Nerves weakness : ప్రసవం అనంతరం ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే నరాల బలహీనత వస్తుంది.. జాగ్రత్త సుమా..

Nerves weakness : ప్రసవం అయ్యాక ఆడవాళ్ళ శరీరం చాలా వేదన అనుభవించి ఉంటుంది. ఈ సమయంలో శరీరంలో దాదాపు ఉన్న నరాలు అన్ని కదిలిపోతాయి. పొట్టలో ఉన్న కండరాలు ఎంతో శ్రమించి ఉంటాయి. ప్రతి ఒక్క అణువు నిరంతరం కష్టపడి ఉంటుంది.

Nerves weakness : ప్రసవం అనంతరం ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే నరాల బలహీనత వస్తుంది.. జాగ్రత్త సుమా..
Precautions to be taken after delivery


Precautions after delivery : ప్రసవం తర్వాత పడతి చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ప్రసవం అనంతరం తీసుకునే జాగ్రత్తలను సూతికా పరిచర్యలు అంటారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత నుంచి తల్లి ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో భవిష్యత్తు ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.
ప్రసవం అయ్యాక ఆడవాళ్ళ శరీరం చాలా వేదన అనుభవించి ఉంటుంది. ఈ సమయంలో శరీరంలో దాదాపు ఉన్న నరాలు అన్ని కదిలిపోతాయి. పొట్టలో ఉన్న కండరాలు ఎంతో శ్రమించి ఉంటాయి. ప్రతి ఒక్క అణువు నిరంతరం కష్టపడి ఉంటుంది. ముఖ్యంగా సాధారణ ప్రసవం అయినా ఆపరేషన్ అయినా శరీరం మునపటి స్థాయికి రావాలి అంటే తగిన జాగ్రత్తలు తప్పనిసరి.
ప్రసవమైన తొలి రోజు నుంచి మూడు రోజుల వరకు ఉప్పు లేని ఆహారాన్ని తీసుకోవాలి. అది తేలికైన ఆహారం తీసుకోవాలి. ఉడికించిన కూరగాయలు, పాలు, నెయ్యి వంటివి కొద్దికొద్దిగా మొదటి నెలలో తీసుకోవడం మంచిది. అలాగే ఈ సమయంలో ఎక్కువగా ఆకలి అనిపించదు. కానీ బిడ్డకు పాలు ఇవ్వాలి శరీరంలో అలసిపోయిన అవయవాలను మళ్లీ మునపటి స్థాయికి తీసుకురావాలి. అందుకే ఆకలిని పుట్టించడానికి ధనియాలు, జీలకర్ర, సైంధవ లవణం, పిప్పళ్ళు వంటి వాటితో చేసిన పొడిని అన్నంతో కలిపి తీసుకోవడం మంచిది.

ప్రసవనంతరం గర్భాశయం లోపల ఉన్న మావి మొత్తం బయటికి వచ్చేసిందో లేదో చూసుకోవాలి. ప్రసవం తర్వాత జ్వరం, ఆగకుండా రక్తస్రావం జరిగితే మాత్రం జాగ్రత్త పడాలి.  రొమ్ములు బిగబట్టి ఇబ్బంది పెట్టడం, బిడ్డకి పాలిచ్చే సమయంలో పాలు విరిగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.
ప్రసవానంతరం మొదటి 11 రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వేడిచేసిన స్వచ్చమైన నువ్వుల నూనె ఆహారంలో ఉపయోగించాలి. రోజూ ఉదయం వేడి చేసిన నువ్వుల నూనెను రెండు స్పూన్స్ తీసుకోవడం వల్ల నడుం భాగంలో కదిలిపోయిన కండరాలు అన్ని పూర్వ స్థితికి వస్తాయని తెలుస్తోంది..
ఆయుర్వేదం ప్రకారం దర్బలకొసలతో కాచిన పాలు, చెరుకు రసం తల్లికి ఇవ్వడం వల్ల బిడ్డకి పాల సమస్య ఉండదని తెలుస్తోంది. దాదాపు రెండు నెలల పాటు చల్లని నీళ్లను పట్టుకోకపోవడమే మంచిది. ఇంటిలో తిరిగినా చెప్పులు వేసుకుని తిరగాలి. చలికాలం అయితే తలకి గుడ్డ కట్టుకోవడం మంచిది. చెవుల్లోకి గాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. కాళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లటి నీటిలో ఉంచకూడదు. దీని వలన పలు రకాల సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. నరాల బలహీనత కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రసవం తర్వాత పడతి చాలా జాగ్రత్తగా ఉండాలి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.