భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి ఇవే ముఖ్య కారణాలు..!

ఏ సంబంధం అయినా కలకలాం సాగాలంటే.. వారి మధ్య గొడవలు ఉండొద్దు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటే వారి బంధం ఎన్నో రోజులు నిలవదు. ముఖ్యంగా ఈరోజుల్లో చిన్న గొడవలకే డైవర్స్‌ వరకూ వెళ్లిపోతున్నారు. అసలు ఒక జంట మధ్య గొడవలు రావడానికి కొన్ని కామన్‌ రీజన్స్‌ ఉంటాయి. అవి ఏంటో తెలిస్తే.. మీరు ముందే జాగ్రత్తపడొచ్చు. 

భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి ఇవే ముఖ్య కారణాలు..!


ఏ సంబంధం అయినా కలకలాం సాగాలంటే.. వారి మధ్య గొడవలు ఉండొద్దు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటే వారి బంధం ఎన్నో రోజులు నిలవదు. ముఖ్యంగా ఈరోజుల్లో చిన్న గొడవలకే డైవర్స్‌ వరకూ వెళ్లిపోతున్నారు. అసలు ఒక జంట మధ్య గొడవలు రావడానికి కొన్ని కామన్‌ రీజన్స్‌ ఉంటాయి. అవి ఏంటో తెలిస్తే.. మీరు ముందే జాగ్రత్తపడొచ్చు. 
Bhopal man killed while resolving husband-wife fight over cooking chicken |  India News | Zee News
భిన్నాభిప్రాయాలు : జీవితంలోని ముఖ్యమైన సమస్యలపై భిన్నాభిప్రాయాలు సంబంధాలను క్లిష్టతరం చేస్తాయి. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఇద్దరి మధ్య చర్చ జరగాలి. లేకపోతే మీ సంబంధం క్రమంగా భరించలేనిదిగా మారుతుంది.
కోరికలను అణచివేయడం: ఒకరి కోసం మీ కోరికలను అణచివేయవలసిన అవసరం లేని విధంగా ఏదైనా బంధం ఉండాలి. మీరు మీ భాగస్వమికి భయపడి మీ మనసులోని కోరికలు అణిచివేసుకుంటే ఏదో ఒకరోజు పెద్ద సమస్యగా మారుతుంది. అలేగే మీరు మీ భాగస్వామి కోరికలు విలువ ఇవ్వాలి. అప్పుడే వారు ఫ్రీగా మీతో అన్నీ షేర్‌ చేసుకోగలుగుతారు. 
 
వెన్నుపోటు: మీ భాగస్వామి మీ గురించి ఇతరులతో చెడుగా మాట్లాడుతున్నారా? అలాంటి ప్రవర్తన సంబంధంలో సమస్యలను పెంచుతుంది. నమ్మకం ముఖ్యం. 
తప్పులను అంగీకరించలేకపోవడం: తప్పులు చేయడం చాలా సహజం. కానీ ఆ తప్పను అంగీకరించడం మాత్రం అసహజమే అని చెప్పాలి. కొద్ది మంది మాత్రమే తాము చేసిన తప్పులను అంగీకరిస్తారు. వివిధ కారణాల వల్ల సంబంధంలో తప్పులు జరగవచ్చు. అయితే ఆ తప్పును బాధ్యతగా అంగీకరించాలి. భాగస్వామికి తెలియజేయకుండా పదేపదే మీపై పెడితే, సంబంధం విషపూరితం అవుతుంది. 
 
లక్ష్యాలను త్యాగం చేయడం: చాలామంది తమ జీవిత భాగస్వామి కోసం తమ సొంత కోరికలు, లక్ష్యాలు, ఆశలను వదులుకోవాల్సి వస్తుంది. ఆ క్షణం బానే ఉంటుంది.. కానీ కొద్ది రోజుల తర్వాత మీ లైఫ్‌ మీకు నచ్చక.. నీ వల్లే నేను నా గోల్‌ను పక్కనపెట్టాను అనే భావన కలుగుతుంది. దీనివల్ల బంధాలు తెగిపోయే ప్రమాదం ఉంది. జీవితంలో మీకు ముఖ్యమైన అన్నింటిని త్యజించడం సంబంధంలో అసంతృప్తికి దారి తీస్తుంది.
ఏ బంధంలో అయినా గొడవలు రావొద్దంటే.. మీ కంటూ కాస్త ప్రైవేట్‌ స్పేస్‌ మీరు తీసుకోవాలి, అదే స్పేస్‌ మీ భాగస్వామికి కూడా ఇవ్వాలి. ఎంత ఎక్కువ ఎక్స్‌పెట్‌ చేస్తే అంత ఎక్కువగా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మీ ఎక్స్పెటేషన్స్‌ను కాస్త తగ్గించుకోని చూడండి.!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.