Diabetes : ధైర్యం ఉంటే.. డయాబెటీస్ కి డైవర్స్ ఇచ్చేయొచ్చు... ఈ డైట్ ప్లాన్ తో..!!

Diabetes : ధైర్యం ఉంటే.. డయాబెటీస్ కి డైవర్స్ ఇచ్చేయొచ్చు... ఈ డైట్ ప్లాన్ తో..!!


షుగర్ వ్యాధితో బాధపడేవారికి ఎంత తిన్నప్పటికీ బలం రాదు. శక్తి వచ్చినట్లు అనిపించదు. ఎప్పుడు నీరసంగా, శక్తిహీనంగా ఉంటారు. తీసుకున్న ఆహారం అంతా పొట్టలో అరుగుతుంది. చెక్కరగా మారుతుంది. ఆ చెక్కర రక్తంలోకి వెళ్తుంది. రక్తంలో చెక్కర ఉన్నంత మాత్రానా శక్తి విడుదల కాదు. రక్తంలో చెక్కర కణాల లోపలికి వెళ్లి మండాలి. అప్పుడే శక్తి విడుదలవుతుంది. అలా అని ఎక్కువ తింటే..బలం రావాలని షుగ‌ర్‌ పెరిగిపోతుంది. తక్కువ తింటే షుగ‌ర్‌ లెవల్స్ పడిపోయి నీరసం వస్తుంది. ఇలాంటి వారికి నీరసం తగ్గాలి, షుగ‌ర్‌ పెరగకూడదు. షుగ‌ర్‌ పేషెంట్స్ ఎక్కువగా చూస్తే బరువు తగ్గిపోతూ..బలహీనంగా కనపడతారు. కండపుష్టి కూడా బాగా తగ్గిపోతుంది. ఇలాంటి వారికి..షుగ‌ర్‌ పెరగకుండా..బలాన్ని, కండపుష్టిని, ఎక్కువ శక్తిని చక్కగా ఇచ్చే ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.

ప్రకృతి సిద్ధమైన పోషకాలు రెండు ఉన్నాయి. అవేంటంటే.. మాంసకృతులు, కొవ్వు పదార్థాలు. ఇవి త్వరగా రక్తంలోకి చేరవు, త్వరగా రక్తంలో చెక్కరను పెంచవు. ఎందుకుఅంటే.. ఇవి పొట్టప్రేగుల్లో పొట్టప్రేగుల్లో మెల్లగా అరుగుతాయి. స్లోగా అరిగి స్లోగా రక్తంలోకి వెళ్లేట్లు చేస్తాయి. పిండిపదార్థాలు ఉన్న ఆహారం త్వరగా అరిగిపోయి..త్వరగా రక్తంలోకి చేరిపోతాయి. తద్వారా రక్తంలోకి చెక్కర చేరుతుంది. కాబట్టి కార్పోహైడ్రేట్స్ ను తగ్గించేయాలి లేదా మానేస్తే మరీ మంచిది. ప్రొటీన్ ఫుడ్ ని ఫ్యాక్ట్ ఫుడ్ ని బాగా తీసుకోవాలి. అప్పుడు ఘుగర్ పెరగదు, కండపుష్టి బాగుంటుంది. ఎక్కువ సేపు శక్తిని ఇవ్వడానికి కొవ్వులు ఉపయోగపడతాయి. 

1 గ్రాము కొవ్వుపదార్థాలు 9 కాలరీల శక్తిని ఇస్తాయి. అదే ఒక గ్రాము మాంసకృతులు నాలుగు కాలరీల శక్తిని ఇస్తాయి. పిండిపదార్థాలు ఎక్కువగా ఉన్న ధాన్యాలు, రవ్వలు, పిండ్లు ఇవి తింటారు. వీటి వాడకం తగ్గించండి. వీటిలో మాంసకృతులు తక్కువ, కొవ్వులు తక్కువ. విత్తనాల వాడకం పెంచండి. ధాన్యాలకి, విత్తనాలకి తేడా ఉంది..నూనె వచ్చేవాటిని విత్తనాలు అంటారు. నూనెరాకుండా పిండిపదార్థాలు ఎక్కువగా ఉండేవాటిని ధాన్యాలు అంటారు. విత్తన కోవకు వచ్చేవి అన్ని షుగ‌ర్‌ పేషెంట్స్ కి బాగా మేలు చేస్తాయి. విత్తన కోవకు చెందినవి అంటే..నువ్వులు, వేరుశనగకపప్పులు, పచ్చికొబ్బరి, రాజ్మాగింజలు, బఠానీలు, శనగలు, పెసలు, బొబ్బర్లు. వీటిల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు ప పుచ్చగింజలు పప్పు, గుమ్మడిగింజల పప్పు, బాదంపప్పు, జీడిపప్పు, పిస్తాపప్పు, ప్రొద్దుతిరుగుడుపప్పు, వాలన్ నట్స్ ఇవన్నీ కూడా విత్తనాల కోవకు చెందినవనమాట. 

బఠానీలు, బొబ్బర్లు, పెసలు ఇవి నూనె రానప్పటికీ ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. షుగ‌ర్‌ పెరగకుండా బరువు పెరగాలనుకునే వాళ్లు ఇలాంటివి తినాలని ప్రముఖ ప్రకృతివైద్య నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ ఎండుస్థితితో ఉన్నప్పుడు తినలేం. పచ్చిగా ఉన్నప్పుడే తినాలి. అంటే పచ్చికందికాయలు, పచ్చిబఠానీలు, పచ్చి శనగలు. పచ్చికొబ్బరి ముక్కలు తినండి. పచ్చికొబ్బరి బాగా వాడుకుంటే..షుగ‌ర్‌ అస్సలు పెరగదు. షుగ‌ర్‌ పేషెంట్స్ కి పచ్చికొబ్బరి చాలా మంచిది.

ఇక ఎండువిత్తనాలు.. వీటిని గ్రైండ్ చేస్తే ఆయిల్ వస్తుంది. ఇలాంటి వాటిని నానపెట్టుకుని తినాలి. అరుగుదలకు ఇబ్బందిలేకుండా తినొచ్చు. రాజ్మాగింజలు, సోయాబీన్స్ మాత్రం కేవలం నానపెట్టి తినకూడదు. 12గంటలు నానపెట్టిన తర్వాత ఉడకపెట్టి కూరల్లో వేసుకుని తినాలి. 

 షుగ‌ర్‌ వ్యాధితో బాధపడుతూ బరువు తగ్గేవారు ఇలాంటి ఆహారాలు తినగలిగితే.. చక్కగా బరువుపెరిగి.. షుగ‌ర్‌ కంట్రోలో ఉంటుంది. 

షుగ‌ర్‌ వ్యాధిని తగ్గించుకుకోవాలంటే.. ఇవి పాటించాల్సిందే

షుగ‌ర్‌ ఎక్కువగా అవడం వల్ల..అనేక రకాల సమస్యలు వస్తాయి. చాపకింద నీళ్ల వలే ఈ షుగ‌ర్‌ వ్యాధీ శరీరాన్ని సర్వనాశనం చేస్తుంది. షుగ‌ర్‌ వ్యాధిని తగ్గించుకోవాలంటే..అన్నం మానాలి. తెల్లటి అన్నం తెల్లటి విషం. కానీ ఈ విషయాన్ని తేలిగ్గా తీసిపడేస్తారు. పాలిష్ చేసిన తెల్లటి బియ్యంలో కార్భోహైడ్రేట్స్ ఉంటాయి. రొట్టెలు, పుల్కాలు తినటం అలవాటు చేసుకోండి. పిండిపదార్థాలను కట్ చేయడానికి చాలా సింపుల్ సొల్యూషన్. మల్టీగ్రెయిన్ పిండితో పుల్కాలు చేసుకోండి..ఇలా 20రోజులు చేయండి. సజ్జరొట్టే, రాగిరొట్టె తినండి. వీటితోపాటు..కూరలు ఎక్కువగా తినండి. కడుపునిండుతుంది. 

కూరలు ఎక్కువగా తినేవారికి షుగ‌ర్‌ రాదు..ఎక్కువగా కూరతినాలంటే..చప్పగా ఉండాలి. ఆయిల్ ఎక్కువగా పోసేసి,ఉప్పుకారం ఎక్కువగా వేస్తే కూరలు ఎక్కువగా తినలేరు.ఉప్పువల్ల కూడా డయాబెటిస్ ఎక్కువ అవుతుంది. రోజుకు 2.5 గ్రాముల సాల్ట్ తినేవారికి 72శాతం డయాబెటీస్ వచ్చే శాతం ఉందని సైంటిఫిక్ గా నిరూపించబడింది. సాల్ట్ కి డయాబెటీస్ సంబంధం ఉందని తెలియదు. 
చాలామంది కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తింటారు. అసలు అది మంచిది కాదు. మూడేసార్లు తినండి. 

షుగ‌ర్‌ వ్యాధితో బాధపడేవారికి ఆహార నియమాలును కంట్రోల్ చేసుకోవడమే ఏకైక మార్గం. మందులు లేకుండా షుగ‌ర్‌ తగ్గాలంటే..ఏం చేయాలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

డైట్ ప్లాన్

  1. ఉదయం పూట రెండుసార్లు మంచినీళ్లు తాగి రెండుసార్లు మోషన్ అయ్యేలా చూసుకోండి. ఉదయం వాకింగ్ వద్దు. ఎక్సర్సైజ్, ప్రాణామాయం ఇలాంటివి చేసుకోవచ్చు.
  2. షుగ‌ర్‌ ఉన్నవారు జ్యూస్ తాగితే పెరుగుతుంది..కానీ మిక్సిడ్ వెజిటబుల్ జ్యూస్ తాగొచ్చు. ఏమైనా మూడు రకాలు జ్యూస్ చేసుకుని తాగొచ్చు. పొట్ల, సొర, బీర, కీర, క్యారెట్, టమాటా, బీట్ రూట్ వీటిల్లో ఏవైనా మూడు రకాలు చాలు. 200MLచాలు. ఉదయం 8లోపు ఈ జ్యూస్ తాగండి.
  3. జ్యూస్ తాగిన 45 నిమిషాలకు మొలకెత్తిన విత్తనాలు ఏమైనా మూడురకాలు తీసుకోండి. వీటితోపాటు దానిమ్మగింజలు, రెండు ఖర్జూరం పళ్లు, యాపిల్ ముక్క ఒకటి, కాస్త నిమ్మరసం, అరస్పూన్ తేనె వేసుకుని తినండి. కర్బూజ, బొప్పాయి, జామపండు ఏదొకటి తినండి. ఇలా సోమవారం నుంచి శనివారం వరకు తినండి. ఆదివారం మాత్రం ఇడ్లీ, దోస, ఉప్మా వద్దు..పెసరట్టు తినొచ్చు.
  4. బ్రేక్ ఫాస్ట్ అయిన రెండు గంటల తర్వాతా నీళ్లు తాగుతూ ఉండండి. మూడు గ్లాసులు నీళ్లు లంచ్ లోపు తాగండి. లంచ్ రెండు పుల్కాలు, లేదా జొన్నరొట్టె,రాగిరొట్టె. వీటితోపాటు ఒక ఆకుకూర. ఇందులో పైన చెప్పుకున్న పప్పులు వేసుకోండి. రైస్ అస్సలు ముట్టుకోవద్దు. ఆదివారం మాత్రం కాస్త తినండి.
  5. లంచ్ అయిన రెండు గంటల తర్వాత సాయంత్రం లోపు మూడు గ్లాసులు నీళ్లు తాగండి. 5గంటలకు కొబ్బరినీళ్లు తాగండి. 6.30కి పచ్చికొబ్బరి, డ్రైనట్స్ రెండు రకాలు ఏదోఒకటి రెండుమూడురకాలు నానపెట్టుకుని ఖర్జూరంతో తినండి. అప్పుడు జామకాయలు, కర్భూజ, బొప్పాయి తినండి. ఇలా డిన్నర్ తీసుకోండి. ఇవినింగ్ డిన్నర్ తిన్నాక ఒక అరగంట, గంట వాకింగ్ చేయండి.
  6. వారానికి ఒకసారి..షుగ‌ర్‌ టెస్ట్ చేసుకోండి. షుగ‌ర్‌ తగ్గినప్పుడల్లా మెడిసన్ తగ్గించండి. ఇలా రెండునెలల్లు పాటిస్తే..మెడిసన్ పూర్తిగా తగ్గించుకోవచ్చు. 

ధైర్యం ఉంటే.. డయాబెటీస్ కి డైవర్స్ ఇచ్చేయొచ్చు.. వీటిని విల్ పవర్ తో చేసి ఈ వ్యాధినుంచి బయటపడండి.

గమనిక: పైన చెప్పిన సమాచారం ఆన్‌లైన్‌లో ప్రముఖ ప్రకృతి వైద్యలు మంతెన సత్యనారయణ గారు అందించిన వాటి ఆధారంగా మీకు ఇవ్వటం జరిగింది.

- Triveni Buskarowthu

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.