మగవారికి విటమిన్ Q10 ఏంతో అవసరం .. లోపిస్తే వీర్య క‌ణాల కౌంట్, క్వాలిటీ రెండు పడిపోతాయ్.!

ఈమధ్య కాలంలో మగవారిలో వీర్యకణాలు తక్కువగా ఉంటున్నాయి.  100లో 25-30 మందికి ఒటిలిటీ సరిగ్గా ఉండటంలేదు. ఇంకా 20%మందికి స్పామ్ క్వాలిటీ సరిగ్గా ఉండటంలేదని Coenzyme Q10

మగవారికి విటమిన్ Q10 ఏంతో అవసరం .. లోపిస్తే వీర్య క‌ణాల కౌంట్, క్వాలిటీ రెండు పడిపోతాయ్.!


ఈమధ్య కాలంలో మగవారిలో వీర్యకణాలు తక్కువగా ఉంటున్నాయి.  100లో 25-30 మందికి ఒటిలిటీ సరిగ్గా ఉండటంలేదు. ఇంకా 20%మందికి స్పామ్ క్వాలిటీ సరిగ్గా ఉండటంలేదని పరిశోధనల్లో తేలింది. చాలామందికి ఈ కారణాల వల్ల ప్రగ్నెస్సీ రావడానికి ఆటంకం కలుగుతుంది. ఒబిసిటీ, ఫాస్ట్ ఫుడ్స్ ని ఎక్కువగా తినటం ముఖ్యం కారణంగా చెప్పవచ్చు. ఇలా ఒటిలిటీ తక్కువగా ఉన్నవారికి స్పామ్ క్వాలిటీ సరిగ్గా లేనివారికి..దాని ప్రొడెక్షన్ ను నాచురలగా హెల్తీగా జరిగేట్లు చేయడానికి ఉపయోగపడే ఒక విటమిన్ ఉంది. విటమిన్ Q10 Coenzyme Q10 ..దీని గురించి ప్రత్యేకంగా ఈరోజు తెలుసుకుందాం.

వీర్యకణాల లోపల విటమిన్ Q10ను ఉత్పత్తిచేసేది మైటోకాండ్రియన్ సెల్స్.ఇవి ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. రిలీజ్ అయ్యే ఎనర్జీ నుంచే మూమెంట్స్ బాగుంటాయి. యోనిమార్గం లోపలికి వెళ్లిన వీర్యకణాలు బాగా ఈదుకుని స్పీడ్ గా గర్భాశయంలోకి వెళ్లాలన్నా, గర్భాశయ గోడల దాడిని తట్టుకుని దూసుకువెళ్లాలి అంటే విటమిన్ Q10 అనేది చాలా అవసరం. వీర్యకణాలలో ఉండే.. మైటోకాండ్రియన్ పొరలల్లో ఈ విటమిన్ తయారవుతుంది. ఎప్పుడైతో ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తింటారో వీటి ద్వారా హానికలిగించే ఫ్రీరాడికల్స్ లోపలికి వెళ్లి ఈ వీర్యకణాలల్లో ఉండే మైటోకాండ్రియన్ పొరల్లో రిలీజ్ అయ్యే విటమిన్ Q10 ప్రొడెక్షన్ ను దాడిచేసి, ఆ పొరలను డామేజ్ చేసి, ఈ విటమిన్ తయారవకుండా ఆటంకం కలిగిస్తుందని సైంటిఫిక్ గా నిరూపించబడింది.

ఎవరి వీర్యకణాల్లో అయితే విటమిన్ Q10 ప్రొడెక్షన్ సరిగ్గా లేదో.. ఎగ్ యొక్క క్యాలిటీ తగ్గిపోతుంది. ఎగ్ లైఫ్ తగ్గిపోతుంది. తద్వారా ఒటిలిటీలో మార్పులు రావడం, వీర్యకణాల ప్రొడెక్షన్ కూడా తగ్గిపోతుంది. సంతానం కలగడానికి వీళ్లకు ఎక్కువగా ఆటంకం కలుగుతుంది. ఈ విటమిన్ Q10 అనేది స్పామ్ యొక్క స్ట్రక్చర్ ను కరెక్టుగా ఉంచడానికి, స్పామ్ కు ఒటిలిటీ పెరగడానికి బాగా ఉపయోగుతుంది. ఈ విటమిన్ ను డైరెక్టుగా బయటనుంచి అందించలేం. దీన్ని కోఎంజైమ్ Q10 అని కూడా పిలుస్తారు. శరీరంలో ఉండే ప్రతికణం లోపల మైటోకాండ్రియన్ ఉంటాయి. ఈ మైటోకాండ్రియన్ లో హీట్ ను ప్రొడ్యూస్ చేస్తాయి. మన ఆహార పదార్థాలు అక్కడ ఫైర్ అయ్ హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి. 

ప్రతికణం లోపల ఈ మైటోకాండియన్ పొరల్లో Q10 తయారవుతుంది. ఈ Q10ప్రొడెక్షన్ కు ఆటంకం కలిగించేది..కణాల్లో విడుదలయ్యే ఫ్రీరాడికల్స్, నూనె పదార్థాలు తిన్నప్పుడు. చాలామందికి వీర్యకణాలు యోనిమార్గంలో వదలబడిన తర్వాతా..అక్కడనుంచి తలాతోక కరెక్టు షేప్ లో లేనప్పుడు గర్భాశయంలోకి దూసుకుంటూ వెళ్లలేవు. వెళ్లినా..రక్షణసంబంధించిన కణజాలం..స్త్రీల యూట్రస్ లో ఉండే రక్షణవ్యవస్థ ఈ వీర్యకణాలమీద దాడిచేయటం జరుగుతుంది. కొన్ని కోట్ల వీర్యకణాలు ఈ దాడికి చచ్చిపోతాయి. ఏవైతో హెల్తీగా ఉండి..మాంచి ఎనర్జిటిక్ ఉండి..ఈ దాడిని తట్టుకుంటాయో..ఫోర్స్ గా ఈదుకుంటూ..ఎగ్ లోపలికి వెళ్తాయి. అప్పుడే ప్రగెన్సీ వస్తుంది. అలాంటి సామార్థ్యం వీర్యకణాల్లో ఉండాలంటే..ఒటిలిటీ సరిగ్గా ఉండాలి. ఒటిలిటీ అంటే..బాగా పిక్కబలం, మంచి ఆక్సిజన్ లెవల్ ఉండాలి.

అలాంటి ముఖ్యమైన Q10ను ఉత్పత్తికి ఆటంకం కలిగించే ఫాస్ట్ ఫుడ్స్ ను ఇక నుంచి అయినా తినటం తగ్గించి..మంచి ఆహారం అంటే..బాగా స్ప్రౌట్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్టూట్స్ ఎక్కువగా తీసుకోండి. ఇలాంటివి అన్నీ మనం ఎక్కువుగా తింటే..Q10 ప్రొడెక్షన్ రెండునెలల్లోనే ఆటోమెటిగా ఇన్ క్రీస్ అవుతుంది. ఈ డైమేజ్ ను కంట్రోల్ చేయగలితే చాలు..ప్రత్యేకంగా మెడిసన్ అంటూ ఏం అక్కర్లేదంటున్నారు ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు.

కొన్ని ఆహారాల్లో విటమిన్ Q10 ఎక్కువగా అందించే ఆహారాలు తెలుసుకుందాం.

coenzyme q10 rich foods

ఎవరికైతే ఈ విటమిన్ లోపం ఉంటుందో వాళ్లు వీటిపై ప్రత్యేకదృష్టి పెట్టాలి. అందులో మొదటిది..

  1. ఆరెంజ్ లో 100గ్రాముల్లో.. 1మిల్లీగ్రామ్ Q10ఉంది. 
  2. సోయాబీన్ లో 1.2 మిల్లీగ్రామ్ ఉంటుంది.
  3. బాదంపప్పులో 1.4మిల్లిగ్రామ్ ఉంది.
  4. నువ్వుల్లో 1.7 మిల్లీగ్రామ్ ఉంది.
  5.  వాల్ నట్స్ లో 1.9మిల్లీగ్రామ్స్
  6. పిస్తాపప్పుల్లో 2మిల్లీగ్రామ్స్ ఉంది.
  7. వీటన్నింటికంటే ఎక్కువగా వేరుశనగప్పుప్పులో2.6 మిల్లీగ్రామ్స్ ఉంది. 

సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే..ఉదయం సాయంత్రం ఉడికినవి మానేసి..నాచురల్ డైట్ ఫాలో అయితే మరీ మంచిది. రెండు నెలల్లోనే వీర్యకణాలు నార్మల్ అయిపోతాయి.  

ఉదయం పూట కాఫీ, టీలు కంప్లీట్ గా మానేసి వాటి స్థానంలో వెజిటబుల్ జ్యూస్ ఒక గ్లాస్ తీసుకోండి. జ్యూస్ తాగిన గంట తర్వాతా రెండుమూడు రకాల మొలకెత్తిన విత్తనాలు తినండి. ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది. పోషకాలన్నీ బాగా ఉంటాయి. ఇది మంచి బ్రేక్ ఫాస్ట్ అవుతుంది.

సాయంత్రం 5.30కి ఒక గ్లాస్ జ్యూస్..6.30 కల్లా నానపెట్టిన డ్రై ఫ్రూట్స్..పుచ్చగింజలు, గుమ్మడిగింజలు, పొద్దుతిరుగుడు గింజలు ఏమైనా సరే 3-4 రకాలు తినాలి. ఎండుకర్జారాలతో వీటిని తినేసేయండి.

మార్నింగ్, ఈవినింగ్ ఇలా నాచురల్ ఫుడ్ తింటే..జీవం ఉన్న కణాలు..ఫార్మాడ్ ఒటిలిటీ ఉన్న కణజాలం మంచిగా వస్తుంది. కౌంట్ 60మిలియన్ దాటిపోతుంది. 

ప్రగెన్సీ రావడానికి ఇది మంచిడైట్..మగవారి వీర్యకణ వృద్ధికి, స్పామ్ క్వాలిటీకూడా పెరుగుతుంది. 

అంటే ఈ డైట్ ఫాలో అవుతున్నప్పుడు.. మద్యాహ్నం ఉడికిన ఆహారం ఒక్కసారి తినాలి. హార్మోన్స్ అన్ని బాగా ఉత్పిత్తి అవ్వాలంటే..మంచి ఆహారం తినాలి.. ఇప్పటివరకూ ఫాస్ట్ ఫుడ్స్ అని జంక్ ఫుడ్స్ అని ఏవేవో తినేసి ఆరోగ్యాన్ని పాడుచేసుకుని ఉంటారు. ఇకనుంచి అయినా సమస్య ఉన్నవారు ఈ డైట్ ఫాలో అయితే, ఒక్క మెడిసిన్ తో పనిలేకుండా నెల నుంచి రెండు నెలల్లో సింపుల్ గా కౌంట్ పెరుగుతుంది.

వీర్యకణం వృద్ధి కావాలంటే.. సిలినియమ్ కూడా చాలా అవసరం. ఇది శరీరానికి 55 మైక్రోగ్రామ్స్ కావాలి. ఇదిగనక అందలేదంటే..కొన్ని ఇబ్బందులు వస్తాయి.ఎగ్స్ బాగా రిలీజ్ కావడానికి, మగవారికి వీర్యకణాలు ఉత్పత్తి కావకడానికి సీలినియమ్ కావాలి, డీఎన్ ఏ తయారవడానికి ఇది చాలా అవసరం. సంతానం కలగడం లేదంటే..ఇది కూడా ఒక లోపం కావొచ్చు. ఇరిటేషన్స్, నీరసం, మగతగా ఉండటం, హెయిర్ లాస్ అవడం ఇవన్నీ సిలీనియమ్ లోపించనప్పుడు వచ్చే లక్షణాలు. 

సిలినియమ్ కావాలంటే బ్రెజిల్ నట్ తినాల్సిందే. ఇందులో 1917 మైక్రో గ్రామ్స్ సిలీనియమ్ అందుతుంది.
బ్రౌన్‌ రైస్ లో 19మైక్రో గ్రామ్స్ సిలీనియమ్ ఉంది. 
పెరుగులో 8 మైక్రోగ్రామ్స్, పొద్దుతిరుగుడు పప్పులో 80మైక్రోగ్రామ్స్, .వీటన్నింటికి కంటే బ్రెజిల్ నట్ లో ఎక్కువగా ఉంది.

గర్భవతులకు ఇది చాలా అవసరం. డీఎన్ ఏ బాగా తయారవుతుంది. అయితే ఇది కాస్ట్లీ. డబ్బులకు ఇబ్బందిలేనివారు కొనుక్కోవచ్చు. కేజీ 3000 వరకూ ఉంటుంది. రోజుకు రెండు మూడు నట్స్ తీసుకుంటే చాలు.. తినేముందు కాస్త వేడిచేసుకుని తినొచ్చు. నానపెట్టుకుని కూడా తినొచ్చు. పొడిచేసుకుని సలాడ్స్ లోనూ కలుపుకోవచ్చు.

పైన అందించిన సమాచారం అంతా నిపుణులైన ప్రకృతి వైద్యులు అందించిన దాని ప్రకారమే మీకు ఇవ్వటం జరిగిందని గమనించగలరు.

-Triveni Buskawothu

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.