Food in fridge : ఫ్రిడ్జ్ లో పెట్టకూడని ఆహార పదార్థాలెంటో  తెలుసా????

Fridge లో ఉంచిన ఆహారాలు తినడం వల్ల అనారోగ్యాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మామూలుగా వైద్యులు చెబుతుంటారు.....వండిన ఆహారం త్వరగా తినేయాలని, లేకపోతే ఫుడ్ పాయిజన్ అవుతుందని. మరి అలాంటిదే ఫ్రిడ్జ్ లో రోజులు తరబడి పెట్టుకుని తింటే అనారోగ్యాలు రాకుండా ఏమౌతుంది మరి.

Food in fridge : ఫ్రిడ్జ్ లో పెట్టకూడని ఆహార పదార్థాలెంటో  తెలుసా????
What are the food items not to be kept in fridge


ప్రజలకు ప్రతీది నిత్యవసరం అయిపోయింది. బైక్ నుంచి ఏసీ వరకూ అన్నీ నిత్యవసరాలే అయిపోయాయి. ధనిక, బీద అనే తేడా లేకుండా అందరూ ఈ వస్తువులు లేకుండా అసలు ఉండలేకపోతున్నారు. అంతలా సమాజ పోకడలు మారిపోయాయి. ఇప్పుడున్న నిత్యవసరాల్లో ముఖ్యంగా చెప్పుకునేది ఫ్రిడ్జ్. ప్రతి ఇంట్లో ఉండాల్సిందే.

మండే ఎండల్లో చల్లచల్లని నీరు కావాలని ఎవరికుండదు. ఆహార పదార్థాలు వృథా కాకూడదని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం. తాజా కూరగాయలు, పచ్చళ్లు, అన్ని అందులోనే పెట్టేస్తాం. ఫ్రిడ్జ్ లో స్థలముంటే ఏమైనా దాంట్లోనే పడేస్తాం. అసలు ఫ్రిజ్ లో పెట్టిన ఆహారం తినొచ్చా?ఫ్రిజ్ లో ఉంచిన ఆహారం తింటే కలిగే నష్టాలెంటీ?

ఫ్రిజ్ లో ఉంచిన ఆహారాలు తినడం వల్ల అనారోగ్యాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మామూలుగా వైద్యులు చెబుతుంటారు.....వండిన ఆహారం త్వరగా తినేయాలని.....లేకపోతే ఫుడ్ పాయిజన్ అవుతుందని. మరి అలాంటిదే ఫ్రిడ్జ్ లో రోజులు తరబడి పెట్టుకుని తింటే అనారోగ్యాలు రాకుండా ఏమౌతుంది మరి. చాలామంది వారానికి సరిపడా కూరగాయలను, పండ్లు పెడుతుంటారు. ముందే ఆహారం తయారు చేసుకుని....కావాలనుకునేప్పుడు వేడి చేసి తినేస్తుంటారు.

అయితే కొన్ని పదార్థాలు ఫ్రిడ్జ్ లో అస్సలు పెట్టకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానివల్ల బోలెడన్నీ నష్టాలు, దుష్ప్రభావాలు కూడా ఉంటాయి.

ఫ్రిడ్జ్ లో పెట్టకూడని వస్తువులు, పదార్థాలు 

  1. కోసి పెట్టిన ఉల్లిపాయలు అసలు పెట్టకూడదు. ఉల్లిపాయల వాసన ఇతర పదార్థాలకు అంటుకుంటుంది. ఉల్లిపాయలు ఫ్రిడ్జ్ లో పెడితే బూజు పట్టే అవకాశం ఉంది.
  2. బంగాళాదుంపలను కూడా పెట్టకూడదు. ఇవి శీతల ప్రాంతంలో ఉంటే చక్కెర శాతం పెరిగిపోతుంది. కూరలో రుచి సైతం మారిపోతుంది. అవి పొడి వాతావరణంలోనే ఉండాలి.
  3. తేనె ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల రుచి మారుతుంది. బయట పెట్టుకోవడం మంచిది.
  4. అరటి పళ్లు త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది.
  5. పువ్వులు పెడితే ఇతర ఆహారాలపై పువ్వుల వాసన పడి తినడానికి కష్టంగా ఉంటుంది.
  6. రొట్టెలు, బ్రెడ్ వంటివి ప్యాకింగ్ చేసుకుని పెట్టుకోవాలి. లేకపోతే గట్టిపడిపోతాయి.
  7. పచ్చళ్లను బయటే పెట్టుకోవాలి. లేదంటే అసలైన సువాసనలను కోల్పోతాయి.
  8. ఫ్రిడ్జ్ లో ఉంచిన వెల్లుల్లిని వాడినా ఫలితముండదు. రుచి, వాసన కోల్పోతుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.