ప్రసరిత పదహస్తాసన :వెన్నుముకను సాగిదీకి కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది..!

యోగాలో ఎన్నో ఆసనాలు ఉంటాయి. మనకు తెలిసినవి చాలా తక్కువ. కొన్ని ఆసనాలు చాలా సింపుల్‌గా ఉంటాయి, మరికొన్ని కాస్త ప్రాక్టీస్‌ చేయాల్సి ఉంటుంది.

ప్రసరిత పదహస్తాసన :వెన్నుముకను సాగిదీకి కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది..!
Benefits of Prasarit Padottanasana



యోగాలో ఎన్నో ఆసనాలు ఉంటాయి. మనకు తెలిసినవి చాలా తక్కువ. కొన్ని ఆసనాలు చాలా సింపుల్‌గా ఉంటాయి, మరికొన్ని కాస్త ప్రాక్టీస్‌ చేయాల్సి ఉంటుంది. హైలెట్‌ ఏంటంటే.. చూసేందుకు సింపుల్‌గా కనిపించేవి చేయడం చాలా కష్టంగా ఉంటుంది. చూసేందుకు కష్టంగా అనిపించేవి ఒక సారి చేస్తే ఇంత తేలికనా అనిపిస్తుంది. ఉదరం, కీళ్ల సమస్యలు ఉన్నవారికి యోగాలో ఒక మంచి ఆసనం ఉంది. ఇది చేయడం కూడా అంత కష్టమేం కాదు. ఆ ఆసనం పేరు ప్రసరిత పదహస్తాసన. దీన్ని ఎలా వేయాలి, ఏంటి ప్రయోజనాలు మనం ఈరోజు తెలుసుకుందాం.!

ప్రసరిత పదహస్తాసన ఎలా వేయాలి.?

మీ పాదాలను 3-4 అడుగుల దూరంలో, సమతుల్యంగా మరియు దృఢంగా ఉంచి నిటారుగా నిలబడండి. లోతైన శ్వాసలను పీల్చుకోండి.
ఊపిరి పీల్చుకోండి, వెన్నెముకను పొడిగించండి, చేతులు పైకి చాచండి.
ఊపిరి పీల్చుకోండి, వెన్నుముకను నిటారుగా ఉంచుతూ, తుంటి కీళ్ల నుంచి ముందుకు వంగండి.
భుజాల క్రింద, నేలపై చేతులు ఉంచండి. పీల్చుకోండి, సున్నితమైన లోతైన శ్వాసలను వదులుకోండి.
తుంటిని పైకి లేపి, చేతుల మధ్య తలని నేల వైపుకు తీసుకురండి.
తొడలను వేరు చేయండి. మీరు స్థిరంగా ఉంటే, మీరు మీ పాదాలను మరింత దూరంగా వేరు చేయవచ్చు, సంతులనం, దృఢత్వాన్ని కొనసాగించవచ్చు.
ఈ భంగిమలో మీరు వీలైనంత సేపు ఉండండి.


 
ప్రసరిత పదహస్తాసనం యొక్క ప్రయోజనాలు

కాళ్ళు, పాదాలను బలపరుస్తుంది.
వెన్నెముకను పొడిగిస్తుంది.
హామ్ స్ట్రింగ్స్‌ను సాగదీస్తుంది.
పొత్తికడుపును బలపరుస్తుంది.
ఇది స్నాయువులను సాగదీస్తుంది. 
ఇది ఉదరం మరియు కీళ్ళను బలపరుస్తుంది.

వీరు చేయొద్దు..

దిగువ వెన్నునొప్పితో బాధపడుతున్న వ్యక్తులు పూర్తిగా సాగదీయడం మానుకోవాలి. వీరికి ఈ ఆసనం మరింత నొప్పిని కలిగించవచ్చు.

ఇది చెప్పే మీకు పూర్తిగా అర్థంకాకపోవచ్చు. ఈ ఆసనం ఎలా చేయాలో మీరు వీడియో ద్వారా చూస్తే బాగా క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇదే పేరుతో మీరు వీడియోలు చూడండి. సోషల్‌ మీడియాలో యోగా మీద చాలా కంటెంట్‌ ఉంది. హ్యాపీగా నేర్చుకోండి.! ప్రయోజనాలను పొందండి. యోగా ఒక వ్యాయామంలా కాకుండా అలవాటుగా మార్చుకుంటే రోజురోజుకు మీకు కొత్త ఉత్సాహం వస్తుంది. రకరకాలు ఆసనాలు నేర్చుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.