పాలిచ్చే ముందు బాలింతలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!

మొదటిసారి గర్భిణీ అయినప్పుడు చాలా విషయాలపై అవగాహన ఉండదు. చెప్పేవాళ్లు కూడా ఏవేవో చెప్తారు. ఏది పాటించాలో ఏది వదిలేయాలో తెలియదు. బాలింతగా మారినప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

పాలిచ్చే ముందు బాలింతలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!


మొదటిసారి గర్భిణీ అయినప్పుడు చాలా విషయాలపై అవగాహన ఉండదు. చెప్పేవాళ్లు కూడా ఏవేవో చెప్తారు. ఏది పాటించాలో ఏది వదిలేయాలో తెలియదు. బాలింతగా మారినప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బిడ్డకు పాలిచ్చే తల్లులు ముఖ్యంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. కేవలం తినే ఆహారం విషయంలోనే కాదు.. పాలిచ్చేప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి అవేంటంటే.. 
మీరు మీ బిడ్డకు పాలు పట్టేటప్పుడు, పొరపాటున మీ బట్టలపై పాలు చిందవచ్చు. కాబట్టి క్రమం తప్పకుండా బట్టలు మార్చుకోవాలి. దీనివల్ల పరిశుభ్రతను కాపాడుకోవడమే కాదు, బ్యాక్టీరియా, దుర్వాసనను నివారించినట్లవుతుంది. ఇది రొమ్ము ప్రాంతంలో, శిశువుకీ చర్మ వ్యాధులు రాకుండా చేస్తుంది.
15 breastfeeding problems and how to solve them - Today's Parent
తల్లిపాలు ఇచ్చే ముందు మీ రొమ్ములను పూర్తిగా శుభ్రం చేయండి. దీనివల్ల చర్మంలోని సూక్ష్మక్రిములు తొలగిపోతాయి. ఆల్కహాల్, పారాబెన్, ఫినాక్సీథనాల్ లేని రొమ్ముల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్రెస్ట్ వైప్‌లను ఉపయోగించండి. 
పాలు ఇచ్చే ప్రతిసారీ మీ చేతులను సబ్బు, నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల క్రిములు, ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు.
అదనపు రసయనాలు, ఎక్కువ ఘాటు వచ్చే సెంట్లు ఉన్న ఉత్పత్తులను నివారించండి. మీరు పాలు ఇస్తున్నప్పుడు మీ బిడ్డ మీతో సన్నిహితంగా ఉంటుంది. మీరు రొమ్ము ప్రాంతంలో పెర్ఫ్యూమ్ వంటి ఉత్పత్తులను ఉపయోగించినట్లయితే, వాటిలోని రసాయనాలు మీ శిశువు చర్మంపై చికాకు కలిగిస్తాయి. ఇవి శిశువు నోటిలో శ్వాస సమస్యలు లేదా చికాకును కలిగిస్తాయి.  
పోషకాలు అధికంగా ఉండే తల్లి పాలలో చిన్న మొత్తంలో బ్యాక్టీరియా ఏర్పడవచ్చు. దీని వల్ల పాలు పాడవుతాయి. చాలా మంది తల్లులు ఇప్పుడు బ్రెస్ట్ పంప్‌లను ఉపయోగిస్తున్నారు కాబట్టి, బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజూ బ్రెస్ట్ పంప్‌ను శుభ్రం చేయడం వల్ల వాటిలోని బ్యాక్టీరియాను నిరోధించవచ్చు.
పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన నర్సింగ్ బ్రాలును వాడండి. ఇవి పరిశుభ్రతను కాపాడుకోవడంలో సహాయపడతాయి, అలాగే తల్లిపాలు ఇచ్చే ప్రక్రియను సులభతరం చేస్తాయి. బ్రీతబుల్ ఫాబ్రిక్‌తో తయారు చేసిన, మీ అవసరాలకు సరిపోయేలా రూపొందించిన సర్దుబాటు పట్టీలతో బ్రాలను ఎంచుకోండి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.