Non-vegetarian : ఈ లక్షణాలు కనిపిస్తే మాంసాహారం మానేయాల్సిందేనా..  !

Non - vegetarian : మాంసాహారం ప్రతి ఒక్కరు ఎంత ఇష్టంగా తినే ఆహారం ముఖ్యంగా ఇంట్లో ఉన్న బయటకు వెళ్లిన మాంసాహారాన్ని తినడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు దానిలో ఉండే

Non-vegetarian : ఈ లక్షణాలు కనిపిస్తే మాంసాహారం మానేయాల్సిందేనా..  !
eating non veg


Non - vegetarian : మాంసాహారం ప్రతి ఒక్కరు ఎంత ఇష్టంగా తినే ఆహారం ముఖ్యంగా ఇంట్లో ఉన్న బయటకు వెళ్లిన మాంసాహారాన్ని తినడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు దానిలో ఉండే రుచి అలా ఉంటుంది అయితే వాళ్ల వారికి మాంసాహారం పడదని కొన్ని లక్షణాలు కనిపిస్తే తప్పకుండా తినడం మానేయాలని తెలుస్తోంది..

మాంసాహారం తిన్న వెంటనే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తే తప్పకుండా ఇక ఆ ఆహారాన్ని తీసుకోకూడదని తెలుస్తోంది.. కొందరి శరీరానికి మాంసాహారం పడదు ఇది తిన్నప్పుడల్లా కొన్ని అనారోగ్యాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే లక్షణాలు కొన్నిసార్లు తీవ్ర స్థాయికి దారి తీయొచ్చు కూడా చిన్నగా మొదలయ్యి పెను ప్రమాదానికి కారణం అవుతాయి అందుకే మానుకోవాలని అంటున్నారు నిపుణులు..

కొందరికి శరీరం మీద దద్దుర్లు కనిపిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా మాంసాహారం తిన్న వెంటనే కనిపిస్తే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఇదే విషయం ప్రతిసారి బయటపడుతుంటే మాత్రం మాంసాహారాన్ని మానుకోవాలి వీలైతే వెంటనే వైద్యుడు సలహా తీసుకోవాలి.. 

అలాగే కొన్ని రకాల మాంసాహారం తిన్నప్పుడు శరీరం వాపు కు గురవుతుంది అలాగే మొహం పైన కంటి పైన.. వాపులు కనిపించడం కాలు విపరీతంగా వాచిపోవడం అలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివారు ఏ మాంసాహారం తింటే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయో దాన్ని వీలైనంతవరకు తీసుకోకపోవడం మంచిది..

అలాగే కొన్నిసార్లు మాంసాహారం జీర్ణం కాక వికారంగా అనిపిస్తూ వాంతులు అవుతూ ఉంటాయి లేదా రోజంతా చాలా చిరాకుగా అనిపిస్తుంది ఇలాంటి లక్షణాలు కనిపించిన వీలైనంతవరకు తినకుండా ఉండటం మంచిది.. 

అలాగే అతిసారం సమస్యతో బాధపడేవారు సైతం మాంసాహారాన్ని తీసుకోవద్దని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు..

అలాగే మాంసాహారం తిన్న కాసేపటికి విపరీతంగా తుమ్ములు వచ్చిన ముక్కు కారటం ముక్కు మూసుకుపోవడం అంటే సమస్యలు కనిపిస్తే అప్రమత్తం అవ్వడం అవసరం..

అంతేకాకుండా కొన్నిసార్లు కళ్ళ నుంచి ఆకస్మాత్తుగా నీరు కారటం సరిగ్గా శ్వాస ఆడకపోవటం కడుపులో తీవ్రంగా ఇబ్బందిగా అనిపించడం వంటివి జరుగుతూ ఉంటాయి అలాగే మరికొన్నిసార్లు మాంసాహారం తిన్న వెంటనే గుండె వేగంగా కొట్టుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది.. ఇలాంటి ఏ లక్షణాలు కనిపించినా వీలైనంత వరకు మాంసాహారం జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.