Jilledu : జిల్లేడు ఆకులతో ఇలా చేస్తే.. నెలరోజుల్లో షుగర్‌ తగ్గుతుంది..!

Jilledu : డయబెటిస్‌ ఉన్నవాళ్లు షుగర్‌ లెవల్స్‌ను కంట్రోల్‌ చేయడానికి ప్రతిక్షణం శ్రమిస్తూనే ఉంటారు. తినేవి, తాగేవి అన్ని విషయాల్లో శ్రద్ధే.. ఇష్టం లేకున్నా మందులు వేసుకుంటూ లైఫ్‌ అంతా చేదుతోనే జీవించాలా అని నిరాశ

Jilledu : జిల్లేడు ఆకులతో ఇలా చేస్తే.. నెలరోజుల్లో షుగర్‌ తగ్గుతుంది..!


costus igneus : డయబెటిస్‌ ఉన్నవాళ్లు షుగర్‌ లెవల్స్‌ను కంట్రోల్‌ చేయడానికి ప్రతిక్షణం శ్రమిస్తూనే ఉంటారు. తినేవి, తాగేవి అన్ని విషయాల్లో శ్రద్ధే.. ఇష్టం లేకున్నా మందులు వేసుకుంటూ లైఫ్‌ అంతా చేదుతోనే జీవించాలా అని నిరాశతో ఉంటారు. పోనీ ఇన్ని చేసినా షుగర్‌ ఏమైనా తగ్గుతుందా అంటే లేదే.. అరే ఒక్కరోజు ట్యాబ్లెట్‌ లేట్‌ అయితే ఆగం ఆగం... మీకు కూడా ఇలా అవుతుందా..?  అయితే ఒక సింపుల్‌ చిట్కా ఉంది.. దీన్ని తాగక్కర్లేదు, తినక్కర్లేదు.. అయినా మీ షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్లో ఉంటాయి. దీనికోసం మీకు కావాల్సింది అల్లా జిల్లెడు ఆకులు మాత్రమే.. 
Calotropis gigantea - Wikipedia
రోజూ రెండు ఆకుల‌ను ఉప‌యోగించి డ‌యాబెటిస్‌ను నియంత్రిచుకోవ‌చ్చు. రెండు ప‌చ్చ‌టి ఆకుల‌ను ఉప‌యోగించి డ‌యాబెటిస్‌ను త‌రిమి కొట్ట‌వ‌చ్చు. ప‌చ్చ‌టి ఆకుల‌తో షుగ‌ర్ వ్యాధిని త‌రిమికొట్ట‌వ‌చ్చా.. ఎట్లా అనుకుంటున్నారా..? డ‌యాబెటిస్‌ను డ‌యాబెటిస్ మెలిట‌స్ అని కూడా అంటారు. ఈ వ్యాధి బారిన ప‌డిన వారిలో ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అధికంగా ఉండ‌డం కానీ ఇన్సులిన్ హార్మోన్ స్థాయి త‌గ్గ‌డం కానీ జ‌రుగుతుంది. శ‌రీరంలోని క‌ణాలు ఇన్సులిన్‌కు స‌రిగ్గా స్పందించ‌క‌పోవ‌డం జ‌రుగుతుంది.
 
ఈ ఆకుల‌ను వాడ‌డం వ‌ల్ల మీరు చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. అస‌లు ఈ ఆకుల‌ను తినాల్సిన ప‌ని లేదు. వీటిని జ్యూస్‌గా చేసుకుని తాగాల్సిన అవ‌స‌రం లేదు. చేయాల్సింద‌ల్లా పాదాల‌ను జిల్లేడు ఆకుల‌తో స్పృశించ‌డ‌మే. రెండు తాజా జిల్లేడు ఆకుల‌ను తీసుకుని పాదాల అడుగు భాగంలో ఉంచాలి. అలాగే పాదాల‌ను సాక్స్‌తో, షూస్‌తో క‌ప్పి ఉంచాలి. రెండు పాదాల‌కు కూడా ఇలాగే చేయాలి. ఈ ఆకుల‌ను రోజంతా అలాగే ఉంచాలి. ప‌డుకునే ముందు వాటిని తీసేసి పాదాల‌ను శుభ్రం చేసుకోవాలి. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా వారం రోజులు పాటు చేయాలి. ప్ర‌తిసారి కూడా కొత్త జిల్లేడు ఆకుల‌ను ఉప‌యోగించాలి. ఇలా వారం రోజులు చేసిన త‌రువాత షుగ‌ర్ స్థాయిల‌ను ప‌రీక్షించుకోంచి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ఇలా షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లోకి వ‌చ్చే వ‌ర‌కు చేయాలి.
కాక‌ర కాయ జ్యూస్‌ను ఒక ట‌బ్ లో పోసి అందులో కాళ్ల‌ను ఉంచి ఒక కాలును మ‌రో కాలుతో వ‌త్తుకోవాలి. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా 20 నుండి 25 రోజుల పాటు పాటించ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది. ఈ ప‌ద్ద‌తి షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో చ‌క్క‌గా ప‌ని చేస్తుంది.ఈ ప‌ద్ద‌తిని పాటించిన వంద మందిలో 99 శాతం మంది చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొందుతున్నారు... 
అవ‌స‌ర‌మైతే కాక‌ర కాయ జ్యూస్‌ను కూడా తాగ‌వ‌చ్చు. ఇలా చేస్తూ వ్యాయామాల‌ను చేయాలి. 7 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు నిద్ర‌పోవాలి. ప్ర‌తిరోజూ 10 గంట‌లకే నిద్ర‌పోయి ఉద‌యాన్నే వేకువ జామున నిద్ర‌లేవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆరోగ్యం చ‌క్క‌గా ఉండ‌డంతోపాటు ఉత్సాహంగా ప‌ని చేసుకోవ‌చ్చు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.