ప్రెగ్నెన్సీలో చివర మూడు నెలలు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే.. 

గర్భం దాల్చిన దగ్గర్నుంచి ప్రతి సమయం ఎంతో ముఖ్యమైనది అందులో ముఖ్యంగా చివరి మూడు నెలలు తల్లి బిడ్డ ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన

ప్రెగ్నెన్సీలో చివర మూడు నెలలు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే.. 


గర్భం దాల్చిన దగ్గర్నుంచి ప్రతి సమయం ఎంతో ముఖ్యమైనది అందులో ముఖ్యంగా చివరి మూడు నెలలు తల్లి బిడ్డ ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఒకసారి చూద్దాం.. 

చివరి మూడు నెలల్లో పిండం అవయవ పరిణామం పూర్తిగా అయిపోయి ఉంటుంది కాబట్టి..  ఇప్పుడు పెరిగేది శిశివు బరువు మాత్రమే.. అందుకే ఈ సమయంలో తల్లులు బరువు పెరగడంతో పాటు ఆకలి కూడా ఎక్కువగా అనిపిస్తుంది అలాగే ఈ సమయంలో పొట్టభాగం మొత్తం గర్భసంచితో నిండిపోతుంది.. కాబట్టి కొద్ది కొద్ది మోతాదులో ఎక్కువసార్లు తినాలి.  
అదే విధంగా అధిక ఉప్పు, సీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినకూడదు. ఐస్ క్రీమ్స్, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి.. 

అలాగే వీలైనంత వరకు ఉదయం సాయంత్రం సమయంలో వాకింగ్ చేయడం మంచిది. వ్యాయామాలు ఈ సమయంలో పెద్దగా అవసరం లేదు అలాగే ఎక్కువ సేపు కూర్చోవడం నిలబడటం కూడా చేయరాదు.. వీలైతే పగటిపూట కాసేపు నిద్రపోవడం మంచిది పడుకున్నప్పుడు కూడా ఎడమవైపుకు తిరిగి నిద్రపోవటం అలవాటు చేసుకోవాలి.. దీనివల్ల గర్భాశయ భారం కాళ్లకు సరఫరాచేసే రక్తనాళాలపై పడకుండా ఉంటుంది.
ఈ కారణంతోనే నెలలు నిండే కొద్దీ కొంచెం కాళ్ల వాపులొచ్చేది. అలాగే మూత్రశయంపై ముత్తిడి పడటం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకే నీది ఎక్కువగా తాగుతూ మూత్ర విసర్జన చేయాలి.. అలాగే ఐరన్ కాల్షియం వంటి టాబ్లెట్లను కొనసాగించాలి ఈ సమయంలో కొందరికి ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల సాధారణ కానుపు అవ్వదని అపోహ ఉంటుంది కానీ ఇది నిజం కాదు సరిపడేంత ఆహారం తీసుకోవడం వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.