తల్లిపాలు బిడ్డకు ఎంత ముఖ్యమో తెలుసా… భవిష్యత్తులో ఈ  వ్యాధుల నుంచి కాపాడేవి తల్లిపాలే!

బిడ్డకు తల్లిపాలు చాలా ముఖ్యం. ముఖ్యంగా మొదటి ఆరు నెలల వరకు బిడ్డకు..  తల్లి పాలు చాలా అవసరం.  శిశువుల పోషకాహారం ఉత్తమ రూపం ఈ తల్లి పాలు. తల్లిపాలు ఇవ్వడం వల్ల.. తల్లి, బిడ్డ ఇద్దరికీ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా క్యాన్సర్ నుండి శిశువును రక్షించడానికి తల్లి పాలు చాలా మేలు చేస్తుంది. అవును ఇది నిజమని ఓ అధ్యయనం చెబుతోంది. అది ఏమని చెబుతుందో తెలుసుకుందాం

తల్లిపాలు బిడ్డకు ఎంత ముఖ్యమో తెలుసా… భవిష్యత్తులో ఈ  వ్యాధుల నుంచి కాపాడేవి తల్లిపాలే!


బిడ్డకు తల్లిపాలు చాలా ముఖ్యం. ముఖ్యంగా మొదటి ఆరు నెలల వరకు బిడ్డకు..  తల్లి పాలు చాలా అవసరం.  శిశువుల పోషకాహారం ఉత్తమ రూపం ఈ తల్లి పాలు. తల్లిపాలు ఇవ్వడం వల్ల.. తల్లి, బిడ్డ ఇద్దరికీ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా క్యాన్సర్ నుండి శిశువును రక్షించడానికి తల్లి పాలు చాలా మేలు చేస్తుంది. అవును ఇది నిజమని ఓ అధ్యయనం చెబుతోంది. అది ఏమని చెబుతుందో తెలుసుకుందాం....
Wean Your Baby From Breastfeeding To Formula – Forbes Health
అసలు నిపుణులు ఏమంటున్నారంటే..  తల్లి పాలలో యాంటీబాడీస్, ఎంజైమ్‌లు, రోగనిరోధక కణాలతో సహా అనేక రకాల ప్రయోజనకరమైన భాగాలు ఉన్నాయని అంటున్నారు. ఇది శిశువు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుందట. ఇన్ఫెక్షన్లు,వాపులను నివారించడానికి ఎంతగానో సహాయపడుతుందని చెబుతున్నారు. 
పలు అధ్యయనాలు ఏమి చెబుతున్నాయి?.. తల్లిపాలు  తక్కువ కాలం తాగిన వారితో వారితో పోలిస్తే.. కనీసం ఆరు నెలల పాటు తల్లిపాలు తాగిన వారికి లుకేమియా వచ్చే ప్రమాదం గణనీయంగా తక్కువగా ఉందని కనుగొన్నారు.
తల్లి పాలలో  ఒలిగోశాకరైడ్స్ వంటి బయోయాక్టివ్ పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నట్లు గుర్తించారు.  తల్లిపాలు క్యాన్సర్ నివారణ తో  పాటు అనేక ప్రయోజనాలను అందిస్తుంది.  శిశువు నిర్దిష్ట అవసరాలను తీర్చడం, అవసరమైన పోషకాలు అందించడం, ఆరోగ్యకరమైన పెరుగుదలను ప్రోత్సహించడం చేస్తుంది. భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోకుండా తల్లిపాలు కాపాడతాయి. 
ఎక్కువ కాలం పాటు తల్లిపాలు ఇవ్వటం వల్ల శ్వాసకోశ, జీర్ణశయాంతర వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. ఆకస్మిక శిశు మరణ సిండ్రోమ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  
భవిష్యత్తులో బిడ్డ ఎదుర్కొనే అలర్జీలు, ఆస్తమా, ఊబకాయం వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.