Black Lentils : నల్ల మినుములతో ఎన్ని ఉపయోగాలో.. ముఖ్యంగా పురుషులతో అదిరిపోయే బెనిఫిట్స్‌

ఎవరు మినపప్పు తీసుకోని వాటిని నానపెట్టి ఆ పొట్టు పోయే వరకూ కడిగి గ్రైండ్‌ చేస్తున్నారు చెప్పండి.. ఇదంతా టైమ్‌ పడుతుంది. కానీ మినపగుళ్లు కంటే..మినపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. Black Lentils  వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే మీరు షాక్‌ అవుతారు..

Black Lentils : నల్ల మినుములతో ఎన్ని ఉపయోగాలో.. ముఖ్యంగా పురుషులతో అదిరిపోయే బెనిఫిట్స్‌
Black gram


Black Gram : ఇప్పుడు ఇడ్లీ, దోశలు వేసుకోవడానికి అందరూ పాలిష్‌ చేసిన మినపప్పునే వాడుతున్నారు. ఎవరు మినపప్పు తీసుకోని వాటిని నానపెట్టి ఆ పొట్టు పోయే వరకూ కడిగి గ్రైండ్‌ చేస్తున్నారు చెప్పండి.. ఇదంతా టైమ్‌ పడుతుంది. కానీ మినపగుళ్లు కంటే..మినపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. Black Gram  వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే మీరు షాక్‌ అవుతారు..? 

నల్ల మినుములతో ఉపయోగాలు..

  • మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గి సుఖ విరేచ‌నం అయ్యేలా చేయ‌డంలో, పురుషుల‌ల్లో వీర్య‌వృద్ధిని క‌లిగించ‌డంలో ఇవి ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి.
  • మినుములు ఆల‌స్యంగా జీర్ణ‌మ‌వుతాయి. వీటిని నెయ్యి, కండ‌చ‌క్కెర , జీల‌క‌ర్ర, అల్లం వంటి వాటితో క‌లిపి తీసుకోవడం వ‌ల్ల ఎటువంటి స‌మ‌స్యా ఉండ‌దు.
  •  మిన‌ప పిండితో ఇడ్లీల‌ను వండుకుని వాటిలో స‌మృద్ధిగా నెయ్యిని, కండ చ‌క్కెర‌ను కానీ అల్లం వెల్లుల్లితో చేసిన కారాన్ని కానీ క‌లుపుకుని 40 రోజుల పాటు తిన‌డం వ‌ల్ల న‌పుంస‌క‌త్వ త‌గ్గుతుంది.
  • మినుముల‌ను దంచి జ‌ల్లించి ఆ పొడికి నెయ్యిని, చ‌క్కెర‌ను క‌లిపి సున్నుండ‌లుగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ ల‌డ్డూల‌ను తిన‌డం వ‌ల్ల మేహ‌వాత రోగాలు త‌గ్గి శ‌రీరానికి బ‌లం చేకూరుతుంది. ఈ సున్నుండ‌ల‌ను తిన‌డం వల్ల పురుషుల‌ల్లో వీర్య వృద్ధి క‌లుగుతుంది.
  • న‌ల్ల మినుముల‌ను నీటిలో నాన‌బెట్టి మెత్త‌గా నూరి లేప‌నంగా రాస్తూ ఉండ‌డం వ‌ల్ల బొల్లి మ‌చ్చ‌లు తగ్గుతాయి.
  • మినుముల‌ను దంచి నిప్పుల‌పై వేసి ఆ పొగ‌ను పీల్చ‌డం వ‌ల్ల అప్ప‌టిక‌ప్పుడు వెక్కిళ్లు త‌గ్గుతాయి.
  • మిన‌ప రొట్టెను త‌ల‌పై ఉంచి క‌ట్టుగా క‌ట్టి 2 గంట‌ల పాటు ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల వాత దోషం వ‌ల్ల క‌లిగిన త‌ల‌నొప్పి త‌గ్గుతుంది.
  • మినుముల‌ను, మెంతుల‌ను, ఉసిరి కాయ‌ల‌ను స‌మ‌పాళ్ల‌లో తీసుకుని మంచి నీటితో మెత్త‌గా నూరి ఆ ముద్ద‌ను వెంట్రుక‌లకు ప‌ట్టించి బాగా ఆరిన త‌రువాత స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల చుండ్రు స‌మ‌స్య త‌గ్గి జుట్టు కుదుళ్లు గట్టి ప‌డి జుట్టు బ‌లంగా పెరుగుతుంది. కేవ‌లం మినుముల‌ను మెత్త‌గా నూరి త‌ల‌కు పట్టించినా కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
  • మినుముల‌ను, ఆవాల‌ను, చెంగ‌ల్వ కోష్టు, సైంధ‌వ ల‌వ‌ణాన్ని స‌మ‌పాళ్ల‌లో తీసుకుని మేక మూత్రంతో క‌లిపి మెత్త‌గా నూరాలి.వ‌స్త్రంలో వేసి వ‌డ‌క‌ట్టి ఆ ర‌సాన్ని రెండు చుక్క‌ల మోతాదులో ముక్కు రంధ్రాల్లో వేసి లోప‌లికి పీల్చాలి. ఇలా చేయ‌డం వల్ల తంత్ర‌ రోగం త‌గ్గుతుంది.
  • మినుములు, గోధుములు, పిప్ప‌ళ్లు, అవిసె గింజ‌ల‌ను స‌మ‌పాళ్ల‌లో తీసుకుని పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని త‌గిన మోతాదులో తీసుకుని నెయ్యిని క‌లిపి ఒంటికి ప‌ట్టించి ఒక గంట త‌రువాత స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం మృదువుగా కాంతివంతంగా మారుతుంది. 

చాలా కాలం నుండి పీరియడ్స్‌ ఆగిపోయిన స్త్రీలు ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా మినుముల‌ను, పెరుగును, గంజిని, నువ్వుల‌ను, చేప‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఆగిన పీరియడ్స్‌ మ‌ర‌లా మొద‌ల‌వుతుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.