ప్రెగ్నెన్సీ టైమ్‌లో టైప్‌ 2 డయబెటీస్‌ రావొద్దంటే.. ఇలా చేయండి..!

చాలామందికి ప్రెగ్నెన్సీ టైమ్‌లోనే మధుమేహం వస్తుంది. కొన్నిసార్లు తల్లికి డయబెటిస్‌ వస్తే.. ఆ ప్రభావం బిడ్డపైన కూడా పడుతుంది. అయితే కచ్చితంగా అందరికీ గర్భంధరించినప్పుడు మధుమేహం రావాలి అని లేదు. కానీ నేడు నూటికి అరవై శాతం మందికి ఇదే

ప్రెగ్నెన్సీ టైమ్‌లో టైప్‌ 2 డయబెటీస్‌ రావొద్దంటే.. ఇలా చేయండి..!


చాలామందికి ప్రెగ్నెన్సీ టైమ్‌లోనే మధుమేహం వస్తుంది. కొన్నిసార్లు తల్లికి డయబెటిస్‌ వస్తే.. ఆ ప్రభావం బిడ్డపైన కూడా పడుతుంది. అయితే కచ్చితంగా అందరికీ గర్భంధరించినప్పుడు మధుమేహం రావాలి అని లేదు. కానీ నేడు నూటికి అరవై శాతం మందికి ఇదే జరుగుతుంది. 25 ఏళ్ల వయసు దాటిన అమ్మాయిలకు గర్భదారణ సమయంలో జీవన శైలి లోపాల వల్ల, అధిక బరువు వల్ల, లేదా కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉన్నా వాళ్లకు కూడా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. ప్లాసెంటా విడుదల చేసే హార్మోన్ల వల్ల శరీరం ఇన్సులిన్ సరిగ్గా ఉపయోగించుకోలేదు. ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చిన డయాబెటిస్ లక్షణాలన్నీ దాదాపుగా డెలివరీ తరువాత తగ్గిపోతాయి. కానీ కొన్నేళ్లకు టైప్‌ 2 డయబెటీస్‌ వచ్చే ప్రమాదం ఉంది. ప్రగ్నెన్సీ టైమ్‌లో డయబెటీస్‌ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!

బరువు అదుపులో ఉంచుకోవాలి

జీవన శైలి మార్పుల్లో ముఖ్యమైంది ఆహారం. మొదటి నాలుగైదు నెలల్లో పెరిగే బరువు డయాబెటిస్‌కి కారణం కాకపోవచ్చు. 24 నుంచి 28 వారాల్లోనే ఈ సమస్య మొదలయ్యే అవకాశం ఉంది కాబట్టి.. ఆ సమయంలో బరువు నియంత్రణలో ఉంచుకోగలిగితే డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. జన్యువుల ద్వారా వచ్చే డయాబెటిస్ మొదటి మూడు నెలల్లోనే రావచ్చు. దీనికోసం గర్భదారణ ముందు నుంచి ఆరోగ్యకరమైన బరువు ఉండేలా జాగ్రత్తపడాలి.. ప్రెగ్నెన్సీ సమయంలో సాధారణంగానే బరువు పెరుగుతారు. అందుకే ఎక్కువ కేలరీలు, పోషకాలున్న ఆహారం తీసుకోవాలి. అధికంగా కొవ్వు, తీపి పదార్థాలు తినకూడదు.

ఆహారం

ఆ సమయంలో ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. కానీ బయటి ఆహారం జోలికి పోకూడదు. ఇంట్లో చేసిన వాటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. పండ్లు, కూరగాయలు తినడం వల్ల కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్‌ అందుతాయి. బరువు తక్కువగా ఉంటే కాస్త కొవ్వు ఉన్న ఆహారం కూడా తొనొచ్చు. ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

వాకింగ్, వ్యాయామం

ఇక గర్భందాల్చిన తర్వాత కూడా.. సాధారణ వ్యాయామాలు, వాకింగ్‌ తప్పనిసరిగా చేయాలి. మొదటి మూడు నెలల్లో సరైన విశ్రాంతి మాత్రమే తీసుకోవాలి. ఆ తరువాత వాకింగ్ మాత్రం చివరి వరకూ చేయొచ్చు. ఒక గంట సేపు వాకింగ్ చేయడం, పెల్విక్ ఫ్లూర్ ఎక్స‌ర్‌సైజులు చేయడం ముఖ్యం. వీటివల్ల డయాబెటిస్ రాకుండా నియంత్రించొచ్చు.

ఒత్తిడి

ఇది అన్నింటికన్నా ముఖ్యమైనది.. ఆనందంగా, ఉత్సాహంగా ఉండాల్సిన సమయం అది. మొదటి మూడు నెలల్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండగలిగితే డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. రోజూవారీ పనులు చేసుకోవడం మంచిదే. కానీ ఒత్తిడి తీసుకోవద్దు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.