డయాబెటిస్ పేషెంట్లు బెల్లం తినకూడదా.. !

మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అతిగా ఆహారం తీసుకోకూడదు సరి కదా స్వీట్లు ముట్టుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలో

డయాబెటిస్ పేషెంట్లు బెల్లం తినకూడదా.. !


మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అతిగా ఆహారం తీసుకోకూడదు సరి కదా స్వీట్లు ముట్టుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలో పెరిగే అవకాశం ఉంటుంది.. అయితే ఎంతగా తినకూడదు అన్నప్పటికీ అదుపులో ఉండలేక ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు ఇదే సమయంలో పంచదారకు బదులు బెల్లం తీసుకుంటే ఎలాంటి సమస్యలు రావు అనే ఆలోచనతో బెల్లంతో చేసిన స్వీట్లు తినటానికి ముగ్గు చూపుతారు అయితే ఇది కూడా సరైన పద్ధతి కాదు అంటూ హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.. 

డయాబెటిస్ పేషెంట్లు బెల్లంతో చేసిన స్వీట్లు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని చెబుతున్నారు నిపుణులు ఇది కూడా వారి ఆరోగ్యానికి హాని చేస్తుందని బెల్లం షుగర్ లెవెల్ పెంచదని అనుకోవటం అపోహని చెబుతున్నారు.. ఈ వ్యాధి ఉన్నవారు స్వీట్లకు దూరంగా ఉండటమే కాకుండా ప్రత్యామ్నాయలకు సైతం దూరంగా ఉండాలని చెబుతున్నారు అలాగే చక్ర బెల్లం రెండింటికి పెద్ద తేడా లేదని వీటి మధ్య చాలా తక్కువ తేడా ఉండటం వల్ల తీసుకోవడం వల్ల సమస్యలు తలెత్తుతాయని తెలుస్తోంది.. అల్లం లో సుక్రోజ్ ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో పెరిగే అవకాశం ఉందని అందుకే బెల్లం కూడా చక్కెర లాగా ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు.. బెల్లంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది చక్కర వ్యాధిగ్రస్తులు దీన్ని తీసుకోవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తారు అందుకే చాలావరకు బెల్లాన్ని తీసుకోకుండా ఉండటమే మంచిది.. 

డయబెటిస్ ఉన్నవారు బెల్లం తింటే ఏమి అవుతుంది...? - Chai Pakodi

అయితే బెల్లం లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయన్న విషయం తెలిసిందే.. ఇందులో ముఖ్యంగా ఐరన్ ఎక్కువగా ఉంటుంది.. అందుకే మధుమేహం లేని వారు చక్కర స్థానంలో బెల్లాన్ని తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా బెల్లంతో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన ఇనుము అందటమే కాకుండా ఎముకలు సైతం గట్టి పడతాయి. అలాగే ఐరన్ తక్కువ అయితే పలు రకాల సమస్యలు తలెత్తుతాయి. నీరసంగా ఉండటం, ఏ పని మీద ఏకాగ్రత కుదరకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఆడవారికి సైతం ఐరన్ ఎంతో అవసరం. అందుకే ఈ వ్యాధి ఉన్న వారు ఎలాంటి అభ్యంతరం లేకుండా బెల్లాన్ని తీసుకోవచ్చు. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులు మాత్రం కచ్చితంగా దూరంగా ఉండాల్సిందే..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.