావడం లేదంటే శరీరంలో ఏదో తేడా జరుగుతుందని గుర్తించాలి. అందులో ముఖ్యంగా Ovarian Cysts సమస్య వేధిస్తుందేమో చూడాలి.

Ovarian Cysts  :  పొత్తికడుపులో నీటి బుడగలు ఎలా గుర్తించాలంటే..!
ovarian cysts

గర్భధారనకి ఎన్నో ఆటంకాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా స్త్రీ జననేంద్రియాలు ఆరోగ్యంగా ఉండకపోవడం, హార్మోన్లు బ్యాలెన్స్ తప్పడం వంటి వాటి వల్ల గర్భధారణలో ఎన్నో ఆటంకాలు ఏర్పడతాయి..
సాధారణంగా ప్రతి చిన్న విషయానికి చిరాకుగా అనిపించడం, హార్మోన్లు శరీరంలో గతి తప్పటానికి సంకేతం. అలాగే బరువు పెరుగుతున్న, చర్మం జిడ్డుగా అనిపిస్తున్న, పెళ్లయి కొన్ని సంవత్సరాలు అవుతున్న గర్భధారణ రావడం లేదంటే శరీరంలో ఏదో తేడా జరుగుతుందని గుర్తించాలి. అందులో ముఖ్యంగా Ovarian Cysts సమస్య వేధిస్తుందేమో చూడాలి.

సాధారణంగా మహిళల్లో చాలా మంది పొత్తికడుపులో నీటి బుడగలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 35 శాతం మహిళలు ఈ కాలంలో ఈ సమస్యతో బాధపడుతున్నారని సమాచారం. గర్భధారణకు ఈ నీటి బుడగలు పెద్ద ఆటంకంగా మారుతున్నాయి. సాధారణంగా 12 ఏళ్ల వయసు నుంచి 45 ఏళ్ల మహిళల్లో పొత్తికడుపులో నీటి బుడగలు వచ్చే అవకాశం ఉంది. వీటిని ముందుగా గ్రహించాలి. నెలసరి సమయంలో ఏవైనా ఇబ్బందులు ఏర్పడటం, గర్భం ధరించకపోవడం వంటి వాటితో ఈ సంకేతాలు మొదలవుతాయి.
సాధారణంగా అండాశయంలో ఉండే స్త్రీ బీజ కోశాలు ప్రతినెల అండాన్ని విడుదల చేస్తాయి. వీటిలో బుడగలు ఏర్పడినప్పుడు ఋతుస్రావం సక్రమంగా జరగదు. శరీరంలో హార్మోన్లో గతితప్పడం వల్ల మానసికంగా అశాంతి ఏర్పడుతుంది. పిల్లలు లేకపోవడంతో మెదడుపై ఒత్తిడి పెరిగిపోతుంది. 
సాధారణంగా ఈ నీటి బుడగలను అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో గుర్తిస్తారు. ముఖ్యంగా ఈ బుడగలను ఎలా గుర్తించాలంటే బరువు పెరగటం, ఒంట్లో ఇన్సులిన్ స్థితి పెరగటం, చర్మం రంగు మారటం, సెక్స్ కోరికలు తక్కువగా ఉండటం, తలలో జుట్టు పల్చబడటం వంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా వైద్యుడ్ని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ బుడగలు ఎక్కువ అవుతున్న కొలది గర్భం ధరించే అవకాశాలు తగ్గిపోతాయి. అందుకే వీలైనంత తొందరగా ఈ విషయంలో జాగ్రత్త పడాలి..
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.