ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం ఎంత ముఖ్యమో....వ్యాయామం కూడా అంతే ముఖ్యం.

 వ్యాయామాలు అంటే అన్నీ చేసేయక్కర్లే. ముఖ్యంగా నడక అనేది....శరీరానికి చాలా మంచిది. వాకింగ్ శరీరానికే కాకుండా మానసిక ప్రశాంతత కూడా ఉపయోగపడుతుంది. అన్నింటిలోనూ చాలా తేలికైంది, ఖ‌ర్చు అవ‌స‌రం లేనిది వాకింగ్‌.

ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం ఎంత ముఖ్యమో....వ్యాయామం కూడా అంతే ముఖ్యం.


 వ్యాయామాలు అంటే అన్నీ చేసేయక్కర్లే. ముఖ్యంగా నడక అనేది....శరీరానికి చాలా మంచిది. వాకింగ్ శరీరానికే కాకుండా మానసిక ప్రశాంతత కూడా ఉపయోగపడుతుంది. అన్నింటిలోనూ చాలా తేలికైంది, ఖ‌ర్చు అవ‌స‌రం లేనిది వాకింగ్‌....రోజూ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. అయితే వాకింగ్ కూడా ఎలాపడితే అలా చేయకూడదు. దానికి కొన్ని కూడా పరిధులు ఉంటాయి.

Health Benefits: Weekend Warrior vs Daily Exercise

కొందరికి వాకింగ్ విషయాల్లో చాలా సందేహలు ఉంటాయి. ఎప్పుడు నడవాలి.. ఎలా నడవాలి..అనేవి తెలుసుకోవాలి. అన్నింటికన్నా సాధారణంగా మార్నింగ్ వాకింగ్ మంచిది. ఎందుకంటే..ఉదయం కాలుష్యం తక్కువగా ఉంటుంది. ఉదయం ఉండే కాలుష్య రహిత గాలి వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి.

వాకింగ్ చేసే వారు రోజుకు క‌నీసం గంట అయినా వాకింగ్ చేసేలా ప్రణాళిక వేసుకోవాలి. దానివల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందవచ్చు. అయితే గంట సేపు వాకింగ్ ఒకేసారి చేయ‌లేక‌పోతే ఉద‌యం, సాయంత్రం 30 నిమిషాల చొప్పున విభజించుకోవాలి. ఇలా వాకింగ్‌ను సుల‌భంగా పూర్తి చేయ‌వ‌చ్చు. వాకింగ్‌ను ప్రారంభించేట‌ప్పుడు నెమ్మ‌దిగా న‌డ‌వాలి. క్రమంగా వేగం పెంచుకోవాలి.

మధుమేహం ఉన్నవారు తప్పకుండా ఏదైనా కాస్త తిన్నాకే వాకింగ్ చేయడం మంచిది. దానివల్ల రక్తంలో గ్లూకోజు మోతాదులు పడిపోతాయనే ఆందోళన ఉండదు. మిగిలిన వారు మామూలుగా పరగడుపున కూడా నడవచ్చు. కడుపు నిండా తిని స్పీడుగా నడిస్తే గుండె మీద ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. అది చాలా డేంజర్.

వాకింగ్ కోసం సౌక‌ర్యవంతంగా ఉండే షూస్ ధ‌రించాలి. దీంతో ఎక్కువ సేపు వాకింగ్ చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. నడుస్తున్నప్పుడు చేతులను వదులుగా చేసి ముందుకు, వెనుకకు ఆడించాలి. దీంతో శ‌రీరం రిలాక్స్ అవుతుంది. ఎక్కువ వ్యాయామం జ‌రుగుతుంది. నడక ప్రారంభించడానికి ముందు నీరు తాగాలి. దీని వ‌ల్ల డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. ఎక్కువ సేపు ఆయాసం రాకుండా వాకింగ్ చేయ‌వ‌చ్చు. గుండె నొప్పిగా అనిపించినప్పుడు.....వాకింగ్‌ ఆపేయాలి. ఏం కాదులే అని నిర్లక్ష్యం చేయకూడదు.

రోజుకు 10 వేల అడుగులు నడవాలని కొందరు లక్ష్యంగా పెట్టుకుంటారు. అయితే ఎక్కడ నడిచామన్నది కాదు. ఆరుబయటే నడవాలని లేదు. ఇంట్లోనూ నడవొచ్చు. సాయంత్రం పూట కూడా వాకింగ్ చేయవచ్చు. వాకింగ్ చేస్తే గుండె కొట్టుకునే వేగం పెర‌గాలి. చెమ‌ట ప‌ట్టేలాగా చేయాలి. ఇలా వాకింగ్ చేస్తే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.