కీరదోస, అల్లం చేసే అద్భుతం.. బరువు తగ్గడం గ్యారెంటీ..!

బరువు పెరగడం ఒక సమస్య అయితే.. ఇక తగ్గుదాం అని మెంటల్‌గా ఫిక్స్‌ అయ్యాక.. చేసే ప్రయత్నాలు ఇంకా పెద్ద సమస్య.. ఎలా అంటారా..? మీరు తగ్గుదాం అని జిమ్‌ జాయిన్‌ అవ్వడమో లేక డైటింగ్‌ లాంటివి స్టాట్‌ చేస్తారు. కానీ అవి అన్నీ ఇంతకు ముందు మీరు చేసినవి కాదు. కొత్తగా ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుంది.

కీరదోస, అల్లం చేసే అద్భుతం.. బరువు తగ్గడం గ్యారెంటీ..!


బరువు పెరగడం ఒక సమస్య అయితే.. ఇక తగ్గుదాం అని మెంటల్‌గా ఫిక్స్‌ అయ్యాక.. చేసే ప్రయత్నాలు ఇంకా పెద్ద సమస్య.. ఎలా అంటారా..? మీరు తగ్గుదాం అని జిమ్‌ జాయిన్‌ అవ్వడమో లేక డైటింగ్‌ లాంటివి స్టాట్‌ చేస్తారు. కానీ అవి అన్నీ ఇంతకు ముందు మీరు చేసినవి కాదు. కొత్తగా ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుంది. పైగా రిజల్ట్‌ రెండు మూడు రోజులకు కనిపించదు.. నెల రోజులు కంటిన్యూగా చేస్తే కానీ కాస్త రిజల్ట్‌ ఉంటుంది.అప్పటి వరకూ మీకు ఓపిక ఉండదు. బిర్యానీ మీద మనసు లాగేస్తుంది, పొద్దున్నే లేవాలంటే కాళ్లు లాగేస్తాయి.. కష్టపడకుండా బరువు ఎలారా తగ్గడం అని అప్పుడు అనుకుంటారు.. కేవ‌లం రెండు ప‌దార్థాల‌ను ఉప‌యోగించి చాలా సుల‌భంగా బ‌రువు తగ్గ‌వ‌చ్చు. వీటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు. అలాగే వీటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌డంతో పాటు మ‌నం అనేక ఇత‌ర ప్ర‌యోజ‌నాల‌ను కూడా సొంతం చేసుకోవ‌చ్చు. బ‌రువు త‌గ్గించే ఆ రెండు ప‌దార్థాలు ఏమిటి.. వీటిని ఎలా ఉప‌యోగించాలి…అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. 
Carrot-Cucumber-Ginger Juice | Nourishing Meals®
బ‌రువు త‌గ్గించ‌డంలో కీర‌దోస, అల్లం మ‌న‌కు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయి. అల్లం కీర‌దోస మ‌న‌కు సుల‌భంగా ల‌భించేవే. అలాగే ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అల్లంలో ఎన్నో పోష‌కాలు, ఔష‌ధ గుణాలు ఉంటాయి. అల్లాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు సుల‌భంగా త‌గ్గుతుంది. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. త‌ల తిర‌గ‌డం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలో నొప్పులు తగ్గుతాయి. అలాగే కీర‌దోస కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల ఎక్కువ సేపు ఆక‌లి కాకుండా ఉంటుంది. అలాగే దీనిలో క్యాల‌రీలు కూడా చాలా త‌క్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, ఒత్తిడిని త‌గ్గించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా కీర‌దోస కూడా మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. అల్లం, కీర‌దోస‌తో మ‌నం జ్యూస్ ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. 
ముందుగా కీర‌దోస‌పై ఉండే చెక్కును తీసేసి ముక్క‌లుగా చేసుకుని జార్‌లో వేసుకోవాలి. త‌రువాత ఒకటిన్న‌ర ఇంచుల అల్లం ముక్క‌ను తీసుకుని శుభ్రం చేసి ముక్కుల‌గా చేసుకుని జార్‌లో వేసుకోవాలి. త‌రువాత ఇందులో అర గ్లాస్ నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. దీనిని వ‌డ‌క‌ట్టుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. రుచి కోసం ఇందులో నిమ్మ‌ర‌సం కూడా వేసుకోవ‌చ్చు. ఇలా త‌యారు చేసుకున్న జ్యాస్‌ను రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగాలి. ప‌ర‌గ‌డుపున కుద‌ర‌ని వారు అల్పాహారానికి అర గంట ముందు అయినా దీనిని తీసుకోవాలి. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా ఈ జ్యూస్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అలాగే ఈ జ్యూస్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. శ‌రీరం డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.