Hibiscus : మందారంతో మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు తెలుసా..?

Hibiscus : ఈరోజుల్లో ఇంటికో డయబెటిక్‌ పేషెంట్‌ ఉంటున్నారు. సరైన జీవనశైలి లేకపోవడం వల్ల ఇలాంటి రోగాలబారినపడుతున్నారు. డయబెటిస్‌, బీపీ లాంటివి ఒక్కసారి వచ్చాయంటే.. అవి జీవితాంతం మనతోనే ఉంటాయి

Hibiscus : మందారంతో మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు తెలుసా..?


Hibiscus : ఈరోజుల్లో ఇంటికో డయబెటిక్‌ పేషెంట్‌ ఉంటున్నారు. సరైన జీవనశైలి లేకపోవడం వల్ల ఇలాంటి రోగాలబారినపడుతున్నారు. డయబెటిస్‌, బీపీ లాంటివి ఒక్కసారి వచ్చాయంటే.. అవి జీవితాంతం మనతోనే ఉంటాయి.. మరి మనతో ఉండేవాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా..! లేకపోతే అవి విశ్వరూపం చూపిస్తాయి.. డయబెటిక్‌కు డైలీ ట్యాబ్లెట్‌ వేసుకోవడం కంటే.. కొన్ని సహజసిద్ధమైన మార్గాల ద్వారా కంట్రోల్‌ చేసుకోవచ్చు.. వేటితో అయినా షుగర్‌ పూర్తిగా తగ్గదు.. కానీ ఆయుర్వేద చిట్కాల ద్వారా మీకు షుగర్‌ ఉందని కూడా మీరు భావించలేరు.. డైలీ వాటిని వాడుతుంటారు.. దాని వల్ల షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్లో ఉంటాయి. మందార పూలతో కూడా మధుమేహాన్ని కంట్రోల్‌ చేసుకోవచ్చు. 
Hibiscus: Plant Care & Growing Guide
 
మందార పువ్వుల‌లో ఎన్నో వైద్య గుణాలు ఉంటాయి. అవి చాలా రోగాల‌ను న‌యం చేయ‌డానికి ఉప‌యోడ‌ప‌డ‌తాయి. మందార పువ్వుని తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ కంట్రోల్‌లో ఉంటుంది. మ‌ధుమేహంతో బాధ‌ప‌డుతున్న వారితో పాటు అది లేని వాళ్లు కూడా తీసుకోవ‌చ్చు. దీన్ని తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ బారిన ప‌డ‌కుండా ఉండొచ్చు.. రోజూ ఉద‌యం 4 నుండి 5 మందార పువ్వు మొగ్గ‌ల‌ను ప‌ర‌గ‌డుపునే తిన‌డం వ‌ల్ల‌ మ‌ధుమేహ స‌మ‌స్య‌ను త‌గ్గిచుకోవ‌చ్చు. అంతే కాకుండా మందారలో పుష్క‌లంగా ఉండే యాంటీ ఆక్సీడెంట్స్ హైబీపీని కూడా అదుపులో ఉంచుతాయి.. ఇంకా శ‌రీరంలోని కొవ్వుని క‌రిగించ‌డానికి, బ‌రువు త‌గ్గ‌డానికి, చ‌ర్మం నిగారింపు.. మొద‌లైన వాటికి ప‌ని చేస్తాయి.
ఇక మందారాన్ని ఎలా తీసుకోవాలో ఇప్ప‌డు చుద్దామా..!. మందార పువ్వుల‌ను తీసుకొని వాటిలోని తేమ పోయేవ‌ర‌కు ఎండనివ్వండి.. ఆ త‌రువాత వాటిని మిక్సీలో వేసుకొని మెత్త‌ని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని నేరుగా కానీ లేదా టీ రూపంలో గానీ చేసుకొని తాగ‌వ‌చ్చు. మందార ఆకుల‌ని కూడా నేరుగా న‌మిలి తిన‌వ‌చ్చు. ఇలా రోజూ చేయ‌డం వల్ల డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇక మీ ఇంట్లో మందార చెట్టు ఉందంటే.. షుగర్‌ రాకుండా చూసుకోవచ్చు..
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.